Share News

ఆ ఆరు ఊళ్లు అప్పగించడం కుదరదు!

ABN , Publish Date - Jan 31 , 2026 | 01:05 AM

రంపచోడవరం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పుగోదావరి మన్యంలోని గోదావరి పరీ వాహక మంటూరు ఎస్టేటుకు సంబంధించి 1972లో అప్పటి రాజమండ్రి జిల్లా కోర్టు ఇచ్చిన జమిందారుకు ఇచ్చిన అనుకూల తీర్పును అమలుచేయలేమని, ఎ స్టేటులోని ఆరు గ్రామాలను అప్పగించడం కుదరదని రాజమండ్రిలోని ఒకటవ అదనపు జిల్లా కోర్టు న్యా యమూర్తి ఆర్‌.శివకుమార్‌ తీర్పు చెప్పారు. రాష్ట్రంలో ఎస్టేట్ల రద్దు అనంతరం గత 63 సంవత్సరా

ఆ ఆరు ఊళ్లు అప్పగించడం కుదరదు!

మంటూరు ఎస్టేటుపై 53 ఏళ్లనాటి వాజ్యం తీర్పు అమలు కుదరదన్న జిల్లా కోర్టు

జమీందారు దాఖలు చేసిన ఎగ్జిక్యూషన్‌ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడి

