‘నన్నయ’ను మరింత అభివృద్ధి చేద్దాం : వీసీ
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:48 AM
దివాన్‌చెరువు, జనవరి1 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరంలో నూతన ఆలోచనలతో నన్నయ విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేద్దామని ఉపకులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. విశ్వవిద్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. వీసీ ముఖ్యఅతిథిగా హాజ
దివాన్‌చెరువు, జనవరి1 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరంలో నూతన ఆలోచనలతో నన్నయ విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేద్దామని ఉపకులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. విశ్వవిద్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. వీసీ ముఖ్యఅతిథిగా హాజరై 2026 విశ్వవిద్యాలయం క్యాలెండర్‌ను ఆవిష్కరించి సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలోనే ఎక్కువ అనుబంధ కళాశాలలతో అతిపెద్ద విశ్వవిద్యాలయంమైన నన్నయలో గడచిన సంవత్సరంలో జరిగిన వివిధ కార్యక్రమాలను వివరించారు. నూతన సంవత్సరంలో రెట్టింపు ఉత్సాహంతో అకడమిక్ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లడం తో అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నన్నయ సిబ్బందంతా ఓకే కుటుంబంగా పనిచేసినప్పుడు మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. విశ్వవిద్యాలయం అధికారులు, అధ్యాపకులు, అధ్యాపకేతరసిబ్బంది వీసీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రిజిస్ట్రార్ ఆచార్య కె.వి.స్వామి, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు,అధ్యాపకేతరసిబ్బంది పాల్గొన్నారు.