రేపే సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీ
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:33 AM
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ప్రతి ఏటా క్రమంతప్పకుండా నిర్వహిస్తున్న ముత్యాల ముగ్గుల పోటీ ఈ ఆదివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ఐదు కేంద్రాల్లో జరగనుంది.
ఉమ్మడి జిల్లాలో ఐదు కేంద్రాల్లో నిర్వహణ
మహిళలందరికీ ఇదే ఆహ్వానం
(ఆంధ్రజ్యోతి - రాజమహేంద్రవరం)
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ప్రతి ఏటా క్రమంతప్పకుండా నిర్వహిస్తున్న ముత్యాల ముగ్గుల పోటీ ఈ ఆదివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ఐదు కేంద్రాల్లో జరగనుంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవ రం, తాళ్లపూడి మండలం మలకపల్లి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపు రం, కాకినాడ జిల్లాలోని కాకినాడ, కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లాలోని రంపచోడవరం కేంద్రంలో ఈ ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు.. పవర్డ్ బై సన్‌ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్‌వాసి అగరబత్తీ ఆధ్వర్యంలో ఈసారి జరుగనున్నాయి. వీటికి స్థానిక స్పాన్సరర్లుగా...కొవ్వూరులో జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, రాజమహేంద్రవరంలో భవాని చారిటబుల్ ట్రస్టు, కాకినాడలో పడాల చారిటబుల్ ట్రస్టు, అమలాపురంలో సీనియర్ శాసనసభ్యుడు అయితాబత్తుల ఆనందరావు, రంపచోడవరంలో లెనోరా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉన్నాయి.ఈ పోటీలకు సంబంధించి ఒక్కో కేంద్రం లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.6వేలు, రూ.4వేలు, రూ.3 వేలు అందిస్తారు. కన్సొలేషన్ బహుమతులు ఉంటాయి. జిల్లా స్థాయి లో ఎంపికైన విజేతలు రాష్ట్ర స్థాయిలో విజయవాడలో జరిగే పోటీల్లోనూ పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంటారు. ఇప్పటికే ఈ పోటీలకు పేర్లను నమోదు చేసుకుంటున్నారు. పోటీల ప్రారంభ సమయానికి ముందు వరకు కూడా పేర్లను నమోదు చేసుకునే అవకాశం ఉంది. వివరాలకు ఈ కింద ఉన్న ప్రకటనలో కాంటాక్టు నెంబర్లనూ సంప్రదించవచ్చు.