సిలిండర్!
ABN , Publish Date - Mar 16 , 2026 | 01:15 AM
కలెక్టరేట్ (కాకినాడ), మార్చి 15 (ఆంధ్రజ్యో తి): ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కోసం జిల్లాలో గృహిణులు పడిగాపులు గాస్తున్నారు. గతంలో బుకింగ్ చేసిన 24 గంటలలోపు డెలివరీ చేసే వారు అయితే ఇప్పుడు 3 నుంచి ఆరురోజులు పడుతుందని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 8లక్షల 9వేల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు
గ్యాస్ సిలిండర్ కోసం పడిగాపులు
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌కు డిమాండ్
బుకింగ్ చేసిన 3 నుంచి 6 రోజులకు డెలివరీ
బెంబేలెత్తుతున్న జిల్లాలో గృహిణులు
కలెక్టరేట్ (కాకినాడ), మార్చి 15 (ఆంధ్రజ్యో తి): ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కోసం జిల్లాలో గృహిణులు పడిగాపులు గాస్తున్నారు. గతంలో బుకింగ్ చేసిన 24 గంటలలోపు డెలివరీ చేసే వారు అయితే ఇప్పుడు 3 నుంచి ఆరురోజులు పడుతుందని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 8లక్షల 9వేల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇజ్రాయిల్- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గత 15 రోజుల నుంచి చమురు దిగుమతులు నిలిచిపో యాయి. దీంతో వంటి గ్యాస్‌కు భారీగా డిమాం డ్ పెరిగింది. ఒక గ్యాస్ సిలిండర్ కోసం గృహి ణులు బుకింగ్ చేస్తే 3 నుంచి 6 రోజుల పడుతుంది. దీంతో ఇంట్లో వంట ఎలా చేయా లో అర్థం కావడంలేదని జిల్లాలో గృహిణులు ఆ వేదన చెందుతున్నారు. ఈలోగా అవసరాల కోసం బంధువుల నుంచి, స్నేహితుల నుంచి గా నీ గ్యాస్ సిలిండర్లను తీసుకొచ్చి కుంటున్నారు. ఎల్పీజీ గ్యాస్ వచ్చిన తర్వాత ఇస్తామనీ సర్దుబాటు చెప్పి తెస్తున్నారు. గ్యాస్ డిమాండ్ నేపథ్యంలో ఇంట్లో వంట చేయడం మహిళలకు పెనుసవాల్‌గా మారింది. పైగా గ్యాస్ బుకింగ్ కు దేశవ్యాప్తంగా ఒకే నంబర్ ఉండడంతో ఒత్తిడి పెరిగిపోయి బుకింగ్ అవ్వడం లేదని జిల్లావాసులు అంటున్నారు. అర్థరాత్రి 12 గం టల తర్వాత మాత్రమే బుకింగ్‌లు జరుగుతు న్నాయని చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో బుకింగ్ కాకపోతే కనీసం ఆఫ్‌లైన్‌లో బుకింగ్ చేయాల ని గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరిగినా ప్రయోజనం శూన్యంగానే ఉంది.
బుకింగ్‌కు గడువు పెంపు
గతంలో పట్టణాల్లో బుకింగ్‌కు బుకింగ్‌కు మధ్య గడువు 21 రోజులుగా ఉండేది. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో 25 రోజులు గడువు పెంచారు. దీంతో పట్టణాల్లో ఒక గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసిన తర్వాత మరో 25 రోజుల తర్వాతే బుకింగ్‌కు అవకాశం లభిస్తోంది. అలాగే గ్రామాల్లో అయితే 45 రోజుల తర్వాత గానీ బుకింగ్‌కు అవకాశం లేదు. ఇలా కొత్త నిబ ంధనలతో జిల్లాలో మహిళలు బెంబే లెత్తితు న్నారు. సాధారణంగా పట్టణాల్లో ఒక కుటుం బానికి ఒక రెగ్యూలర్ బండతోపాటు అద నంగా మరో సిలిండర్ అందుబాటులో ఉంటాది. అయి తే నలుగురు నుంచి ఆరుగురు సభ్యులు ఉండే కుటుంబం అయితే 20 రోజులకే సిలిండర్ వినియోగిస్తున్నామని గడువు పెంచడం వల్ల గ్యాస్ సిలిండర్ అ యిపోయిన వెంట నే ఎలా బుకింగ్ చే యగలమని ప్రశ్ని స్తున్నారు. కేంద్రం నిబంధనల వల్ల ఇబ్బందులు పడుతున్నామని జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాణిజ్య అవసరాలకు ఎల్పీజీ గ్యాస్
వాణిజ్య గ్యాస్ సిలిండర్లు సరఫరా ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల ఎల్పీజీ గ్యాస్(వంట ఇంటి గ్యాస్)ను జిల్లాలో రెస్టారెంట్లు, హోటళ్లు, తినుబండరాల దుకాణాల్లో విచ్చిలవిడిగా విని యోగిస్తున్నారు. గ్యాస్ బండ బహిరంగంగా కని పించకుండా రహస్యంగా వినియోగి స్తున్నారు. ఈ నేపథ్యంలో గత 3 రోజుల నుంచి అధికార బృందాలు హోటళ్లపై దాడులు చేసి వాణిజ్య అవస రాలకు వినియో గిస్తున్న ఎల్పీజీ సిలిండర్లు 45 సీజ్ చేశారు. 22 మం దిపై 6(ఏ) కేసులు నమోదు చేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఎలా పక్కదారి పడు తున్నాయోనని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో తని ఖీలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది.
గణనీయంగా పెరిగిన బుకింగ్స్
జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ బుకింగ్‌లు గణనీయంగా పెరిగిపోయాయి. 3 రెట్లు వరకు బుకింగ్స్ పెరిగిపోయినట్లు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. దీని వల్ల సిలిండర్లను సకాలంలో డోర్ డెలీవరి చేయలేక పోతున్నారు. ఒక సారి బుకింగ్ అయిన తర్వాత ఎప్పుడొస్తుందో తెలియడం లేదని మహిళలు వాపోతున్నారు.
కట్టెల పొయ్యి మీదే వంటలు
గత 15 రోజుల నుంచి చమురుకు ఏర్పడిన కొరత నేపథ్యంలో బుకింగ్ చేసినా గ్యాస్ బండ సకాలంలో ఇంటికి చేరుకోవడంలేదు. దీంతో ఆరురోజులు గ్యాస్ కోసం ఎదురు చూసిన తర్వాత కట్టెల పొయ్యి సిద్ధం చేసుకుని వంటలు చేసే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కట్టెల పొయ్యికు కొంత వరకు డిమాండ్ నెలకొంది.