Share News

లోకేశ్‌.. జోష్‌!

ABN , Publish Date - Jan 31 , 2026 | 01:07 AM

జేఎన్టీయూకే, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్‌ శుక్రవారం కాకినాడలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజమహేంద్రవరం విమానశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా కాకినాడ జేఎన్టీయూకు చేరుకున్న మంత్రి లోకేశ్‌కు స్థానిక ప్రజాప్రతినిధు

లోకేశ్‌.. జోష్‌!
జీఎన్టీయూకేలో పీజీ బాలుర వసతిగృహ భవనాన్ని ప్రారంభించిన మంత్రి లోకేశ్‌, పాల్గొన్న అధికారులు

జీఎన్టీయూకేలో పీజీ బాలుర వసతిగృహ భవనాన్ని ప్రారంభించిన మంత్రి లోకేశ్‌

20 స్టాల్స్‌ సందర్శన

పాల్గొన్న వీసీ ప్రసాద్‌, ఎంపీ సతీష్‌బాబు, కూటమి నాయకులు, అధికారులు

జేఎన్టీయూకే, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్‌ శుక్రవారం కాకినాడలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజమహేంద్రవరం విమానశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా కాకినాడ జేఎన్టీయూకు చేరుకున్న మంత్రి లోకేశ్‌కు స్థానిక ప్రజాప్రతినిధులు, జేఎన్టీయూ అధికారులు స్వాగతం పలికారు. హలో లోకేశ్‌ కార్యక్రమం అనంతరం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను సందర్శించారు. ఐఆర్‌సీ విభాగాధిపతి డాక్టర్‌ కె.గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్‌ ఫెయిర్‌ పేరుతో ఏర్పాటుచేసిన 20 స్టాల్స్‌ను సందర్శించగా ఆదిత్య విద్యార్థులు రూపొందించిన అరటి దవ్వనుంచి ఆహార ఉత్పత్తుల తయారీ ఆవిష్కరణ, ప్రగ తి విద్యార్థులు రూపొందించిన ద మొబైల్‌ బ నానా ఎక్స్‌ట్రాక్ట్‌, రామకృష్ణంరాజు ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు రూపొందించిన ఇంటెలిజెంట్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ సిస్టం ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. అనంతరం మంత్రి రూ.10కోట్ల రూసా నిధులతో నిర్మించిన పీజీ బాలుర వసతిగృహ భవనాన్ని ప్రారంభించారు. రూ.21 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను, డ్రైనేజీలను ప్రారంభించారు. వీసీ సీఎస్‌ఆర్కే ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ శ్రీనివాసరావు ఎంపీ సానా సతీష్‌బాబు, ఎమ్మెల్యేలు వనమాడి, దివ్య, సత్యప్రభ, వాసు, రంగారావు, ఎమ్మెల్సీలు పద్మశ్రీ, రాజశేఖర్‌, నవీన్‌కుమార్‌, కూటమి నాయకులు పాల్గొన్నారు.

విద్యార్థులతో ముఖాముఖి

జేఎన్టీయూకే, జనవరి 30 (ఆం ధ్రజ్యోతి): కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించిన ‘హాలో లోకేశ్‌’ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్‌ శుక్రవా రం విదార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఆ సంభాషణల్లో ముఖ్యాంశాలివి..

ఫ నేను బట్టీపట్టే విద్యార్థిని కాదు

విద్యార్థి యువరాజ్‌: ఇంజనీరింగ్‌లో రికార్డులు మీరే రాశారా? ఎవరితోనైనా రాయించారా? మీ వైవా ఎలా జరిగింది?

లోకేశ్‌: నేను యూఎస్‌ఏలోని కార్నిగీమెల్లాన్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ చేశాను. నేను బట్టీ పట్టే విద్యార్థిని కాదు క్రిటికల్‌ ఎనలిటికల్‌ ఆలో చనపై దృష్టి పెట్టాను. విద్యామంత్రిగా కూడా అలాగే ఆలోచిస్తున్నా. వేరే వాళ్ల పేపర్‌ చూసి రాయాలనే ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు.

