బూట్లో బుస్ బుస్..
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:27 AM
అమలాపురం రూరల్, మార్చి 17 (ఆం ధ్రజ్యోతి): బూట్లో దూరిన ఓ తా చుపాము బుసలు కొడుతూ హత లెత్తించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి రుద్రరాజు రామ లింగరాజు నగర్‌లోని కట్టా త్రినాథ్ ఇంటి వద్ద మంగళవారం రాత్రి తాచుపాము
హడలెత్తించిన తాచుపాము
అమలాపురం రూరల్, మార్చి 17 (ఆం ధ్రజ్యోతి): బూట్లో దూరిన ఓ తా చుపాము బుసలు కొడుతూ హత లెత్తించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి రుద్రరాజు రామ లింగరాజు నగర్‌లోని కట్టా త్రినాథ్ ఇంటి వద్ద మంగళవారం రాత్రి తాచుపాము పిల్ల హల్చల్ చేసింది. బూట్లు తొడుక్కుం దామని బయటకు వచ్చిన త్రినాథ్‌కు వాటి నుంచి ఓ రకమైన శ బ్దం వస్తుం డడంతో అనుమానం వచ్చింది. తాచు పాము బుసలుగా గుర్తించి వెంటనే స్నేక్ క్యాచర్ జంపన గణేష్ వర్మకు సమాచా రం అందించాడు. అక్క డకు చేరుకున్న వర్మ బూట్‌లో దూరిన పామును చాకచక్యంగా బయటకు తీసి డబ్బాలో బంధించాడు. బంధించిన పామును నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెడతానని తెలిపాడు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో దాహం కోసం తాచుపాములు బయటకు వస్తుంటాయని, బూట్లు వినియోగించేటప్పడు జాగ్రత్త వహించాలని వర్మ పేర్కొన్నాడు.