పల్లెకు.. పండుగ!
ABN , Publish Date - Jan 11 , 2026 | 01:03 AM
’’సందల్లె సందళ్లు..సంక్రాంతి సందళ్లే.. అంగరంగ వైభవంగా.. సంక్రాంతి సందళ్లే..మన ఊరితో సమ యాన్నిలా. .గడిపేయడం ఒక సరదారా..
ఉమ్మడి జిల్లాకు సంక్రాంతి కళ
భోగిమంటలు,రంగవల్లులతో సందడి
పిండివంటల ఘుమఘుమలు
జాతరలు,తీర్థాల సన్నాహాలు షురూ
వస్త్రదుకాణాలన్నీ కిటకిట
హైవేలు,బస్టాండ్లు,రైల్వేస్టేషన్లు కిటకిట
పందేలకు సీఎం,డిప్యూటీ సీఎం ఓకే?
(కాకినాడ/రాజమహేంద్రవరం,ఆంధ్రజ్యోతి)
’’సందల్లె సందళ్లు..సంక్రాంతి సందళ్లే.. అంగరంగ వైభవంగా.. సంక్రాంతి సందళ్లే..మన ఊరితో సమ యాన్నిలా. .గడిపేయడం ఒక సరదారా..మనవారితో కలిసుండడం ఓక వరమేరా’’ ఇదీ..సంక్రాంతి పండగ సందడి గురించి కొన్నేళ్ల కిందట విడుదలైన ఓ సినిమాలో పాట.. గోదారి జిల్లాలో జరిగే సంక్రాంతి పండుగ గురించి వర్ణించడానికి మాటలు చాలవు.. పాటలు సరిపోవు.. సంక్రాంతి అంటేనే గోదారి జిల్లా.. గోదారి జిల్లా అంటేనే సంక్రా ంతి.. సరదాలు.. సంబరాలు.. ఆప్యాయ పలకరింపులు..పచ్చని పల్లెల మధ్య సరదా సరదా భోగిమంటలు.. హరిదాసుల సందళ్లు.. రంగవల్లులు.. అయితే... ఇవన్నీ అప్పుడే మొదలై పోయాయి. ఒకరకంగా చెప్పాలంటే గోదారి జిల్లాకు సంక్రాంతి శోభ ముందే వచ్చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పల్లెలు,పట్టణాల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఆరంభించేశారు. అనేక చోట్ల ముం దస్తుగా భోగి పిడకలతో మంటలు..రంగవల్లుల పోటీలు హోరెత్తుతున్నాయి. పండగకు ఈ దఫా శనివారం నుంచి వచ్చే శనివారం వరకు వరుసగా హాలీడే కావడంతో ఎక్కడెక్కడో ఉన్న జనం కార్లు, బస్సులు, రైళ్లు,విమానాల్లో సొంతూళ్ల బాట పట్టారు. శనివారం సాయంత్రానికి హైద రాబాద్, విజయవాడ, చైన్నై, బెం గళూరు ఇలా అనేక ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చే వారితో హైవేలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిశాయి. వందలాది కార్లతో హైవే టోల్ గేట్లు రద్దీగా మారాయి. అటు పల్లెలకు చాలా మంది చేరు కోవడంతో అప్పుడే గ్రామాల్లో పండగ జోష్ మొదలైంది. కుటుం బాలు, బంధువుల ఆప్యాయ పలకరింపులు.. స్నేహి తుల ముచ్చట్లతో పండగ కళ ఉమ్మడి జిల్లాలో ఉట్టిప డుతోంది. మరో పక్క పిండివంటల ఘుమ ఘుమలు నోరూరిస్తున్నాయి. అంతేకాదు అప్పుడే కోనసీమ, కాకినాడ,తూర్పుగోదావరి జిల్లాల్లో కోడిపందేల బరుల సన్నా హాలు.. గ్రామాల్లో జాతరలు..తీర్థాల ఏర్పాట్లు పండగ కళను పెంచుతున్నాయి. బుధవారమే భోగి పండగ కావ డంతో యువత సన్నాహాలు చేస్తోంది. పెద్దపండగ మూడు రోజులకు కొత్తదుస్తులు ధరించడం ఆనవాయితీ కావడంతో వస్త్ర దుకాణాలు కిక్కిరిసిపోయాయి.విక్రయాలు కోట్లు దాటే శాయి. ఆఫర్లతో దుకాణాలు కస్టమర్లను ఊరిస్తున్నాయి.