ఫ స్కిల్‌ గ్యాప్‌ అన్ని దేశాల్లో ఉంది

విద్యార్థి దిలీప్‌కుమార్‌: కళాశాలల్లో లీప్‌ నమూనాలో డిజైనింగ్‌, టెస్టింగ్‌, ఇనిస్టిట్యూషనలైజ్‌ మోడల్‌ అమలుచేయగలరా?

లోకేశ్‌: ఉన్నతవిద్యనభ్యసించే వారి కోసం ఇ ండస్ట్రీ ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా కరిక్యులం రూపొందించి స్కిల్‌గ్యాప్‌ను భర్తీచేస్తున్నాం. స్కిల్‌గ్యాప్‌ ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉంది. ఏపీలో క్లస్టర్‌ ఆధారిత పరిశోధన అవసరం.

ఫ నాకు 90 శాతం హాజరు ఉండేది

విద్యార్థి కౌశిక్‌: కళాశాలకు ఎప్పుడైనా బంక్‌ కొట్టారా? కొడితే ఎక్కడికి వెళ్లేవారు?

లోకేశ్‌: నేను పెద్దగా తరగతులకు బంక్‌ కొట్టలేదు. నాకు 90శాతం హాజరుఉండేది. బ్రా హ్మిణికిమాత్రం 100 శాతం హాజరుండేది. క్లాస్‌ అయిన తర్వాత మిత్రులతో చర్చించేవాళ్లం.

ఫ కొత్తగా క్వాంటం కంప్యూటింగ్‌

విద్యార్థిని శ్రావ్య: దావోస్‌ వెళ్లారు కదా పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పనకు ఎన్ని హామీలు వచ్చాయి?

లోకేశ్‌: మన ప్రత్యేకతలు, అనుకూలతలను చెప్పడానికి దావోస్‌ వెళ్లాం. రాష్ట్రంలో నూతనంగా క్వాంటం కంప్యూటింగ్‌ను ప్రవేశపెడుతున్నాం. ఇప్పటివరకూ ఏపీలో వివిధ పరిశ్ర మల ద్వారా 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయి.

ఫ ఫ్రీ బస్సుల సంఖ్య పెంచుతాం

విద్యార్థి అవినాష్‌: విద్యార్థులకు రవాణా సౌకర్యం ఇబ్బందిగా ఉంది. కళాశాల, పాఠశాలల విద్యార్ధులు ఇబ్బంది పడుతున్నారు.

లోకేశ్‌: ఉచిత బస్సుల సంఖ్యను పెంచుతాం.

ఫ గ్రీన్‌ ఎనర్జీలో భారత్‌ లీడర్‌

విద్యార్థి విశాల్‌: గ్రీన్‌ ఎనర్జీపై మీ పాలసీ ఏంటి?

లోకేశ్‌: దేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌ అమ్మోనియా ఎక్స్‌పోర్టు ప్రాజెక్టును ఇటీవల కాకినాడలో ప్రారంభించాం. గ్రీన్‌ ఎనర్జీలో భారత్‌ లీడర్‌ కాబోతోంది.

ఫ ప్లేస్‌మెంట్స్‌ బాధ్యత వీసీలదే

విద్యార్థి వాసుదేవ్‌: ప్రభుత్వ కళాశాలలకు ప్లేస్‌మెంట్స్‌ రావడంలేదు. ప్రైవేట్‌ కళాశాలల విద్యార్థులకు ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ ఇవ్వండి. ప్రొఫెసర్‌ ఉద్యోగాలను భర్తీ చేయండి?

లోకేశ్‌: కెరీర్‌ గైడెన్స్‌, కౌన్సిలింగ్‌ బాధ్యతలను వీసీలకు అప్పగించాం. ప్లేస్‌మెంట్స్‌ బాధ్యత కూ డా వారిదే. ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ జమచేస్తాం. గత బకాయిలను కూడా చెల్లిస్తాం.

Updated Date - Jan 31 , 2026 | 01:07 AM