Share News

130 స్కూల్‌ ఆటోల సీజ్‌

ABN , Publish Date - Feb 01 , 2026 | 01:00 AM

కాకినాడ క్రైం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): స్కూల్‌ పిల్లలను తీసుకెళ్లే ఆటోలపై కాకినాడ జిల్లా పోలీసులు శనివారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఎస్పీ జి.బిందుమాధవ్‌

130  స్కూల్‌ ఆటోల సీజ్‌
ఆటోలను సీజ్‌ చేసిన కాకినాడ జిల్లా పోలీసులు

కాకినాడ క్రైం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): స్కూల్‌ పిల్లలను తీసుకెళ్లే ఆటోలపై కాకినాడ జిల్లా పోలీసులు శనివారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఎస్పీ జి.బిందుమాధవ్‌ ఆదేశాలతో కాకినాడ ఎస్‌డీపీవో దేవరాజ్‌ మనీష్‌పాటిల్‌ పర్యవేక్షణలో ఈ డ్రైవ్‌ నిర్వహించారు. ప్రభుత్వ అనుమతులకు వ్యతిరేకంగా నడుపుతున్న సుమారు 130 ఆటోలను సీజ్‌ చేశారు. వీటిలో పూర్తిగా రికార్డులు లేని కొన్ని ఆటోలను రవాణాశాఖ అధికారులకు అప్పగించి మిగిలిన ఆటో లపై పోలీసులు చలానాలు విధించారు. ముఖ్య ంగా పరిమితికి మించి స్కూల్‌ పిల్లలను ఆటో లో ఎక్కించుకుని తీసుకెళ్లరాదన్నారు. పలు విష యాలపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. డ్రైవ్‌లో కాకినాడ ట్రాఫిక్‌ సీఐలు ఎన్‌.రమేష్‌, డి. రామారావు, వన్‌టౌన్‌ సీఐ ఎం.నాగదుర్గారావు, త్రీటౌన్‌ సీఐ కె.సత్యనారాయణ, పోర్ట్‌ సీఐ పి. సునీల్‌కుమార్‌, ఎంవీఐలు హరినాధ్‌రెడ్డి, గౌరిశంకర్‌, ట్రాఫిక్‌ ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2026 | 01:00 AM