బస్‌లు.. రైళ్లు ఫుల్..
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు ఫుల్ అయిపోయాయి. రోజూ కాకినాడ, రాజమ హేంద్రవరం,అమలాపురానికి హైదరాబాద్, విజ యవాడ నుంచి పదుల సంఖ్యలో బస్సులుండగా శనివారం నుంచీ అవన్నీ ఫుల్ అయిపోయాయి. ఎక్కడా రిజర్వేషన్ అనేదే దొరకడం లేదు. సంక్రాం తి స్పెషల్ బస్సులు సైతం కిక్కిరిసిపోయాయి. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్ రెచ్చిపోతున్నాయి. విజయ వాడ నుంచి రాజమహేంద్రవరానికి రూ.2 వేల వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. రాజమ హేంద్రవరం, సామర్లకోట మీదుగా ప్రయాణించే ఇరవైకి పైగా రైళ్లలో ఒక్కదాంట్లో కూడా సీట్లు దొరకడం లేదు. చివరకు అనేక రైళ్లకు జనరల్ టికెట్లు కూడా జారీచేయడం నిలిపివేశారు. మరోపక్క హైదరాబాద్ నుంచి రాజమ హేంద్రవరానికి రోజూ ఇండిగో ఎనిమిది వరకు విమాన సర్వీసులు ఉండగా, అవన్నీ అధిక ధరలున్నా సరే బుక్ అయిపోయాయి. ఇప్పుడైతే ఏకంగా ఒక్క విమాన సర్వీసు కూడా ఆన్‌లైన్‌లో చూపించడం లేదు.
వందల్లో వెయిటింగ్..
వందే భారత్‌కి హైదరాబాద్ నుంచి రూ.1385 టికెట్ ధర ఉన్నప్పటికీ వెయి టింగ్ లిస్ట్ 191 చూపెడుతోంది. చివరికి జన్మభూమిలో కూడా వెయిటింగ్ లిస్టు 290 దాటిపోయింది. గరీబ్‌రథ్, గోదా వరి, గౌతమి, నాందేడ్ విశాఖతో పాటు రైల్వే స్పెషల్ రైళ్లు వికారాబాద్ పార్వతీపురం, సికింద్రాబాద్ శ్రీకాకుళం, చర్లపల్లి విశాఖపట్నం, చర్లపల్లి కాకినాడ, సికింద్రాబాద్ కాకినాడ, మైసూరు కాకినాడ, సికింద్రాబాద్ అనకాపల్లి రైళ్లలో అసలు రిజ ర్వేషను టికెట్లు లేవు. దీంతో అటు నుంచి గోదావరి జిల్లాలకు రావడానికి ప్రైవే టు ట్రావెల్స్ బస్సులపై ఆధారపడు తు న్నా రు. బెంగళూరు నుంచి ఇదే పరిస్థితి ఉంది.
పందేలకు ఓకేనా?
గోదారి జిల్లాలో సం క్రాంతి అంటే కోడిపందేలు. ఇదిలేనిదే పండగ లేదు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కోడిపందేలకు బరులు సిద్ధం చేసేస్తున్నారు. పుంజులను కూతెట్టించడానికి సన్నాహాలు ఆరంభించేశారు.ఇదే సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకేరోజు ఉమ్మడి జిల్లా పర్యటనలో శుక్రవారం స్పష్టతనివ్వడంతో కోడిపందేల జోష్ పెరిగినట్లయింది. గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే కోడిపందేలు గుర్తుకొ స్తాయని..వాటిని వినోదంగానే చూద్దామని, జూదాల జోలికి వెళ్లవద్దని హితవు పలికారు. అటు పవన్ కళ్యాణ్‌సైతం గోదారి జిల్లా అంటే సంక్రాంతికి కోడిపందేలని, అయితే ఇవి సరదాకు అయితే ఒకే అని, కాకపోతే ప్రత్యేకంగా ఉండకూడదని స్పష్టతనిచ్చారు. దీంతో కోడిపందేలు సరదాకు నిర్వహించుకునేవారికి జోష్ నింపినట్లయింది.