Share News

కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో 160 అర్జీలు

ABN , Publish Date - Jan 20 , 2026 | 01:37 AM

ప్రజాసంతృప్తే సేవల్లో నాణ్యతకు గీటు రాయని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ పేర్కొ న్నారు.

కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో 160 అర్జీలు

అమలాపురం టౌన్‌, జనవరి19 (ఆంధ్రజ్యో తి): ప్రజాసంతృప్తే సేవల్లో నాణ్యతకు గీటు రాయని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ పేర్కొ న్నారు. కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్య క్రమంలో అర్జీలు స్వీకరించిన అనంతరం కలె క్టర్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి ఆర్జీని సకాలంలో నిబ ద్ధతతో పరిష్కరించాలని ఆయా శాఖల అధి కారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌ అర్జీదా రులతో సంబంధిత అధికారులు నేరుగా మా ట్లాడాలని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కా ర వేదికలో మొత్తం 160 అర్జీలు అందాయ న్నారు. ఈ ఆఫీస్‌ ద్వారానే ఇకపై ఫైళ్లను సమర్పించాలన్నారు. జేసీ టి.నిశాంతి మాట్లా డుతూ రెవెన్యూ సమస్యల వేగవంత పరి ష్కారానికి రెవెన్యూ క్లినిక్లు దోహద పడతా యన్నారు. ఫిర్యాదులను వేగంగా నాణ్యతతో పరిష్కరించేందుకు వీలుగా క్లినిక్‌లు ఉపకరి స్తాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె. మాధవి, డ్వామా పీడీఎస్‌ మధుసూదన్‌, సమగ్రశిక్ష ఏపీసీ జి.మమ్మీ, డీఎల్డీవోలు రాజే శ్వరరావు, వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

ఎస్పీ కార్యాలయానికి 25 అర్జీలు

బాధితుల సమస్యలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రజాసమస్యల పరి ష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎస్పీ రాహుల్‌మీనా తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రజా సమస్య ల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ ఏవీ ఆర్‌పీబీ ప్రసాద్‌ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుం చి 25 అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల సమ స్యలను నేరుగా మాట్లాడి తెలుసుకుని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.

Updated Date - Jan 20 , 2026 | 01:37 AM