Share News

గోదారి..మారుతుందోచ్‌!

ABN , Publish Date - Jan 21 , 2026 | 01:03 AM

గోదావరి ఏటిగట్లు పటిష్టం చేయడంతో పాటు బీటీ రోడ్లుగా నిర్మించనున్నారు.

గోదారి..మారుతుందోచ్‌!

ఏటిగట్టు రోడ్‌

ధవళేశ్వరం టూ సీతానగరం

విజ్జేశ్వరం టూ సిద్ధాంతం

రూ.704 కోట్ల ప్రతిపాదనలు

కాటన్‌ బ్యారేజీ మరమ్మతులు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

గోదావరి ఏటిగట్లు పటిష్టం చేయడంతో పాటు బీటీ రోడ్లుగా నిర్మించనున్నారు. ధవ ళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌ కార్యాలయాల్లోని ఇంటర్నల్‌ రోడ్లు నిర్మించనున్నారు. పార్కులు సుందరీకరించనున్నారు.గోదావరి పుష్కరాలకు వీటిని సిద్ధం చేయడానికి రూ.704.71 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. తూ ర్పుగోదావరి జిల్లాలో 15 పనులకు రూ.381.83 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 4 పనులకు రూ139.80 కోట్లు, కోనసీమ జిల్లాలో 3 పను లను రూ.183.08 కోట్లతో చేపట్టనున్నారు. ఽ

తూర్పున ఇలా..

అఖండ గోదావరి లెఫ్ట్‌ బ్యాంక్‌ (ఏటిగట్టు) ను ధవళేశ్వరం నుంచి సీతానగరం మండలం లోని పురుషోత్తపట్నం వరకూ 7.5 మీటర్ల వెడల్పున విస్తరించి బీటి రోడ్డు వేయనున్నారు. ఈ రోడ్డును మూడు ప్యాకేజీలుగా చేయను న్నారు. ధవళేశ్వరం పరిధిలో సుమారు 13 కిలోమీటర్లు రూ.117.03 కోట్లు, రాజమహేం ద్రవరం సిటీ పరిధిలో 2 కిలోమీటర్ల మేర రూ.34.04 కోట్లు, సీతానగరం మండలంలోని బొబ్బిల్లంక నుంచి పురుషోత్తపట్నం వరకూ 14 కిలోమీటర్ల మేర రూ.117.03 కోట్లతో ఏటిగట్టును బీటీ రోడ్డుగా అభివృద్ధి చేయను న్నారు. వశిష్ట గోదావరి రైట్‌ బ్యాంక్‌ సైడ్‌ విజ్జే శ్వరం నుంచి సిద్ధాంతం వరకూ 33 కిలోమీ టర్ల మేర రూ.65 కోట్లతో ఏటిగట్టును బీటీ రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు. ధవళేశ్వరం కాటన్‌ మ్యూజియం ఆధునీకరణకు రూ.3.82 కోట్లు, బ్యారేజి మరమ్మతులకు రూ.18.50 కోట్లు, ధవళేశ్వరంలోని పార్కులు, బొబ్బర్లంక ఆర్చ్‌ పునర్నిర్మాణానికి రూ.4.60 కోట్లతో అంచ నాలు తయారు చేశారు. ధవళేశ్వరంలోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య పార్కు మరమ్మతు లకు రూ.3 కోట్లు, మద్దూరు, విజ్జేశ్వరం లాకులు, ఆర్మ్‌ల అభివృద్ధికి రూ.5.15 కోట్లు, కాటన్‌ మ్యూజియం ఎదురుగా ఉన్న పిల్లల పార్కు అభివృద్ధికి రూ.2.5 కోట్లు, ధవళేశ్వ రంలో ఇరిగేషన్‌ భవనాల నిర్మాణానికి రూ.1.5 కోట్లు, బ్యారేజి క్లీనింగ్‌, సెక్యూరిటీకి రూ.31.25 లక్షలు బారికేడ్లకు రూ.5.14 కోట్లు, నాలుగు మెకనైజ్డ్‌ పంట్లు కొనుగోలుకు రూ.3.33 కోట్లు ప్రస్తుతం ఉన్న 3 పంట్లు మరమ్మతులకు రూ.87.65 లక్షలతో ప్రతిపాదనలు చేశారు.

కోనసీమ జిల్లాలో..

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పి.గన్నవరం, రాజోలు, మలికిపురం వరకూ ఏటిగట్టును పటిష్టపరచడానికి రూ.55.88 కోట్లు, పి.గన్న వరం నుంచి మామిడికుదురు వరకూ వైన తేయ ఫ్లడ్‌ బ్యాంక్‌ అభివృద్ధికి రూ.77.20 కోట్లు, ఆత్రేయపురం నుంచి రావులపాలెం వర కూ ఫ్లండ్‌ బ్యాంక్‌ అభివృద్ధికి రూ.50 కోట్లు ఖర్చు చేయనున్నారు.ఈ మూడు పనులను రూ.183. 08 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు.

Updated Date - Jan 21 , 2026 | 01:03 AM