మండపేటలో ఉద్రిక్తత
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:55 AM
మండపేట, జనవరి 5(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వైసీపీ శ్రేణుల ఆందోళనతో ఉద్రిక్తత పరిస్థితులు ఏ ర్పడ్డాయి. మండపేట మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు అధికార పార్టీ కార్యకర్త కంటే ఎక్కువగా వ్యవహరిస్తూ అవినితీకి పాల్పడుతున్నాడని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆ
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, వైసీపీ శ్రేణుల ఆందోళన
అడ్డుకున్న పోలీసులు
మండపేట, జనవరి 5(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వైసీపీ శ్రేణుల ఆందోళనతో ఉద్రిక్తత పరిస్థితులు ఏ ర్పడ్డాయి. మండపేట మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు అధికార పార్టీ కార్యకర్త కంటే ఎక్కువగా వ్యవహరిస్తూ అవినితీకి పాల్పడుతున్నాడని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆ రోపించారు.మున్సిపాల్టీలో జరుగుతున్న అవినీతి, కమిషనర్ తీరుతో పాటు సమస్యలపై సోమవారం తోట త్రిమూర్తులు, వైసీపీ శ్రేణులు ధర్నాకు సిద్ధమయ్యారు. విజయలక్ష్మీనగర్‌లో ఉన్న వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా కలువప్వుసెంటరులోని మున్సిపల్ కార్యాలయం వద్దకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, తోటకు మద్య వాగ్వా దం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వెళ్లి తీరుతా మని తోట భీష్మించారు. వెళ్లవద్దంటూ మండపేట సీఐ సురేష్, రూరల్ సీఐ దోర్రాజు తోట ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కమిషరన్ చేస్తున్న అవినీతీపై తోట పోలీసులకు చెప్పగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని రామచ ంద్రపురం డీఎస్పీ రఽఘవీర్ హమీ ఇవ్వడం తో తోట త్రిమూర్తులు శాంతించి వెనుతిరిగారు.