Share News

4 రోజులు.. రూ.56 కోట్లు!

ABN , Publish Date - Jan 20 , 2026 | 01:11 AM

నలుగురు గుమిగూడితే మధ్యలో చుక్క.. ముక్క ఉండాల్సిందే.. మరి సంక్రాంతి అంటే స్నేహితులు.. బంధువులతో పల్లెలు పట్టణాలు కళకళలాడిపోతాయి.. మందు అలవాటు ఉంటే ఇక పండగే పండగ..

4 రోజులు.. రూ.56 కోట్లు!

రెచ్చిపోయిన మందుబాబులు

గతేడాదికంటే అధికంగా తాగుడు

46,354 కేసుల మద్యం విక్రయం

9.75 లక్షల బీర్లు అమ్మకం

కాకినాడ జిల్లాలో అత్యధికం

(కాకినాడ/రాజమహేంద్రవరం,ఆంధ్రజ్యోతి)

నలుగురు గుమిగూడితే మధ్యలో చుక్క.. ముక్క ఉండాల్సిందే.. మరి సంక్రాంతి అంటే స్నేహితులు.. బంధువులతో పల్లెలు పట్టణాలు కళకళలాడిపోతాయి.. మందు అలవాటు ఉంటే ఇక పండగే పండగ.. తాగినోళ్లకు తాగినంత.. ఆ నాలుగు రోజులు అడ్డే ఉండదు.. ఈ ఏడాది సంక్రాంతి పండుగను ఘనంగా ముగించారు. ఎంత ఘనంగా ముగించారో తెలియాలంటే ఒకసారి మద్యం లెక్కలు చూడాల్సిందే. ఎందుకంటే గతేడాది రూ.41.13 కోట్ల మద్యం అమ్మకాలు సాగితే.. ఈ ఏడాది ఏకంగా 56.05 కోట్ల అమ్మకాలు జరిగాయి. పండుగ సందడిలో గతేడాదికంటే ఎక్కువగా గుట్టుక్కుమని పించారు.. మత్తుగా పండుగ చేసుకున్నారు.. ఉమ్మడి జిల్లాలో సంక్రాంతి పండగకు మందుబాబులు తెగతాగేశారు. పెద్దప ండగ కావడంతో పూటుగా సీసాలకు సీసాలు ఎత్తేశారు. వరుసపెట్టి నాలుగురోజులు అదే పనిలో ఉన్నా రు.దీంతో మద్యం అమ్మకాలు ఉమ్మడి జిల్లాలో భారీగా పెరిగిపో యాయి. ఈ నెల 14న భోగి నుంచి కనుమ మరుసటి రోజు వరకు నాలుగు రోజులు ఏకంగా 9.75లక్షల బీరు సీసాలు ఖాళీ చేసేశారు. 46,354 ఐఎంఎల్‌ మద్యం కేసులు మింగేశారు.మొత్తంగా రూ.56.05 కోట్ల మద్యం అమ్ముడైంది. 2025 సంక్రాంతి పండగ అమ్మకాలు రూ.41.13 కోట్లతో పోల్చితే ఈసారి విక్రయాలు పెరిగాయి.అత్యధికంగా కాకినాడ జి ల్లాలో రూ.23.23 కోట్లు, తూర్పుగోదా వరి జిల్లా లో రూ.17.20 కోట్లు,కోనసీమలో రూ.15.61 కోట్లు చొప్పున మద్యం విక్రయాలు జరగాయి.