ఆరు దశాబ్దాల సంక్లిష్టతకు తెరపడి గిరిజనుల హక్కుల పరిరక్షణకు మార్గం సుగమం

రంపచోడవరం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పుగోదావరి మన్యంలోని గోదావరి పరీ వాహక మంటూరు ఎస్టేటుకు సంబంధించి 1972లో అప్పటి రాజమండ్రి జిల్లా కోర్టు ఇచ్చిన జమిందారుకు ఇచ్చిన అనుకూల తీర్పును అమలుచేయలేమని, ఎ స్టేటులోని ఆరు గ్రామాలను అప్పగించడం కుదరదని రాజమండ్రిలోని ఒకటవ అదనపు జిల్లా కోర్టు న్యా యమూర్తి ఆర్‌.శివకుమార్‌ తీర్పు చెప్పారు. రాష్ట్రంలో ఎస్టేట్ల రద్దు అనంతరం గత 63 సంవత్సరాలుగా పోలవరం ఎస్టేటు నుంచి విభజించబడి మంటూరు ఎస్టేటుగా ఏర్పడిన ఈ ఆరు గ్రామాలకు సంబ ంధించి వచ్చిన తీర్పు మేరకు జమిందారు దాఖలు చేసిన ఎగ్జిక్యూషన్‌ పిటిషన్‌ కేసులో ఈ తీర్పు వెలువడింది. వాజ్యంలో తీర్పు అనుకూలంగా వచ్చి నంత మాత్రాన జమిందారు కోరినవిధంగా సదరు ఎస్టేటులోని ఆరు గ్రామాలను తిరిగి అప్పగించడం కుదరదని తేల్చేస్తూ జమిందారు పిటిషన్‌ను జిల్లా కోర్టు కొట్టేసింది. గోదావరి తీరంలో ఉన్న వాస్తవ పోలవరం ఎస్టేటు నుంచి విభజించబడి మంటూరు ఎస్టేటుగా ఏర్పడిన అనంతరం 1952లో ఎస్టేట్లను స్వాధీనం చేసుకుంటూ బోర్డు ఆఫ్‌ రెవెన్యూ ఉత్తర్వులు, తద్వారా 1964లో మంటూరు ఎస్టేటును జమీన్‌ ఎస్టేటుగా ప్రభుత్వం గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేయడాన్ని ప్రశ్నిస్తూ అప్పటి రంపచోడవరం తా లూకాలోనూ, తర్వాతకాలంలో దేవీపట్నం మండ లంలో ఉన్న మంటూరు ఎస్టేటుగా ఉన్న మంటూరు, పెనికలపాడు, మూలపాడు, మడిపల్లి, మెట్టవీధి, కచ్చులూరు గ్రామాలను అప్పగించాలని అప్పటి జ మిందారుగా ఉన్న కెప్టెన్‌ కృత్తివెంటి పేర్రాజు దాఖలు చేసిన 1967 నాటి వాజ్యంపై రాజమండ్రి జిల్లా కోర్టు 1972లో జమిందారుకు అనుకూలంగా తీర్పు చెబుతూ సదరు ఆరు గ్రామాలను జమిందారుకు అప్పగించాలని కలెక్టరును కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు దాఖలు చేసినా సదరు అప్పీలును హైకోర్టు 1976లో తిరస్కరించింది. ఎస్టేట్ల రద్దు నేపథ్యంలో అటు జమిందారు, ఇటు రైతులు న్యాయస్థానాల్లో సుదీర్ఘ పోరాటం జరిగిన క్రమంలో 2012లో జస్టిస్‌ రోహిణి గిరిజనులకు అనుకూలంగా తీర్పు చెబుతూ రాజ మండ్రి జిల్లా కోర్టులో జమిందారుకు అనుకూలంగా 1972లో వచ్చిన వాజ్యపు తీర్పుకు అమలు అర్హత లేదని స్పష్టంచేస్తూ గిరిజనుల సాగులో ఉన్న ఎస్టేటు భూములకు రైత్వారీ పట్టాలను ఇప్పించాలని జిల్లా కలెక్టరు, జిల్లా జడ్జిలతో సహా సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది. కాగా రాజమండ్రి జిల్లా కోర్టులో పెండింగ్‌లో ఉన్న జమిందారు ఎగ్జిక్యూషన్‌ పిటిషన్లో తమను పార్టీ లుగా చేర్చాలని కోరుతూ జమిందారు హక్కులను ప్రశ్నిస్తూ జమిందారు దాఖలు చేసుకున్న ఎగ్జిక్యూషన్‌ పిటి షన్ను కొట్టివేయాలని కోరుతూ కోండ్ల బుల్లబ్బాయిరెడ్డితోపాటు నలుగురు గిరిజనులు వాదనలను వినిపించారు. ఇందులో పాడేరు జిల్లా కలెక్టరు కూడా జమిందారు ఎగ్జిక్యూటివ్‌ పిటిషన్‌కు అర్హత లేదని వివరించారు. కాగా జమీందారు కోరుతున్న ఆరు గ్రామాలు పోలవరం ప్రాజెక్టు ముంపు కారణంగా భౌతికంగా లేని విషయాన్ని కూడా గిరిజనులూ, కలెక్టరు తమ న్యాయ వాదుల ద్వారా కోర్టుకు వివరించారు. గిరిజన ప్రాంతానికి సంబంధించిన భూముల వివాదాలను విచారించే అధికారం సివిల్‌ కోర్టులకు లేదన్న వాదనలను కూడా గిరిజనులు, కలెక్టరు జిల్లా కోర్టుకు వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ఒకటవ జిల్లా కోర్టు సదరు జమిందారు దాఖలు చేసుకున్న ఇ.పి.34/1988 నెంబరు గల ఎగ్జిక్యూషన్‌ పిటిషన్ను కొట్టివేసింది. ఈ తీర్పుతో గత ఆరు దశాబ్దాలుగా ఈ ఎస్టేటు భూములపై ఉన్న సందిగ్దతకు తెరపడింది. ఈ కేసుతోనే పోలవరం ప్రాజెక్టు ముంపు పరిహార అంశం కూడా కొంత ముడిపడి ఉండటం, గిరిజన భూహక్కుల పట్టాల జారీకి కూడా ఈ కేసునే సాకుగా చూపుతున్న నేపఽథ్యంలో ఈ తాజా తీర్పు మంటూరు ఎస్టేటు రైతులకు ఊరటనిస్తోంది.

Updated Date - Jan 31 , 2026 | 01:05 AM