పుష్కర పనులు ఆరంభించండి
ABN , Publish Date - Jan 23 , 2026 | 01:02 AM
పుష్కరాల పనులు వెంటనే ఆరంభిం చడంతో పాటు వేగంగా పూర్తి చేయాలని విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ (డీఆ ర్‌ఎం) మోహిత్ సోనాకియా ఆదేశించారు.
రాజమహేంద్రవరం, జనవరి 22 (ఆంధ్ర జ్యోతి): పుష్కరాల పనులు వెంటనే ఆరంభిం చడంతో పాటు వేగంగా పూర్తి చేయాలని విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ (డీఆ ర్‌ఎం) మోహిత్ సోనాకియా ఆదేశించారు. రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు, కడియం రైల్వే స్టేషన్లను గురువారం పరిశీలించారు. రాజమండ్రి,గోదావరి, కొవ్వూరు రైల్వే స్టేషన్లలో పుష్కరాల పనులకు సంబంధించి మ్యాప్‌ల సహాయంతో ఎక్కడ ఏమి నిర్మిస్తారో అధికా రులను అడిగి తెలుసుకున్నారు. రాజ మండ్రి లో తూర్పు, పశ్చిమ వైపు విస్తృతంగా పర్యటిం చారు. ఎఫ్‌వోబీలు, ఎస్కలేటర్లు, యాత్రికులకు వసతి, సర్క్యులేటింగ్ తదితర ప్రాంతాలను చూశారు. రాజమండ్రిలోని కోల్ యార్డును కడి యం తరలించే ప్రతిపాదన ఇప్పటికే ఉండ డంతో ఆ ప్రదేశాన్ని చూశారు. ఐఎల్‌టీడీ గేటు, ఎంసీఎస్ బ్లాక్ వద్ద మూడేళ్లుగా పెం డింగ్‌లో ఉన్న అధునాతన డ్రైనేజీ బ్లాక్‌ల నిర్మాణానికి సంబంధించి అధికారులకు సూచ నలు చేశారు. అనంతరం పుష్కర పనులపై అధికారులతో సమీక్షించారు. పుష్కరాలకు ముందే పనులు పూర్తి కావాలని ఆదేశించారు. ప్రతి పనికి నిర్దిష్ట కాలాన్ని నిర్దేశించు కొని ఆ మేరకు ప్రోగ్రెస్ ఉండేలా చూసుకోవాలని, ప్రతి వారం తనకు పనుల పురోగతిపై రిపోర్టు అందజేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఉదయం 10 గంటలకు రాజ మండ్రి చేరుకుని మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తిరుగు పయనమయ్యారు. కొద్ది రోజుల్లో నిడదవోలు బ్రాంచి లైను జీఎం సేఫ్టీ తనిఖీలు ఉన్నాయి. దీంతో డీఆర్‌ఎం ఆయా స్టేషన్లలో ముందస్తు తనిఖీలు చేస్తున్నారు. ఈ కోటాలో నిడదవోలు వచ్చిన ఆయన.. రాజ మండ్రి, గోదావరి, కొవ్వూరులోని పుష్కరాల పనులపై సమీక్ష చేశారు.కార్యక్రమంలో సీనియర్ డీవోఎం సురేష్ రెడ్డి, సీనియర్ డీఈఎన్ గౌతమ్, ఏడీఈఎన్ ముత్యాలరావు, ఎస్‌ఎంఆర్ రంగనాథ్, సీటీఐ చంద్రమౌళి, ఆర్పీఎఫ్ ఇన్స్‌పెక్టర్ రాజు తదితర డివిజనల్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.