అంతా కలిసి..ఆనందంగా

సంక్రాంతి అంటే గోదావరి జిల్లా వాసులకు పెద్ద పండగ. ఎవరు ఎక్కడకు వెళ్లినా ఈ పం డగకు స్వగ్రామాలకు తరలిరావాల్సింది. స్నేహి తులు..బంధువులు ఒక చోటకు చేరి పండుగ చేసుకుంటారు. అందరూ కలవడంతో మద్యం అలవాటు ఉంటే ఇక అడ్డేముంది. మందు బా బులకు పండగే.పండగ జరిగినన్ని రోజులు తోటలు,ఇళ్లు,బార్లలో తెగ తాగేస్తారు. బంధువు లు,స్నేహితులతో మద్యం సీసాలు ఖాళీ చేస్తారు. ఈ సంక్రాంతికి అదే జరిగింది. భోగి రోజు మొ దలు ముక్కనుమ వరకు అమ్మకాలు అమాంతం పెరిగిపోయాయి. ఆ నాలుగు రోజులు ఉమ్మడి జిల్లాలో మందుబాబులు రూ.56.05 కోట్ల మం దు తాగేశారు.ఇందులో ఒక్క బీరు సీసాలే 9.75 లక్షలు ఖాళీ చేసి పారేశారు.ఐఎంఎల్‌ మద్యం కేసులు 46,354 తాగేశారు. గతేడాది సంక్రాంతికి ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకా లు రూ.41.13 కోట్లు జరగ్గా, ఈ ఏడాది మద్యం విక్రయాలు రూ.14.92 కోట్లు అదనంగా పెరిగాయి. భోగి ముందు రోజే ఉమ్మడి జిల్లాలో అన్ని మద్యం దుకాణాలకు భారీగా స్టాకు తరలించగా అవన్నీ ఖాళీ అయిపోయాయి. కనుమరోజు మధ్యాహ్నం డిపోల నుంచి యుద్ధ ప్రాతిపదికన మద్యం దుకాణాలు సరుకు డంప్‌ చేశారు.

డిమాండ్‌కు తగినట్టు..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 400కి పై గా మద్యం దుకాణాలు, 44 బార్లు ఉన్నాయి.ఆయా దుకా ణాల్లో సంక్రాంతి పేరుచెప్పి వారం రోజుల పాటు మద్యం పూటుగా అమ్ముడైంది. బరులు, బెల్టు షాపుల వద్ద ఎక్కువ ధరకు మద్యం విక్రయాలు జరిగాయి. పండుగకు అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని తెలిసిందే. దీంతో మద్యం షాపులు, బార్‌ల యజమానులు డిమాండ్‌కు తగినట్టు ముందుగానే సరుకును సిద్ధం చేసుకు న్నారు. డిపోల నుంచి 17న అధిక సంఖ్యలో సరఫరా జరి గింది.అక్కడి నుంచి అధిక సంఖ్య లో బరులు,బెల్టు షాపులకు చేరుకున్నాయి.

కాకినాడ జిల్లాలో రూ.23.23 కోట్లు

కాకినాడ జిల్లాలో పండగ నాలుగు రోజుల్లో ఒక్క కాకినాడ జిల్లాలో రూ.23.23 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇందులో 12 బాటిళ్లు ఉండే బీరు కేసులు మొత్తం 32,439 ఖాళీ చేసేశారు.ఐఎంఎల్‌ మద్యం సీసాలు 19,227 తాగేశారు. జనవరి 1 నుంచి జనవరి 13 వరకు జిల్లాలో మందుబాబులు 33,847 బీరు కేసులు తాగితే..14 నుంచి 17వ తేదీ వరకు నాలుగు రోజు ల్లో 32,439 ఖాళీ చేసేశారు. 2025 సంక్రాంతికి కాకినాడ జిల్లా లో రూ.15.30 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగాయి.

తూర్పున రూ.17.20 కోట్లు

తూర్పుగోదావరి జిల్లాలో పండగ నాలుగు రోజులు రూ.17.20 కోట్లు విక్రయాలు జరిగాయి. ఇందులో బీరు కేసులు 25,755 ఉన్నాయి. జనవరి 1 నుంచి 13వ తేదీ వరకు 30,345 బీరు కేసులు అమ్ముడవగా.. పండగ నాలుగు రోజుల్లో 25,755కేసులు తాగేశారు. ఐ ఎంఎల్‌ మద్యం కేసులు 14,072 ఉన్నాయి. జిల్లాలో 20 25లో రూ.12.97 కోట్లు విక్రయాలు జరిగాయి.

కోనసీమలో రూ.15.61 కోట్లు

కోనసీమ జిల్లాలో పండగ మద్యం విక్ర యాలు రూ.15.61 కోట్లు. మందుబాబులు నాలుగురోజుల్లో 23,075 బీరు కేసులు లాగిం చేశారు. జనవరి 1 నుంచి 13 వరకు 28,040 బీరు కేసులు తాగేయగా 14 నుంచి 17 వరకు నాలుగు రోజుల్లో 23,075 బీరు కేసులు ఖాళీ చేసేశారు.పండగ నాలుగు రోజుల్లో 13,055 ఐఎంఎల్‌ మద్యం కేసులు తాగేశారు. గతేడాది కోనసీమ జిల్లాలో రూ.12.86 కోట్ల విక్రయాలు జరిగాయి.

Updated Date - Jan 20 , 2026 | 01:11 AM