గ్రామాలను పరిశీలించండి
ABN , Publish Date - Jan 23 , 2026 | 01:00 AM
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, రౌడీ షీటర్ల కదలికలు అసాంఘిక వ్యక్తుల కార్య కలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని ఎస్పీ నరసింహ కిశోర్ ఆదేశించారు.
రాజమహేంద్రవరం, జనవరి 22 (ఆంధ్ర జ్యోతి): శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, రౌడీ షీటర్ల కదలికలు అసాంఘిక వ్యక్తుల కార్య కలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని ఎస్పీ నరసింహ కిశోర్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం జిల్లాలోని సర్కిళ్ల వారీగా నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహిం చారు. మహిళల భద్రతకు, రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన పటిష్ట చర్యలు తీసు కోవాలన్నారు. బ్లాక్ స్పాట్ ప్రదేశాల్లో డ్రోన్‌ల ద్వారా తరచుగా పర్యవేక్షణ చేయాలని ఆదేశిం చారు. ప్రతి కేసులో సాంకేతిక ఆధారాలను సేకరించి, అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించి దర్యాప్తు చేస్తే నేరస్తులకు శిక్షలు పడే శాతం పెరుగుతుందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, తాగి వాహనాలు నడపడం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారిం చాలన్నారు. తీవ్రమైన కేసుల్లో నిర్ణీత గడువు లోగా దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్లు వేయాలన్నారు. సొంతగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొనే విధంగా ప్రజలకు అవగా హన కల్పించాలని చెప్పారు. అనుమానిత, సమస్యాత్మక ప్రాంతాల్లో తరచుగా కార్డన్ సెర్స్ ఆపరేషన్స్ నిర్వహించాలన్నారు. పోలీసు అధికారులు తప్పనిసరిగా గ్రామాలను సంద ర్శించి పరిస్థితులను అంచనా వేస్తూ ఉండా లన్నారు. దాంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురయ్యే సమస్యలను అరికట్టడం సులభ తరం అవుతుందన్నారు.రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేయాలని, అనుమానితుల వేలి ముద్రలను ఎంఎస్‌డీ డివై జ్ ద్వారా తనిఖీ చేయాలని ఎస్పీ ఆదేశించారు.
తూర్పులోకి ఆ నాలుగు పోలీస్ స్టేషన్లు
కోనసీమ జిల్లా నుంచి మండపేట, రాయ వరం, కపిలేశ్వరపురం మండలాలను తూర్పు గోదావరి జిల్లాకు ప్రభుత్వం బదలాయించిన విషయం విధితమే. ఈ ప్రక్రియలో భాగంగా ఆయా మండలాల్లో పోలీస్ స్టేషన్లను జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం జీవో నెం.9 జారీ చేసింది.ఈ మేరకు ఇప్పటి వరకూ రామ చంద్రాపురం సబ్ డివిజన్‌లో ఉన్న మండ పేట అర్బన్ సర్కిల్, రూరల్, రూరల్ సర్కిల్ పరిధిలోని అంగర, రాయవరం పోలీస్ స్టేష న్లు ఇకపై తూర్పుగోదావరి జిల్లాలోని ఈస్ట్ జోన్‌లో కొనసాగుతాయి.జిల్లాలో నాలుగు పోలీస్ జోన్లు,ఒక సబ్ డివిజన్ ఉంది. వన్ టౌన్,టూటౌన్, ప్రకాశంనగర్ సెంట్రల్ జోన్, టూటౌన్, ధవళేశ్వరం,కడియం, బొమ్మూరు సౌత్‌జోన్, రాజానగరం, కోరు కొండ, సీతాన గరం,ఎయిర్‌పోర్ట్, గోకవరం నార్త్ జోన్‌లో ఉన్నాయి.కొవ్వూరు సబ్ డివిజన్‌లో కొవ్వూరు టౌన్,రూరల్, తాళ్లపూడి, చాగల్లు, నిడదవోలు, సమిశ్రగూడెం,పెరవలి, ఉండ్రాజవరం, దేవర పల్లి, గోపాలపురం, నల్లజర్ల ఉన్నాయి. కొత్త వాటి కలయికతో ఈస్ట్ జోన్ పరిధిలో ఉన్న బొమ్మూరు పోలీస్ స్టేషన్‌ని సౌత్ జోన్ పరిధి లోకి తెస్తారని చెబుతున్నారు.అప్పుడు ఈస్ట్ జోన్ పరిధిలో అనపర్తి సర్కిల్‌లోని అన పర్తి, బిక్కవోలు,రంగంపేట, కొత్తగా కలిసిన స్టేషన్లు ఉంటాయి.ఈస్ట్ జోన్ డీఎస్పీ కార్యాల యాన్ని ద్వారపూడి తరలించే ఆలోచన చేస్తున్నారు.