ఆరోగ్యశ్రీలో అదనపు వసూళ్లు.. ఐఏఎస్‌తో విచారణ జరిపించాలి
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:25 AM
పిఠాపురం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కాకినాడ మెడికవర్ ఆ సుపత్రిలో చేరిన రోగుల నుంచి రూ.లక్షలు అద నంగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై ఐఏ ఎస్ అధికారితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించారు. మెడికవర్ ఆరోగ్యశ్రీ దందాలపై మంగళవారం సాయ
సీఎం చంద్రబాబు ఆదేశం.. ఆరోగ్యశ్రీ దందాలపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఫిర్యాదు
పిఠాపురం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కాకినాడ మెడికవర్ ఆ సుపత్రిలో చేరిన రోగుల నుంచి రూ.లక్షలు అద నంగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై ఐఏ ఎస్ అధికారితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించారు. మెడికవర్ ఆరోగ్యశ్రీ దందాలపై మంగళవారం సాయ ంత్రం అమరావతిలో సీఎం చంద్రబాబును పి ఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ కలిసి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను అందజేశారు. ఆరోగ్యశ్రీ కింద సద రు ఆసుపత్రిలో చేరిన రోగులకు వివిధ రకాల జబ్బులకు చికిత్స చేయాలని, ఇవి కవర్ కావంటూ రూ.లక్షల అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇదే రీతిలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన డక్కుమళ్ల బేబీరత్నం నుంచి రూ.2.50లక్షలు, గళ్ల కు మారి నుంచి రూ.1.70లక్షలు, కొండేపూడి పద్మరాజు నుంచి రూ.1.50లక్షలు ఇలా ప్రతి రోగి నుంచి వసూలు చేశారని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో 4,100 మంది కూట మి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు, ఇతర చికిత్సలు చేయించుకున్నారని, వీరందరిని విచారణ జరపాలని కోరారు. మెడికవర్ ఆసుపత్రిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించడంతో పాటు సీఎంవో అధికారులకు ఐఏఎస్ అధికారితో విచారణ జరపాలని ఆదేశించారని వర్మ తెలిపారు.