బయోమెట్రిక్ విధానంలో పాస్‌బుక్
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:32 AM
భూసమస్యలు పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు.
మండపేట, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : భూసమస్యలు పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. మండపేట మండలం మారేడుబాక పంచాయతీ వద్ద శుక్రవారం పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసి మాట్లాడారు. నూతనంగా తూర్పుగోదావరి జిల్లాలో కలిసిన మండపేట నియోజకవర్గంలో పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయ డం ఆనందంగా ఉందన్నారు. రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా రైతుల భూ సమ స్యలను అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు. రైతులు తహశీల్దార్ కార్యాలయాలు లేదా సచివాలయాల్లో భూ సమస్యలపై తమ ఫిర్యాదులు అందజేసి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. పాస్ పుస్తకాలు బయో మెట్రిక్ విధానంలో అందజేస్తున్నామన్నారు. మారేడుబాకలో 353 పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ డీలిమిటేషన్ తర్వాత 2019లో మండపేట నియోజకవర్గం ఏర్పడిందన్నారు. 2022లో జిల్లాల విభజన సమయంలో మండపేటను రాజమహేంద్రవరంలో కలపాలంటూ చేసిన ఆందోళనను గత ప్రభు త్వంలో ఉన్న నాయకులు అడ్డుకున్నారన్నారు. అయితే సీఎం చంద్రబాబు ప్రజల కోరిక మేరకు మండపేట నియోజకవర్గాన్ని కోనసీమ జిల్లా నుంచి రాజమహేంద్రవరంలో కలిపారన్నారు.మండపేట నియోజకవర్గ అభివృద్ధికి కలెక్టర్ సహకరించాలని కోరారు. ఆర్‌డీవో కృష్ణనాయక్ మాట్లాడుతూ మం డపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో కలవడం ఆనందంగా ఉందన్నారు.కార్యక్రమంలో మండపేట తహశీల్దార్ పి.తేజేశ్వరరావు, ఎంపీ డీవో సత్యనారాయణమూర్తి, ఏవో ప్రభాకర్, ఎంపీపీ వాసు పాల్గొన్నారు.
పాస్ పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి : కలెక్టర్
రాజమహేంద్రవరం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ రికార్డుల్లో ఉన్న సమస్యలను గుర్తించి క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని సూచించారు. భవిష్యత్‌లో వివాదాలు రాకుండా ముం దస్తు చర్యలు అవసరమన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దృష్టి సారించాలని చెప్పారు. జిల్లాలో ఎరువులు అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ ఉంచాల న్నారు.కార్యక్రమంలో జేసీ వై.మేఘస్వరూప్, డీఆర్వో టి.సీతారామమూర్తి, ఆర్డీవోలు ఆర్.కృష్ణనాయక్, రాణి సుస్మిత తదితరులు పాల్గొన్నారు.