సందడే.. సందడి
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:47 AM
జిల్లా అంతటా నూతనో త్సాహం కనిపించింది.. కొత్త సంవత్సరం సందర్భంగా అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారుల నివాసాలు సందర్శకులతో కిట కిటలాడాయి.
రాజమహేంద్రవరం రూరల్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): జిల్లా అంతటా నూతనో త్సాహం కనిపించింది.. కొత్త సంవత్సరం సందర్భంగా అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారుల నివాసాలు సందర్శకులతో కిట కిటలాడాయి. పూల బొకేలు, పండ్లు, స్వీట్స్ అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.దీంతో అటు కలెక్టర్ నివాసం.. ఇటు ప్రజాప్రతినిధుల నివాసాల వద్ద నూతన సందడి కనిపించింది. బుధవారం రాత్రి 12 గంటలు దాటిన తరువాత నుంచే జనం నూతనోత్సాహంలో మునిగిపోయారు. చాలా చోట్ల రాత్రంతా పండుగలా చేసుకున్నారు. రాజమహేం ద్రవరం దేవిచౌక్ వద్దకు పెద్ద ఎత్తున జనం హాజరై దర్శించుకుని.. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కలెక్టర్‌ను జేసీ వై.మేఘ స్వరూప్, రాజమహేంద్రవరం కమిషనర్ రాహుల్ మీనా, డీఆర్‌వో టి.సీతారామమూర్తి, ఇతర జిల్లా అధికారులు ,ప్రజాప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
శెహబాస్..పోలీస్!
రాజమహేంద్రవరం, జనవరి 1(ఆంధ్రజ్యోతి): అంతటా శాంతి.. అంతటా భద్రత.. పోలీసింగ్ పక్కాగా ఉంటే ప్రజా జీవనం ప్రశాంతంగా సాగుతుందనే మాటలను డిసెంబరు 31 సందర్భంగా జిల్లా పోలీసులు నిజం చేసి చూపించారు. నూతన ఏడాదికి స్వాగతం చెబుతూ చేసే హడావుడీ అంతా ఇంతా కాదు. రోడ్లపై ద్విచక్ర వాహనాల విన్యాసాలు, ర్యాష్ డ్రైవింగ్‌లు, బైక్ రేస్‌లు, సైలెన్సర్లు పీకేసి భారీ శబ్దాలు.. ఈ క్రమంలో ప్రమాదాలు.. ఇదీ ప్రతి ఏడాది నూతన సంవత్సర వేడుకల్లో కనిపించే తంతు. అయితే ఈసారి మాత్రం ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నీ తోకముడుచుకున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. కానీ జిల్లా పోలీసులు ఎలాంటి విషాద ఘటనకూ తావివ్వలేదు. ఎస్పీ నరసింహ కిశోర్ ముందస్తు ప్రణాళిక, స్వీయ పర్యవేక్షణ, జిల్లా ఉన్నతా ధికారుల నిరంతర మోనిటరింగ్‌లు మంచి ఫలి తాలను ఇచ్చాయి. యువత వేగానికి కళ్లెం వేయ డానికి పలు ప్రదేశాల్లోని రోడ్లపై ఏకంగా భారీ లారీలను మోహరించారు. స్పెషల్, ప్రత్యేక, పెట్రోలింగ్ బృందాలు, శక్తి టీంలు, డ్రోన్లు రాత్ర ంతా గస్తీ తిరుగుతూనే ఉన్నాయి. జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. దీంతో ఎలాంటి దర్ఘటనలకూ తావులేకుండా డిసెంబరు 31 రాత్రి సజావుగా గడిచింది.