కత్తులు రె‘ఢీ’
ABN , Publish Date - Jan 04 , 2026 | 01:32 AM
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే కోడిపందాలే.. పం డుగ మూడు రోజులు కత్తి కట్టాల్సిందే.. బరిలో దిగా ల్సిందే.. రక్తం చిందించాల్సిందే.. మరో 10 రోజుల్లోనే సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో అప్పుడే చాలా మంది పందాల మూడ్‌లోకి వెళ్లిపోయారు. నిర్వాహకులు బరులు సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చిన్నా పెద్దా కలిపి సుమారు వెయ్యి బరులు వెలుస్తాయనే సమాచారం ఉంది.. పందేలకు తగినట్టు కత్తులు తయారుచేసే పనిలో పలువురు నిమగ్నమయ్యారు.
కోడి పందేలకు కత్తులు సంసిద్ధం
గ్రామాల్లో రహస్యంగా తయారీ
ఒక్కో కత్తి ధర రూ.300
ఉమ్మడి జిల్లాలో భారీగా వ్యాపారం
ఈ ఏడాది వెయ్యి బరులు?
పది రోజుల్లో కోట్లాటకు రెడీ
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే కోడిపందాలే.. పం డుగ మూడు రోజులు కత్తి కట్టాల్సిందే.. బరిలో దిగా ల్సిందే.. రక్తం చిందించాల్సిందే.. మరో 10 రోజుల్లోనే సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో అప్పుడే చాలా మంది పందాల మూడ్‌లోకి వెళ్లిపోయారు. నిర్వాహకులు బరులు సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చిన్నా పెద్దా కలిపి సుమారు వెయ్యి బరులు వెలుస్తాయనే సమాచారం ఉంది.. పందేలకు తగినట్టు కత్తులు తయారుచేసే పనిలో పలువురు నిమగ్నమయ్యారు. ఇటీవల గోకవరంలో కోడి కత్తులతో పలువురు పట్టుబడిన సంఘటన సంచలనం రేపింది. దీంతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు. పందేలు జరగనివ్వమని చెబుతున్నారు. చివరికి కోడి గెలుస్తుందో.. లాఠీ గెలుస్తుందో చూడాల్సిందే మరి..
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
కోడి పందెం అంటే తాట తీస్తాం.. కత్తి కడితే కట కటాలే.. ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా పోలీస్ అధికారులు చాలా బలంగా జారీ చేసే హెచ్చరికలివి. కానీ, ‘బరి’తెగిం చడం.. పందెం కోడి తొడగొట్టి మరీ కత్తి కట్టించుకోవడం కళ్లముందు జరిగే ఓ తెర అవసరం లేని కోడి పందేల కథా చిత్రమ్. పోలీసులు ఎంత హడావుడీ చేసినా సంక్రాంతికి ఆ మూడు రోజులూ తరతరాలుగా తంతు మామూలే. ఇప్పటికే కత్తుల దత్తాలు సిద్ధమైపో యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రహస్యంగా తయారు చేసి రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నారు. పండుగ సీజన్‌లో కత్తికట్టే వాళ్లకు చాలా డిమాండ్ ఉంటుంది. అడ్వాన్సులు చెల్లించి మరీ వారిని పందెం బరులు నిర్వహించేవాళ్లు కాపాడుకుంటారు. కత్తి, ఆ కత్తిని కట్టే తీరుపైనే పందెం గెలవడం సగం ఆధారపడి ఉంటుందని పందెంగాళ్లు నమ్ముతారు.
నిఘాతోనే అడ్డుకట్ట
ఈసారి కూడా పోలీసులు గట్టిగానే హెచ్చరికలు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో చాటుమాటుగా పందేలు మొదలయ్యాయని సమాచారం. ఇక పెద్ద బరుల నిర్వాహ కులు భోగికి ఎదురుచూస్తున్నారు. బరులకు కావాల్సిన టెంట్లు, కర్రలు, అంగబలాన్ని సిద్ధం చేసుకొనే పనిలో బిజీ అయిపోయారు. కత్తుల తయారీదారులు, కత్తికట్టే వాళ్లపై స్థానిక పోలీసులకు సమాచారం ఉన్నా చూసీచూడనట్టు వదిలేస్తారు. ఎందుకంటే ఆయా కత్తుల తయారీ కేంద్రాల వారు సంబంధిత పోలీస్ స్టేషన్‌ని ప్రతి ఏడాది ప్రసన్నం చేసుకుంటారని చెబుతారు. దీంతో ఉన్నతాధికారులు ఎంత కాలు దువ్వుతున్నా కత్తుల తయారీని ఆపలేకపోతున్నారు.
వేలల్లో కత్తులు..
సంక్రాంతి సీజన్‌కి కోడి పందేలకు లక్షల సంఖ్యలో కత్తులు తయారు చేస్తుంటారు. ఒక్కో కత్తి ధర రూ.300 నుంచి రూ.700 ఉంటుంది. కత్తి కట్టే వాళ్ల వద్ద వందల్లో కత్తులు ఉంటాయి. వాటిని ఓ బెల్డులా ఉన్న మందపాటి వస్త్రానికి అమర్చి ఆ వస్త్రాన్ని చుట్టగా చుట్టి పందెం వద్దకు తీసుకొస్తారు. దీనిని కత్తుల దత్తం అంటారు.కత్తి కట్టే వాళ్లకు పందేనికి రూ.300 నుంచి రూ.1,000 వరకూ ఇస్తారు. కత్తి కట్టే వాళ్లకు తెలిసిన పందెంగాళ్లు వారికి అదనపు సొమ్ము కూడా చెల్లిస్తారు. కోళ్లు వందల్లో ఉంటే కత్తులు లక్షల్లో ఎందుకనే అనుమానం రావొచ్చు. ఒకసారి పందేనికి వాడిన కత్తి ఆ రోజు మరో పుంజుకు కట్టరు. ఆ కత్తిని మళ్లీ సానబట్టించిన తర్వాతే వేరే పుంజుకు కడతారు.
కోడి కత్తులకు విమానం రెక్కలు
కోడికత్తిని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ముందు భాగంలో కత్తి.. దానికి అమర్చి కోడి కాలుకు కట్టడానికి వీలు గా ఊచవంటి ఏర్పాటు ఉంటుంది. ఈ ఊచను ‘కూలు’ అంటారు. కత్తి, కూలు కలుపుకొని కోడి కత్తి 4-6 అంగుళాల పొడవు ఉంటుంది. కూలును తాడుతో కోడి కాలుకు బలంగా కడతారు. దీంతో కత్తి బెసకడం ఉండదు.ఈ కత్తులను పండు గకు రెండు నెలల ముందు నుంచే రహస్యంగా తయా రు చేస్తారు. కోడి కత్తి ఎట్టి పరిస్థితుల్లోనూ వంగిపో కుండా ఉంటుంది.కత్తి విరగాలే గానీ, వంగిపోకూడ దని పందెగాళ్లు చెబుతారు. దీనికోసం సామర్థ్యం ఉన్న ముడిసరుకు వాడతారు.స్టీలు, ఇనుము వాడ రు. కత్తి తయారీకి ఉక్కుతో తయారైన కమాను కట్టలు, రైల్వే బెడ్లు వంటివి ఉపయోగిస్తారు. ఇప్పుడు కత్తి మ రింత పదునుగా ఉండడానికి హెలీకాప్టర్ రెక్కలు తది తర విడిభాగాలు ఉపయోగిస్తున్నారని చెబుతున్నా రు.ఈ ఖరీదైన కత్తులు బడా పందేల్లో వాడతున్నారు.