‘షరతులు’ వర్తిస్తాయి!
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:27 AM
రంపచోడవరం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): నిబంధనలు అడ్డంకిగా మారి మన్యం వాసుల మృతదేహాలను వారి స్వస్థలాలకు చేర్చలేని దుస్థి తిలో మహాప్రస్థానం సేవలు నడుస్తున్నాయి. మంగళవారం జరిగిన రాజమండ్రిలో జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. మారే డుమిల్లి మండలం తా
ఉన్నతాసుపత్రుల నుంచి మన్యంవాసులకు అందని మహాప్రస్థానం సర్వీసులు
గిరిజనుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి అడ్డంకిగా నిబంధనలు
రాజమహేంద్రవరం నుంచి మృతదేహాన్ని మన్యానికి చేర్చలేమన్న ఆర్‌ఎమ్‌వో
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఐటీడీఏ అధికారుల చొరవతో ఎట్టకేలకు తరలింపు
రంపచోడవరం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): నిబంధనలు అడ్డంకిగా మారి మన్యం వాసుల మృతదేహాలను వారి స్వస్థలాలకు చేర్చలేని దుస్థి తిలో మహాప్రస్థానం సేవలు నడుస్తున్నాయి. మంగళవారం జరిగిన రాజమండ్రిలో జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. మారే డుమిల్లి మండలం తాడేపల్లికి చెందిన కత్తుల శంభురెడ్డి విద్యుద్ఘాతానికి గురై 80శాతం కాలిన గాయాలతో రాజమహేంద్రవరం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మంగళవారం పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అక్కడి నుంచి మృతదేహాన్ని తరలించడం కోసం రంపచోడవ రంలోని మాజీ ఎమ్మెల్యే చిన్నం బాబూ రమేష్ రాజమండ్రి ఆసుపత్రి ఆర్‌ఎమ్‌వోతో మాట్లాడి మహాప్రస్థానాన్ని ఏర్పాటు చేశారు. కాగా షరతు లతో ఆ గిరిజనుడి మృతదేహాన్ని రంపచోడవరం వరకూ చేర్చడానికి మాత్రమే ఆర్‌ఎమ్‌వో అను మతించారు. జిల్లా మారిపోయినందున, వేరే జిల్లాలో ఉన్న రంపచోడవరం ఏరియా ఆసుపత్రి పరిధిలోని గ్రామాలకు మహాప్రస్థానాన్ని పంపిం చే అవకాశం లేదని ఆయన తేల్చిచెప్పేశారు. దీంతో రంపచోడవరం నుంచి వేరే వాహనాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఎమ్మెల్యే శిరీషదేవి దృష్టికి విషయం చేరగా ఆమె కూడా రాజ మహేంద్రవరం ఆసుపత్రి ఆర్‌ఎమ్‌వో కోసం ప్రయత్నించారు. ఇంతేకా కుండా ఈ విషయాన్ని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దృష్టికి చేర్చడంతో పాటు అనేక ప్రయత్నాల ద్వారా మృ తదేహాన్ని రంపచోడవరంలో దింపేసి వెళ్లిపోకుం డా గమ్యానికి చేర్చేలా ఎమ్మెల్యే శిరీష, మాజీ ఎమ్మెల్యే బాబూ రమేష్, టీడీపీ అరకు పార్ల మెంటు కమిటీ ఉపాధ్యక్షుడు అడబాల బాపి రాజు కృషి చేశారు. గతంలో ఈ పరిస్థితి లేదని కొన్ని నిబంధనలు మన్యం వాసులకు శాపంగా మారుతున్నాయని, ఈ పరిస్థితిని సరి చేయాలని పలువురు ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.