Share News

పందేలకు.. సై!

ABN , Publish Date - Jan 12 , 2026 | 12:56 AM

నిషేధమంటారు.. హెచ్చరికలు చేయడం.. బరులు ధ్వంసం చేయడం మామూలే.. ఇదంతా సంక్రాంతి సందట్లో సడేమియా.. పందేలు వద్దంటే ఆగుతారా!?

పందేలకు.. సై!
తలపడుతున్న కోళ్లు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బరులు

సోషల్‌ మీడియాలోనూ ప్రచారం

ఎక్కడికక్కడ భారీగా ఏర్పాట్లు

పెద్ద బరులకు వేలం పాటలు

రూ.10 లక్షల నుంచి ఆరంభం

చిన్న బరులకు రూ.3 లక్షలు

పోలీసుల హెచ్చరికలు మామూలే

(రాజమహేంద్రవరం/కోరుకొండ-ఆంధ్రజ్యోతి)

ప్రతి ఏడాది మామూలే.. పోలీసులు నిషేధమంటారు.. హెచ్చరికలు చేయడం.. బరులు ధ్వంసం చేయడం మామూలే.. ఇదంతా సంక్రాంతి సందట్లో సడేమియా.. పందేలు వద్దంటే ఆగుతారా!? ఏడాదంతా ఎదురుచూసేది అందుకే కదా.. పోలీసులు హడావుడి తప్ప.. ఎక్కడికక్కడ బరులు రెఢీ అయిపోయాయి.. మరో 48 గంటల్లో బరిలో దిగేందుకు పందెగాళ్లు రెఢీ అంటుండగా.. మరో వైపు కోళ్లు కాళ్లు దువుతున్నాయి.. పెద్ద బరులకో రేటు.. చిన్న బరులకో రేటు.. ఒప్పందాలు జరిగిపోయాయి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా వెయ్యి బరుల వరకూ వెలుస్తాయని సమాచారం.. ఆపేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా.. పందెగాళ్లు తగ్గేదిలే అంటున్నారు.. ఎవరు గెలుస్తారో చూడాల్సిందే!కోళ్లు తొడగొడుతున్నాయి.. బరిలో దిగేందు కు సన్న ద్ధమవుతున్నాయి..సై అంటే సై అంటున్నాయి. పందె గాళ్లు పోటీలకు సన్న ద్ధమైపోతున్నారు. మరో వైపు పోలీసులు మాత్రం కోడి పందేలు నిషేధం అంటున్నా రు..మీరు బరులు వేస్తే..మేం దున్నేస్తాం..అని ప్రతి ఏడా ది మాదిరిగానే హూంక రిస్తున్నారు.మరోవైపు ఇదం తా ‘మామ్మూలే’ అనుకుంటూ బరులు సిద్ధమైపోతు న్నాయి. ఆయా పోలీస్‌ స్టేషన్లకు, ప్రజాప్రతి నిధు లకు ‘ఎంతో’ కూడా నిర్ణయమైపోతున్నా.. నలిగిపోతున్నా మంటూ కొందరు పోలీస్‌ అధికారుల మాటలు నవ్వులు పూయి స్తున్నాయి. బరి సైజు,బరిలో బోర్డులను బట్టి పాటలు పెట్టే శారు.కార్లు, బుల్లెట్లు బహుమతులుగా ఇవ్వడానికి సిద్ధం చేశారు. ఏకంగా సోషల్‌ మీడియాలో సైతం చాలా కాలంగా హల్‌చల్‌ చేస్తూ ఆయా బరులకు వెళ్లే దారులతో సహా ప్రచారం కల్పిస్తున్నారు. అయినా ఆయా బరుల జోలికి పోలీ సులు వెళ్లకపోవడం శోచనీయం.

1000 బరులు

కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లా ల్లో పందేలకు బరులు సిద్ధమైపోయాయి. సం క్రాంతి మూడు రోజులు ఓ పెద్ద పండు గలా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా చోట్ల నువ్వా నేనా అన్నట్లు ఏర్పాట్లు సాగుతున్నాయి. స్టేడియం మాది రిగా సిట్టింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలకు ప్రత్యేక గ్యాల రీలు ఏర్పాటు చేస్తున్నారు. పేకాట, గుండాట బోర్డులు, మద్యం దుకాణాలు, కూ ల్‌డ్రింక్స్‌, వాటర్‌ బాటిల్స్‌, స్నాక్స్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఆధారంగా రూ.5 లక్షల నుంచి బరుల ధరలు నిర్ధా రించారు. పెద్ద బరులు అయితే రూ.10 లక్షల నుంచి పాట మొదలైందని అంటు న్నారు. ఇక పోలీస్‌ స్టేష న్లకు గతంలో రూ.2లక్షల వరకూ ఉండే ప్రోత్సాహకం ఇప్పుడు రూ.5 లక్షలపైకి చేరింది. దీంతో కాస్త పెద్ద బరులు ఏర్పాటు చేసుకొనే చోట్ల ఆయా పోలీ స్‌ స్టేషన్లకు బాగానే గిట్టుబాటవుతుందని చెబుతున్నారు.బోగి వరకూ కేసులు చూపించి.. బోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో కోసలు.. కాసులతో కళకళలాడతాయనేది బహిరంగ రహస్యం.పెద్ద బరుల్లో ప్రవేశాలకు టికెట్ల ధరలను కూడా నిర్ణయించేశారు. వీఐపీ గ్యాల రీలు సిద్ధమవు తున్నాయి.ఆహుతులకు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.

