మహనీయుడు ఎన్టీఆర్
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:15 AM
తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో నిలబెట్టిన మహనీయుడు టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారకరామారావు అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి ప్రాంగణంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు
టీడీపీ వ్యవస్థాపకుడి వర్ధంతి
పార్టీ నాయకుల ఘన నివాళి
పలుచోట్ల సేవా కార్యక్రమాలు
రాజమహేంద్రవరం సిటీ/అర్బన్, జనవరి 18(ఆంధ్రజ్యోతి): తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో నిలబెట్టిన మహనీయుడు టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారకరామారావు అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి ప్రాంగణంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ కృషి చేశారని ఆయన మరణించినప్పటికీ ప్రతీ తెలుగోడి గుండెల్లో ఆయన బతికే ఉన్నారన్నారు. ఎన్టీ ఆర్ ఆశయ సాధనకు సీఎం చంద్రబాబు, లోకేశ్ కృషి చేస్తున్నారన్నారు. శ్రీరామ్‌నగర్‌లోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ నివాసం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి తానా ప్రతినిధి చుండ్రు సతీష్‌తో కలిసి గన్ని కృష్ణ పూలమాలలతో నివాళులర్పించారు.ఈ సందర్భంగా పార్టీ జెండాను టీడీపీ జిల్లా ప్రధాన కా ర్యదర్శి కాశి నవీన్‌కుమార్ ఎగు రువేశారు. అలాగే లాలాచెరువు వాంబే కాలనీలో ఎన్టీఆర్ విగ్రహానికి కాశి నవీన్‌కుమార్ అధ్యక్షతన టీడీపీ నాయకులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ సేవలను కేం ద్ర ప్రభుత్వం గుర్తించి భారతరత్న అవార్డుతో గౌరవించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చై ర్మన్ కుడుపూడి సత్తిబాబు,రాం బాబు, రెడ్డి మణి, వర్రే శ్రీనివాసరావు, కడలి రా మకృష్ణ, మొ కమాటి సత్యనారాయణ, దాస్యం ప్రసాద్, శెట్టి జగదీష్, రవి యాదవ్, కొత్తల కిషోర్, సిర్రా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.