12 మందికి ఎస్‌ఐలుగా ఉద్యోగోన్నతి
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:21 AM
జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఏఎస్‌ఐలుగా పనిచేస్తూ ఎస్‌ఐలుగా ఉద్యోగోన్నతి పొందిన 1989 బ్యాచ్‌కి చెందిన 12 మందికి ఎస్పీ నరసింహ కిశోర్ అభినందనలు తెలిపారు.
రాజమహేంద్రవరం, జనవరి 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఏఎస్‌ఐలుగా పనిచేస్తూ ఎస్‌ఐలుగా ఉద్యోగోన్నతి పొందిన 1989 బ్యాచ్‌కి చెందిన 12 మందికి ఎస్పీ నరసింహ కిశోర్ అభినందనలు తెలిపారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్క ను అందించగా వారితో కాసేపు మాట్లాడారు. విధుల్లో నిబద్ధత, సేవా భావాలే ముందుకు నడిపి స్తాయన్నారు. ఎస్‌ఐలుగా ఉద్యోగోన్నతి పొం దిన డి.సమర్పణరావు, డి.పోలరాజు, యూవీవీ సత్యనారాయణ, కేవీవీ సత్యనారాయణ, పీవీ.సింహాచలం, వై.శ్రీనివాసు, ఏ.నాగేశ్వరరావు, వీవీవీ సత్యనారాయణ,ఎం.వీఎస్‌ఆర్.నాయుడు, ఏవీ వెంకటేశ్వరరావు, ఎస్‌ఏఎఫ్ రెహమాన్, ఎస్.నాగేశ్వరరావు సోమవారం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎస్‌ఐలుగా ఉద్యోగోన్నతి పొందిన వీరందరికీ యూనిఫాం షోల్డర్‌పై రెండో స్టార్‌ని ఎస్పీ