Share News

సంక్రాంతి ఉత్సవాలను సమర్థవంతంగా నిర్వహించండి!

ABN , Publish Date - Jan 03 , 2026 | 02:03 AM

ఈనెలలో సంక్రాంతి, అంతర్వేది ఉత్సవాలను సమర్థవంతంగా నిర్వహించాలని జేసీ నిషాంతి రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు

సంక్రాంతి ఉత్సవాలను సమర్థవంతంగా నిర్వహించండి!

అమలాపురం, జనవరి 2 (ఆంధ్ర జ్యోతి): ఈనెలలో సంక్రాంతి, అంతర్వేది ఉత్సవాలను సమర్థవంతంగా నిర్వహించాలని జేసీ నిషాంతి రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. అమలాపురంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా నిషాంతి మాట్లాడుతూ భూమి రికార్డుల మ్యూటేషన్లు, రీసర్వే అభ్యంతరాలపై దరఖాస్తుల స్వీకరణ, పెండింగ్‌, తిరస్కరణ, పరిష్కారం వంటి అంశాలపై సెక్షన్ల వారీగా ఆమె సమీక్షించారు. మరికొన్ని రోజుల్లో జరిగే సంక్రాంతి ఉత్సవాలు, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి కల్యాణోత్సవాలను అధికారులు సమన్వయంతో విజయవంతంచేయాలని ఆదేశించారు. సమగ్ర భూసర్వే, రీసర్వే పురోగతి, ఎఫ్‌ఎంబీ, అడంగల్‌, 1బి అప్‌డేషన్‌, డిజిటల్‌ రికార్డుల్లోని లోపాలను సరిదిద్దాలని సూచించారు. రిజర్వు అనంతరం రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను సకాలంలో పంపిణీ చేయాలన్నారు. 22ఏ నిషేధిత జాబితా, చుక్కల భూములు, అసైన్డ్‌ల్యాండ్స్‌ రెగ్యులరైజేషన్‌ వంటి అంశాల పట్ల శ్రద్ధ వహించాలన్నారు. రెవెన్యూ, నీటిపన్ను, నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ట్యాక్స్‌, నాలాపన్ను సేకరణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఆక్రమణల గుర్తింపు, తొలగింపు అంశాలపై చర్యలు తీసుకోవాలన్నారు. కుల ఆదాయం, స్థానిక నివాసం, ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్ల జారీ టైమ్‌లైన్‌లో చేపట్టాలన్నారు. డీఆర్వో కె.మాధవి రెవెన్యూ సమస్యలపై మాట్లాడారు. ఏవో కాశీవిశ్వేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 02:03 AM