ప్రజాసమస్యల పరిష్కారం మన బాధ్యత
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:07 AM
ప్రజా సమస్యల పరిష్కారం మన బాధ్యత అని, తప్పక పారదర్శకంగా పరిష్కారం చూపాలని రాజమహేంద్రవ రం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్‌మీనా వివిధ విభాగాల అధికారులకు సూ చించారు. సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్య ల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు.
పీజీఆర్‌ఎస్‌లో నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్‌మీనా
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారం మన బాధ్యత అని, తప్పక పారదర్శకంగా పరిష్కారం చూపాలని రాజమహేంద్రవ రం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్‌మీనా వివిధ విభాగాల అధికారులకు సూ చించారు. సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్య ల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు.ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీల్లో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 4, రెవెన్యూ విభాగానికి 1, టౌన్ ప్లానింగ్‌కు 2, పబ్లిక్ హెల్త్ విభాగానికి 1 అర్జీ వచ్చినట్టు కమిషనర్ పేర్కొన్నారు. ప్రతి అర్జీకి నాణ్యతతో కూడిన పరిష్కారాలు చూపించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మీకోసం పోర్టల్, 1100 టోల్‌ఫ్రీ నెంబర్‌ల ద్వారా వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ పీవీ రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, సెక్రటరీ జి.శైలజావల్లి, సిటీ ప్లానర్ జీవీఎస్‌ఎన్ మూర్తి, ఎస్‌ఈ రీటా, ఎంహెచ్‌వో డాక్టర్ వినూత్న తదితరులు పాల్గొన్నారు.