యానాం రహదారులకు మహర్దశ
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:20 AM
కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో నాలుగురహదారుల అభి వృద్ధికి కేంద్రం నిధులు కేటాయించడంతో ఇక్కడి రోడ్లకు మహర్దశ పట్టనుంది.
యానాం,జనవరి 6(ఆంధ్రజ్యోతి): కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో నాలుగురహదారుల అభి వృద్ధికి కేంద్రం నిధులు కేటాయించడంతో ఇక్కడి రోడ్లకు మహర్దశ పట్టనుంది. కేంద్రం సెంట్రల్ రోడ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పథకంలో భాగంగా రెం డు రోడ్లకు రూ.30.25కోట్లు నిధులను జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ మంజూరు చేసిందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మంగళవారం తెలిపారు. వీటిలో కురసాంపేట జంక్షన్‌నుంచి సావిత్రినగర్‌వరకు రూ.23 కోట్లు, ఓల్డ్ బస్టాండ్‌నుంచి మూడుతూముల వర కు రూ.7కోట్ల25లక్షలు కేటాయించారు. దీనికి సం బంధించిన ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి శశిభూ షణ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ని ధుల విడుదులకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రి గడ్కరీ, పుదుచ్చేరి గవర్నర్ కైలాస్‌నాథన్, సీఎం రంగసామి,ప్రజాపనులశాఖ మంత్రి లక్ష్మీనారాయణ, పుదుచ్చేరి, యానాం అధికారులకు మల్లాడి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపా రు. ఇప్పటికే కనకాలపేట బోర్డర్‌నుంచి జెండాస్తం భం వరకు రూ.10కోట్ల మేర నిధులు విడుదల చేయగా ద్రాక్షారామ రోడ్డునుంచి మూడుతూముల వరకు రూ.10కోట్లు నిధులు మంజూరయ్యాయి.