216ఇ హైవే వైపు అడుగులు
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:31 AM
కోనసీమ జిల్లాలో మరో జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
(అమలాపురం- ఆంధ్రజ్యోతి)
కోనసీమ జిల్లాలో మరో జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం సమీపంలోని 216 జాతీయ రహదారి నుంచి 216-ఏ జాతీయ రహదారికి ఈ రహదారిని అనుసంధానం చేయనున్నారు. అమలాపురం వయా పలివెల మీదుగా ఏర్పాటయ్యే ఈ జాతీయ రహదారికి 216ఇగా నామకరణం చేశారు. ఈ రహదారిని రూ.630 కోట్ల అంచనా వ్యయంతో అభి వృద్ధి చేయడానికి కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ గతంలోనే బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. అయితే అమలాపురం రూరల్ మండ లం పేరూరు గ్రామం నుంచి 22 గ్రామాల పరి ధి నుంచి వెళ్లే 216ఇ రహదారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబరు 30న గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించింది. దీనిలో భా గంగా కోనసీమ జిల్లా పరిధిలోని 22 గ్రామాల మీదుగా వెళ్లే ఈ రహదారి, అభివృద్ధి విస్తరణకు ఈనెల 8వ తేదీన ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ సమాచారం ప్రజల్లోకి వెళ్లలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా 22 గ్రామా ల పరిధిలో 727 మందికి చెందిన రైతులు, ని వాస గృహాల యజమానులతోపాటు ప్రభుత్వ పోరంబోకు భూములు సైతం 55.971955 హె క్టార్ల భూమి సేకరణకు సంబంధించి భూసేకరణ ప్రకటన గడువు ఈనెల 28తో ముగియనుంది. 0.000 కిలోమీటర్ల నుంచి 31.600 కిలో మీటర్ల మేర 216ఇ రహదారిని అభివృద్ధి చేసే ప్రాతిపదికన ప్రకటన వెలువడింది. అయితే రైతుల పేర్లుగాని, గృహాలు కోల్పోయే వారి జాబితాగాని లేకుండా సర్వే నెంబరు, భూముల వివరాలతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే 22 గ్రామాలకు చెందిన 727 మందికి చెందిన రైతుల, ఇళ్లు కోల్పోయే వారి జాబితా తాజాగా తెలుసుకుని బాధితులు లబోదిబోమంటున్నారు. అమలాపురం పట్టణంలోని ఈదరపల్లి వంతెన నుంచి మొసలపల్లి, ముక్కామల, అవిడి, ఖండ్రిగ, పలివెల, వెదిరేశ్వరం, లక్ష్మీపోలవరం మీదుగా కోల్‌కత్తా- చైన్నై రహదారికి అనుసంధానంగా జరిగేలా భూసేకరణ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈదరపల్లి నుంచి ఇందుపల్లి, పేరూరు వరకూ వెళ్లే రహదారి ఎలైన్‌మెంట్‌ను కొందరి ప్రయోజనాలకు అనుగుణంగా ఎన్‌హెచ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేయడంతో ఇందుపల్లి గ్రామంలోని బ్రాహ్మణ అగ్రహారంలోని కొన్ని ఇళ్లతోపాటు పలు ప్రాంతాల్లో పక్కా గృహాలు ఈ భూసేకరణ ప్రక్రియలోకి రావడంతో ఆయా గ్రామాల ప్రజ లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గ్రీన్‌ఫీల్డ్ రహదారిగా పేర్కొంటూ విస్తరింపజేస్తున్న అధికారులు ఈదరపల్లి నుంచి ఇందుపల్లి మీదుగా కరకట్టు మీదుగా రహదారిని అభివృద్ధి చేస్తే నివా స గృహాలకు నష్టం ఉండదని ప్రజలు కోరుతున్నారు. మొత్తం మీద 216ఇ భూసేకరణ ప్రకటన సమాచారం గోప్యంగా ఉండేలా అధికారు లు తీసుకున్న జాగ్రత్తలు ఇప్పుడు బహిర్గతవుతున్నాయి. భూసేకరణ ప్రక్రియకు సంబంధిం చి విడుదల చేసిన ప్రకటనపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. గడువు తక్కువ ఉండడంతో బాఽధిత రైతులు, నివాస గృహా యజమానులు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమతున్నట్టు సమాచారం.