అడుగడుగునా.. నారాజనం!
ABN , Publish Date - Jan 31 , 2026 | 01:22 AM
మంత్రి నారా లోకేశ్ పర్యటనకు టీడీపీ నేతలు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టా రు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కాకినాడ జిల్లాలోకి అడుగు పెట్ట డంతో అడుగడుగునా పూల స్వాగతం పలికారు.
ఎయిర్‌పోర్టు నుంచి అఖండ స్వాగతం
స్వాగత దండలతో ఎక్కడికక్కడ క్యూ
’హలో లోకేశ్’లో విద్యార్థుల ప్రశ్నలు
సోషల్ మీడియా పిల్లలకు దూరం చేస్తా
కాకినాడ కాజా స్వీట్..కార్యకర్తలు హాట్
హాస్టల్, కోరమండల్ ఆసుపత్రి ప్రారంభం
కాకినాడలో 9 గంటల పాటు పర్యటన
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
మంత్రి నారా లోకేశ్ పర్యటనకు టీడీపీ నేతలు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టా రు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కాకినాడ జిల్లాలోకి అడుగు పెట్ట డంతో అడుగడుగునా పూల స్వాగతం పలికారు.కార్యకర్తలు పసుపు జెండాలు, బైక్ ర్యాలీతో వెంట సాగారు. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఉదయం 9:30 గంటలకు దిగిన లోకేశ్‌కు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగ తం పలికారు.అక్కడి నుంచి రాజానగరం, అనపర్తి, పెద్దాపురం నియోజకవర్గం మీదుగా కాకినాడ చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు జేఎన్టీయూకే చేరు కుని విద్యార్థులతో హలో లోకేశ్ కార్యక్రమంలో ముఖాముఖి మాట్లాడారు. 20 మందికిపైగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇచ్చారు. వివిధ ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు ప్రదర్శించిన స్టాళ్లను పరిశీలించారు. ఆదిత్య విద్యా ర్థులు తయారుచేసిన అరటిదవ్వ నుంచి ఆహార ఉత్పత్తుల తయారీ, ప్రగతి విద్యార్థుల మొబైల్ బనానా ఎక్స్ ట్రాక్టర్, మరో కాలేజీ విద్యా ర్థులు సృష్టించిన రోబోను పరిశీలించారు. అనంతరం రూ.10 కోట్లతో నిర్మించి జేన్టీయూ బాయ్స్ హాస్టల్, సీసీ రోడ్లను ప్రారంభించారు. అక్కడి నుంచి నేరుగా కోరమండల్‌కు వెళ్లి 60 పడకల ఆసుపత్రి ప్రారంభించారు. సాయంత్రం నాలుగు గంటలకు అచ్చంపేట జంక్షన్ వద్ద కాకి నాడ రూరల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. రాత్రి 8 గంటలకు జిల్లా ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులతో కాసేపు సమీక్షించి రాజమహేంద్రవరం విమానా శ్రయానికి తిరు గు పయనమయ్యారు.లోకేశ్ వెంట ఎంపీ సానాసతీష్, ఎమ్మె ల్యేలు కొండబాబు, పంతం నానాజీ, సత్య ప్రభ, దివ్య, ఎమ్మె ల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ,టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గుణ్ణం చంద్ర మౌళి, జోనల్ ఇన్‌ఛార్జి సుజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. లోకేశ్ పర్యటనలో అడుగడుగునా పోలీసులు అతి చేశారు. జేఎన్టీయూలో కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలను అడ్డుకున్నారు. విధుల్లో ఉన్న రెవెన్యూ అధికారులు, ఉద్యోగులను కూడా వెనక్కు పంపేశారు.
పుష్కరాలు అద్భుతంగా నిర్వహిస్తాం..
వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను అద్భుతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే సివిల్ పనులు ఆరంభించినట్టు చెప్పారు. కుంభమేళా తరహాలో క్రౌడ్ మేనేజ్‌మెంట్ చేస్తామన్నారు. ఇందుకు ట్విన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని జేఎన్టీయూ అం దుబాటులో తేవాలని సూచించారు. గోదావరి జిల్లాలో ఆక్వా, పామాయిల్,కోకో పంటలకు మరింత సహకారం అందిస్తామన్నారు. కాకినాడలో రాబోతున్న గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఉమ్మడి జిల్లాకు కొత్త దిశ చూపిస్తుందన్నారు. ఉమ్మడి కుటుంబాల ప్రాధాన్యం గురించి వివరిస్తూ తమ ఇంట్లో ఎవరికీ వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లేవని.. తమవన్నీ ఉమ్మడి ఆస్తులేనన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ క్యాడర్‌తో తనది ప్రత్యేక బంధం అన్నారు. చంద్రబాబును అక్రమంగా జైల్లో నిర్బంఽ దించినప్పుడు నాయకులు, కార్యకర్తలు పోరాడిన తీరు అద్భుతం అని పేర్కొన్నారు. కార్యకర్తల మాటే తమకు వేదవాక్కు అని, వారు వ్యతిరేకించి పని ఏదీ పార్టీ చేయ దన్నారు. కాకినాడ కాజా చాలా స్వీట్ అని, కానీ కార్యకర్తలు హాట్ అంటూ చమ త్కరించారు. త్వరలో అన్ని కమిటీలు పూర్తిచేస్తామని పేర్కొన్నారు.అనంతరం కొన్ని గంటల పాటు క్యాడర్‌తో లోకేశ్ ఓపిగ్గా ఫొటోలు దిగారు.
ప్రెస్కిల్లా : సోషల్ మీడియా బ్యాన్ సాధ్యమేనా?
లోకేశ్: సోషల్ మీడియాను పిల్లలు ఉపయోగించకుండా చేయడం నా ఆలోచన. ఆ దిశగా కసరత్తు జరుగుతోంది. సైబర్ బుల్లింగ్ 13-16 సంవత్సరాల మధ్యే జరుగుతోంది. ఫ్రాన్స్, బ్రిటన్, ఇండియాలోని గోవాలో ఇప్పటికే నిషేధం ఉంది.
సాయిప్రకాశ్ : పవన్‌కు మీకు మధ్య బాండింగ్?
లోకేశ్ : 2014 ఎన్నికల ఫలితాల తర్వాత పవనన్నను హైదరాబాద్‌లో మొదట కలిశా. చంద్రబాబును రిమాండ్‌లో పెట్టినప్పుడు పవన్ వచ్చారు. అక్కడ మాట్లాడుకున్నాం. కష్టకాలంలో ఆదుకున్నవారిని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి.
ఆలయశ్రీ : జాబ్ ఎలా సంపాదించాలి?
లోకేశ్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 755 కంపెనీలు ఏపీకి వచ్చాయి. వ్యవసాయంలో దక్షిణ భారతదేశంలో నెంబర్ 1గా ఉన్నాం. సంక్షేమం,ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నాం.
కీర్తి : ఎదిగేందుకు అవకాశాలెలా కల్పిస్తారు?
లోకేశ్ : యువత జాబ్స్ క్రియేటర్స్‌గా తయారుకావాలన్నది నా లక్ష్యం. చంద్రబాబు ఒక సీరియస్ ఎంటర్‌ప్రెన్యూరర్ 4 పరిశ్రమలు ప్రారంభించి మూడింటిలో ఫెయిలై 4వ ది హెరిటేజ్‌లో సక్సెస్ అయ్యారు.