Share News

సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయ సాధనకు ప్రజా రిపబ్లిక్‌ ఉద్యమం

ABN , Publish Date - Jan 27 , 2026 | 12:59 AM

రామచంద్రపురం(ద్రాక్షారామ), జనవరి 26 (ఆంధ్రజ్యోతి): దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సాధనకు ప్రజా రిపబ్లిక్‌ ఉద్య మం ప్రారంభించామని ఉద్యమ నేత డీవీవీఎస్‌వర్మ అన్నారు. సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం లోని చెలికానిరామారావు స్మారకభవనంలో సా ర్మకకమిటీ ఆధ్వర్యంలో డా.సి.కృష్ణమోహనరావు అధ్యక్షతన ప్రజా రిపబ్లిక్‌ ఉద్యమం పరిచయం, చర్చ కార్యక్ర

సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయ సాధనకు ప్రజా రిపబ్లిక్‌ ఉద్యమం
సమావేశంలో మాట్లాడుతున్న వర్మ

ఉద్యమ నేత డీవీవీఎస్‌ వర్మ

రామచంద్రపురం(ద్రాక్షారామ), జనవరి 26 (ఆంధ్రజ్యోతి): దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సాధనకు ప్రజా రిపబ్లిక్‌ ఉద్య మం ప్రారంభించామని ఉద్యమ నేత డీవీవీఎస్‌వర్మ అన్నారు. సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం లోని చెలికానిరామారావు స్మారకభవనంలో సా ర్మకకమిటీ ఆధ్వర్యంలో డా.సి.కృష్ణమోహనరావు అధ్యక్షతన ప్రజా రిపబ్లిక్‌ ఉద్యమం పరిచయం, చర్చ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్ర సంగించారు. ప్రజా రిపబ్లిక్‌ ఉద్యమం రాజ్యాంగ ఉద్యమంగా పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం కార్పోరేట్‌ పన్ను 35శాతం నుంచి 22 శాతానికి తగ్గించిందన్నారు. అదేవిధంగా సంపదపన్ను ఎత్తివేశారన్నారు. కార్పోరేట్‌ పన్ను 3 శాతానికి పెంచడం, సంపదపన్ను, వారసత్వ పన్నుద్వారా రూ. 20 లక్షలకోట్లు ఆదాయం వస్తుందన్నారు. జాతీయ సంక్షేమ నిధి ఏర్పాటు చేసి సంపద సృష్టిలో భాగస్వాములైన అసంఘటిత కార్మికు లు, రైతులు, ఇతర పేద వర్గాల అభ్యున్నతికి ఖ ర్చు చేయాలన్నది ప్రజారిపబ్లిక్‌ ఉద్యమం ఆశ యమని ఆయన తెలిపారు. ఉద్యమ ఆశయాన్ని ప్రజాభిప్రాయంగా మలచగలిగితే సాధించడం కష్టతరంగా కాదన్నారు. కార్పోరేట్లు పన్ను ద్వారా రూ.9లక్షలు కోట్లు పన్నులు చెల్లిస్తుండగా, సం పాదన పన్ను ద్వారా రూ.10 లక్షల కోట్లు, జీఎస్‌టీ ద్వారా రూ.22 లక్షల కోట్లు ఆదాయం వస్తుందన్నారు. దేశంలో 50శాతంపైగా ఉన్న సా మాన్యులు జీఎస్టీ రూ.22 లక్షల కోట్లలో 64శాతం అనగా రూ.14 లక్షల కోట్లు పన్నులు రూపంలో చెల్లిస్తున్నారన్నారు. సామాన్యులు చెల్లించిన పన్నులో కనీసం సగం రూ.7 లక్షల కోట్లు కూడా వారి అభ్యున్నతికి ఖర్చుచేయడం లేదన్నారు. ప్ర జారిపబ్లిక్‌ ఉద్యమం ఆశయాలపై చర్చలు పెట్టి ప్రజాభిప్రాయంగా మలిచేందుకు కార్మిక సంఘా లు, యువజనసంఘాలు, ప్రజాశీల సంఘాలు కృషి చేయాలని ఆయన కోరారు. సమావేశంలో డా.స్టాలిన్‌, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 12:59 AM