పోలీసుల బురిడీ

ప్రతి ఏడాది కేసుల కోసం పందెం బరులను పోలీసులు ధ్వంసం చేయడం షరా మామూలే. ఈ ఏడాది కూడా అదే కనిపిస్తోంది. అయితే బరుల ధ్వంసంలో కూడా ఉన్నతాధికారులను బురిడీ కొట్టించే విధంగా మాయ జరుగుతోంది. కేసుల కోసం బరి ఒక చోట అయితే మరో చోట జేసీబీ, ట్రాక్టర్లు పెట్టి దున్నిస్తూ ఫొటోలను తీయించుకుంటున్నారు. బరులు మాత్రం యథా విధిగా సిద్ధమైపోతున్నాయి. పందెం, పేకాట వంటి చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్య లు తప్పవని ఇప్పటికే ఎస్పీలు రోజూ హెచ్చ రిస్తున్నారు. గ్రామాల్లో ఆటోలకు మైక్‌లు తగి లించి మరీ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెయ్యి బరులు సిద్ధం చేసినట్టు సమాచారం. బరులను సిద్ధం చేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్నా పోలీసులకు పట్టదెందుకనో’!

ఒకటోసారి..

నాయకులు కోడిపందేల విషయంలో జెండాలు పక్కన పెట్టి ఒకే అజెండాతో ముందుకు సాగుతున్నారు.సంక్రాంతి మూడు రోజులు కోడిపందాలు జరిగే చోట యథేచ్ఛగా నెంబరు గుండాట, ఇతర జూదాలు నిర్వహించుకునేందుకు వేలంపాటలు నిర్వహిస్తున్నారు. ఏరియా, గ్రామ జనాభా ఏర్పాటు చేసిన బరుల కెపాసిటీ బట్టి పాటలు రూ.3 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పలుకుతున్నాయి. నిర్వహణ ఖర్చులు పోగా మిగిలిన సొమ్ములతో గ్రామాల్లోని గ్రామదేవతలకు, ఇతర ఆలయాలకు చందాలు ఇస్తారట..

పోలీసులంటే,,భయమేది!

ఒకప్పుడు గ్రామాల్లో కోడి పందేలు వేయాలంటే పోలీసులు వస్తారేమోనని హడలిపోయేవారు. ఇప్పుడ ప్రతి గామ్రంలో 2 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు విస్తీర్ణం గల తోటల్లో పందాలు, జూదాలు, గుండాటలు నిర్వహించడం కోసం యఽథేచ్ఛగా ఏర్పాట్లు చేస్తున్నారంటే ఎంతముందస్తు ఒప్పందాలు కుదుర్చుకున్నారో మరి.

సోషల్‌ మీడియాలో హల్‌సెల్‌

బరుల్లో ఉండే ఏర్పాట్లు, బహుమతులతో పాటు కోళ్ల కొనుగోలు కూడా సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం జరుగుతోంది. బరులకు సంబంధించి ఇప్పటి వరకూ వాట్సాప్‌, ఫోన్ల ద్వారా ప్రచారం చేసుకునేవాళ్లు. ఈ ఏడాది సోషల్‌ మీడియా ద్వారా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ వంటి ఫ్లాట్‌ఫాంలలో కూడా పందేల సమాచారం ప్రత్యక్షమైంది.

కోరుకొండలో ‘బరి’ తెగింపు

కోడి పందేలకు సై అంటే సై అంటున్నారు.. ఎక్కడికక్కడ బరులు సిద్ధం చేస్తున్నారు.కోరుకొండ మండలం కోటి, మధురపూడి గ్రామాల్లో పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేస్తున్నారు.బరులపై సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేస్తుండడం గమనార్హం. అయినా పోలీ సులు మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఈ నేపథ్యంలో కోటి గ్రామంలో ఏర్పాటు చేసిన బరిపై ఎక్కడికక్కడ చర్చనీయాంశమ వుతోంది. ఎందుకంటే కోడి పందేల బరిలో గెలిచే విజేతలకు ఏకంగా 12 బుల్లెట్లు, స్విఫ్ట్‌ డిజైర్‌ కారు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. ఆ బుల్లెట్లు, కారు ఎలా ఇస్తారనేది తెలియదు కానీ.. సోషల్‌ మీడియా వేదికగా మాత్రం ప్రచారం హోరెత్తి పోతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌ టాఫిక్‌గా మారింది. దీనికి తగినట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. కోరు కొండ మండలంలోని 20 గ్రామాల్లో కోడిపందాల ముసుగులో భారీ గా గుండాట, పేకాట, మద్యం అమ్మకాలకు ఏర్పాట్లు చేస్తున్నా రు.కొన్ని గ్రామాల్లో గ్రామస్థాయి నాయకుల మధ్య సయోధ్య కుదరనప్పుడు వేరే బరులు ఏర్పా టు చేస్తున్నారు. కణుపూరు, మధురుపూడి,కోటి తదితర గ్రామాల్లో రెండేసి బరులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Jan 12 , 2026 | 12:56 AM