Share News

నాటి కలెక్టర్‌ ఆదేశించినా..పాటించరు!

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:59 AM

కలెక్టరేట్‌కు కూతవేటు దూరం.. అయినా నాటి కలెక్టర్‌ ఇచ్చిన ఆదేశాలు అమ లు కావడంలేదు.

నాటి కలెక్టర్‌ ఆదేశించినా..పాటించరు!
పెన్సింగ్‌ వేసి హెచ్చరిక బోర్డు లేకుండా వదిలేసిన సామాజిక స్థలం

నాడు ప్రభుత్వ స్థలాల విక్రయం

1700 గజాలు అన్యాక్రాంతం

కోర్టు తీర్పుతో అధికారుల అప్రమత్తం

రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని కలెక్టర్‌ ఆదేశం

నేటికీ ఆదేశాలు పాటించని వైనం

స్థలాల రక్షణకు చర్యలు శూన్యం

నిద్దరోతున్న అధికార యంత్రాంగం

రాజమహేంద్రవరం రూరల్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌కు కూతవేటు దూరం.. అయినా నాటి కలెక్టర్‌ ఇచ్చిన ఆదేశాలు అమ లు కావడంలేదు. ప్రస్తుత జిల్లా అధికారులకు విషయం తెలిసినా కళ్లు మూసుకుని కూర్చు న్నారు. స్థానిక అధికారులు వారి పని వారు కానిచ్చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడా ల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. కొంత మంది అధికారులు ఉదాసీన వైఖరితో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులు అన్యా క్రాంతమవుతున్నాయి.కలెక్టర్‌ కార్యాల యానికి కూతవేటు దూరంలో మండల ప్రధాన కేంద్రం లోనే ఇలాంటి పరిస్థితి నెలకొంది.ఇక నైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సి ఉంది.

రూ.7 కోట్ల విలువ.. స్థలాలకు రక్షణేది?

రాజమహేంద్రవరం రూరల్‌ మండల పరిధి లోని హుకుంపేట, బొమ్మూరు గ్రామాల్లో కోట్లాది రూపాయల విలువైన స్థలాలకు కూడా రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారంటే ఉన్నతాధికారుల పర్యవేక్షణ అర్ధం చేసుకోవచ్చు. ఆయా ప్రాంతాల్లో గజం రూ.40 వేల నుంచి రూ.45 వేలు ఉంటుంది. బొమ్మూ రు పంచాయతీ పరిధి జాతీయ రహ దారిని ఆనుకుని పెట్రోల్‌ బంక్‌ సమీపంలో సుమారు 400 గజాల సామాజిక స్థలానికి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి అమ్మేశారు.ఈ విషయం బయటపడడంతో నాటి జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు అప్పటి రూరల్‌ ఎంపీడీవో శ్రీనివాస రావు స్థలం చుట్టూ వేసిన ప్రహరీని కూలగొట్టి వదిలేశారు. ఆ తరువాత పంచా యతీ అధికా రులు దాని జోలికిపోలేదు.హుకుంపేట పంచాయతీ పరిధి రామ కృష్ణ నగర్‌ ఎఫ్‌సీఐ కాలనీ ప్రాంతంలో వేసిన ఎల్‌పీ నంబరు 624/85 లేఅవు ట్‌కు సంబంధించి సామా జిక స్థలం సుమారు 1333 గజాలు పంచాయతీ అధికా రుల సహకారంతో పంచా యతీరాజ్‌ శాఖలో పని చేస్తున్న ఆరుగురు ఏకంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా రు.ఈ విషయం బయటకు పొక్కడంతో అప్పటి డీఎల్‌పీవో కొట్నీస్‌బాబు విచారణ చేపట్టి సంబంధిత స్థలం పంచా యతీకి సంబంధించినదని నివేదిక సమర్పిం చారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి అమ్మిన వారిపై చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై కొనుగోలు దారులు 2010లో హైకోర్టును ఆశ్రయించారు.విచారణ అనంతరం 2011లో ఆ స్థలం పంచాయతీకి సంబంధించిన దంటూ కోర్టు తీర్పునిచ్చింది.ఆ తరువాత స్థలా న్ని ఎవరూ పట్టిం చుకోలేదు. కొన్నాళ్ల తరు వాత అప్పటి పంచాయతీ కార్యదర్శి అదే స్థలం లో ఇంటి నిర్మాణానికి అప్రూవల్‌ ఇచ్చేశారు.

నాడు ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కదలిక

గతేడాది సెప్టెంబరు నెలలో ‘ఆంధ్రజ్యోతి’లో రూ.5 కోట్ల స్థలం హాంఫట్‌ అన్న శీర్షికన కథ నం ప్రచురితమైంది. దీనిపై అప్పటి కలెక్టర్‌ ప్రశాంతి స్పందించి బొమ్మూరు, హుకుంపేట గ్రామాల్లో కబ్జాలకు గురైన స్థలాలకు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి, సంబంధిత స్థలాల రిజిస్ట్రేషన్లు రద్దయ్యేలా జిల్లా రిజిస్ట్రారుతో మాట్లాడి చర్యలు చేపట్టాలంటూ డీపీవో, డీ ఎల్‌పీవో, ఎంపీడీవోలకు ఆదేశాలు జారీచేశారు.అయినా నేటికి దీనిపై చర్యలు చేపట్టలేదు. కలెక్టరు ప్రశాంతి బదిలీ అయ్యారు కానీ స్థానిక అధి కారులు ఇక్కడే ఉన్నారు. హుకుంపేటలో ఆక్ర మణకు గురైన స్థలంలో పంచాయతీ అధికా రులు ఫెన్సింగ్‌ వేశారు.ఈ స్థలం ప్రభుత్వానికి సంబంధించినది అన్న బోర్టు కూడా పెట్టలేదు. రిజిస్ట్రేషన్‌ రద్దు చేయలేదు.బొమ్మూరు పంచా యతీ పరిధి హైవే ఆనుకుని ఉన్న సుమారు 400 గజాల సామాజిక స్థలం పరిస్థితి అలాగే ఉంది. అసలు స్థానిక అధికారులు ఏం చేస్తు న్నారనేది జిల్లా అధికారులకే ఎరుక.

Updated Date - Jan 23 , 2026 | 12:59 AM