Share News

పుష్కర..గోదారి!

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:54 AM

గోదావరి పుష్కరాలు దగ్గర పడు తున్నాయి. 2027 జూన్‌లో పుష్కరాలు నిర్వ హించనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం అధికా రికంగా ప్రకటించింది.

పుష్కర..గోదారి!

రూ.445.44 కోట్ల ప్రతిపాదనలు

పాతవి 234.. 69 ఘాట్లు విస్తరణ

కొత్తగా 125 ఘాట్లకు అంచనా

ప్రభుత్వానికి నివేదిక అందజేత

గ్రీన్‌సిగ్నల్‌కు ఎదురుచూపు

త్వరలోనే పనులు ఆరంభం

రాజమహేంద్రవరం, జనవరి 18 (ఆంధ్ర జ్యోతి) : గోదావరి పుష్కరాలు దగ్గర పడు తున్నాయి. 2027 జూన్‌లో పుష్కరాలు నిర్వ హించనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం అధికా రికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధి కారులు పుష్కరాలను సన్నద్ధమవుతున్నా రు. ముందుగా ఘాట్ల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వా నికి పంపారు.అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిన వెంటనే పనులు ప్రారంభించను న్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబే డ్కర్‌ కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల పరిధిలో స్నాన ఘట్టాలు నిర్మించనున్నా రు. పాత ఘాట్లు 234 ఉండగా వాటిలో 69 ఘాట్ల విస్తరణకు నిర్ణయి ంచా రు. 125 కొత్త ఘాట్లు నిర్మించనున్నారు. వచ్చే గోదావరి పుష్కరాలకు మొత్తం 359 స్నాన ఘట్టాలు సిద్ధం చేయడానికి రూ.445.44 కోట్లతో ప్రతిపాదనలు చేశారు.

కొత్తగా 125 ఘాట్లు..

కొత్తగా 125 స్నాన ఘట్టాలు నిర్మించ నున్నారు. వీటిని 2196 మీటర్ల మేర రూ.127.46 కోట్లతో నిర్మించనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 29 ఘాట్లు 828 మీటర్ల మేర నిర్మాణా నికి రూ.29.75 కోట్లు,పశ్చిమగోదావరి జిల్లాలో 8 ఘాట్లు 140 మీటర్ల మేర నిర్మాణానికి రూ.11. 58 కోట్లు, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో కొత్తగా 70 ఘాట్లు 1001 మీటర్ల మేర రూ.68. 63 కోట్లు, కాకినాడ జిల్లాలో కొత్తగా 2 ఘాట్లు 87 మీటర్ల మేర రూ.1.8 కోట్లు, ఏలూరు జిల్లాలో కొత్తగా 16 ఘాట్లు 140 మీటర్ల మేర రూ.16.41 కోట్ల తోనూ నిర్మించనున్నారు.

69 పాత ఘాట్లు విస్తరణ..

234 పాత స్నాన ఘట్టాల్లో 69 ఘాట్లను విస్తరించనున్నారు. మొత్తం రూ.141.10 కోట్లతో 3206 మీటర్ల పొడవున అదనంగా విస్తరించను న్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 45 పాత ఘాట్లు 2835 మీటర్ల పొడవున విస్తరించడానికి రూ.149.96 కోట్లు అంచనా వేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 12 పాత ఘాట్లు 172 మీటర్ల మేర విస్తరించడానికి రూ.13.90 కోట్లు అంచ నా వేశారు. డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా లో ఆరు పాత ఘాట్లను 118 మీటర్ల మేర విస్తరించడానికి రూ.7.85 కోట్లు అంచనా వేశా రు.కాకినాడ జిల్లాలో 4 ఘాట్లు 21 మీటర్ల మేర పెంచడానికి రూ.67.73 లక్షలతో అంచనా వేశా రు.ఏలూరు జిల్లాలో 2 ఘాట్లు 60 మీటర్ల మేర విస్తరణకు రూ.3.71 కోట్లతో అంచనా వేశారు.

పాత ఘాట్లకు మరమ్మతులు

పాత ఘాట్లు మొత్తం 234 ఉండగా వాటి మొత్తం పొడవు 4516.30 మీటర్లు. మర మ్మ తులకు రూ.176.88 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 73 ఘాట్లు పొడవు 2684.30 మీటర్లు మరమ్మ తులకు రూ.59.52 కోట్లు.పశ్చిమగోదావరి జిల్లాలో 32 ఘాట్లు పొడవు 451 మీటర్లు మరమ్మతులకు రూ.39.43 కోట్లు.డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 105 ఘాట్లు పొడవు 1213.5 మీట ర్లు మరమ్మతులకు రూ.71.61 కోట్లు, కాకి నాడ జిల్లాలో 4 పాత ఘాట్లు పొడవు 26.5 మీటర్లు మరమ్మతులకు రూ.1.10 కోట్లు. ఏలూరు జిల్లాలో 20 ఘాట్లు పొడవు 141 మీటర్లు. మరమ్మతులకు రూ.5.20 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు.

ఏ జిల్లాలో ఎన్ని ఘాట్లు

పాతవి కొత్తవి కలిపి తూర్పుగోదావరి జిల్లా లో మొత్తం 102 ఘాట్లకు రూ.204.24 కోట్లు ఖర్చు చేయనున్నారు.పశ్చిమగోదావరి జిల్లాలో మొ త్తం 40 ఘాట్లు రూ.64.91 కోట్లు ఖర్చు చేయ నున్నారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 175 ఘాట్లు రూ.148.09 కోట్లు ఖర్చు చేయను న్నా రు.కాకినాడ జిల్లాలో 6 ఘాట్లు రూ.2.86 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఏలూరు జిల్లాలో 36 ఘా ట్లు రూ.25.32 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు అంచనాలు సిద్ధం చేశారు.

Updated Date - Jan 19 , 2026 | 12:54 AM