పరిమితి దాటి ప్రయాణం!
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:42 AM
చింతూరు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా చింతూరు మండలం తులసిపాకల వద్ద శుక్రవారం రాత్రి గోకవరం ఆర్టీసీ డిపో బస్సు పంక్చర్ అయ్యి నిలిచిపోయింది. రాజమండ్రి నుంచి వయా చింతూరు మీదుగా భద్రాచలం చేరుకోవాల్సిన బస్సు ఘాట్ దిగిన కొద్ది నిమి షాలకే తులసిపాకల వద్ద టైర్ పం క్చర్ అయ్యింది. దీంతో బస్సు నిలిపివేసి డ్రైవరు, కండక్టర్ టైర్ మార్చారు. బస్సు రాత్రి సమయంలో నిలిచి పోవడం, దీనికి తోడు చలి ఎక్కువగా ఉండ డంతో ప్రయాణికు
టైర్ పంక్చర్ అయ్యి తులసిపాకల
వద్ద నిలిచిన ఆర్టీసీ బస్సు
చలికి వణికిన ప్రయాణికులు
చింతూరు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా చింతూరు మండలం తులసిపాకల వద్ద శుక్రవారం రాత్రి గోకవరం ఆర్టీసీ డిపో బస్సు పంక్చర్ అయ్యి నిలిచిపోయింది. రాజమండ్రి నుంచి వయా చింతూరు మీదుగా భద్రాచలం చేరుకోవాల్సిన బస్సు ఘాట్ దిగిన కొద్ది నిమి షాలకే తులసిపాకల వద్ద టైర్ పం క్చర్ అయ్యింది. దీంతో బస్సు నిలిపివేసి డ్రైవరు, కండక్టర్ టైర్ మార్చారు. బస్సు రాత్రి సమయంలో నిలిచి పోవడం, దీనికి తోడు చలి ఎక్కువగా ఉండ డంతో ప్రయాణికులు చలికి వణికిపోయారు. కాగా బస్సులో పరిమితికి మించి ప్రజలు ప్ర యాణిస్తున్నారు. ఇటీవల ఘాట్‌లో ప్రమాదాలు జరుగుతున్నా ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్ర యాణికుల పరిమితిని నియంత్రించలేక పోవ డం విడ్డూరం. బస్సు తిరిగి పయనమయ్యేం దుకు ఆలస్యం కావడంతో వారిలో కొద్దిమంది ప్రయాణికులు ఆటోలపై వారి ఇళ్లకు వెళ్లారు. టైర్ మర్చాక బస్సు భద్రాచలం బయలుదేరింది.