Share News

‘వరుస’కు ఓకే!

ABN , Publish Date - Jan 28 , 2026 | 01:27 AM

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ-జొన్నాడ, కాకినాడ-రాజమ హేంద్రవరం కెనాల్‌ రహదారుల నిర్మాణం సాధ్యమేనని తేలింది. పీపీపీ విధానంలో ఈ రహదారులు నిర్మిస్తే ముందుకు వచ్చిన కంపెనీకి ఆర్థికంగా లాభదాయకమేనని నిర్ధారణ అయింది. ఆర్‌అండ్‌బీ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం కాకినాడ- జొన్నాడ రహదారి అభివృద్ధికి రూ.225 కోట్లు, కెనాల్‌రోడ్డుకు రూ.170 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీటి భూసేకరణకూ భారీ వ్యయం కానుంది.

‘వరుస’కు ఓకే!
కాకినాడ-జొన్నాడ మధ్య రహదారి

ఉమ్మడి జిల్లాలో కాకినాడ-జొన్నాడ, కాకినాడ-రాజమహేంద్రవరం కెనాల్‌ రోడ్లకు ఓకే

పీపీపీ విధానంలో నిర్మాణ సాధ్యాసాధ్యాలపై ముగిసిన ఎల్‌ఎన్‌ మాలవ్య సంస్థ సర్వే

కాకినాడ-జొన్నాడ రహదారి అభివృద్ధికి రూ.225 కోట్లు ఖర్చవుతుందని అంచనా

కరప, వేళంగి, ఆలమూరు, మండపేటలలో బైపాస్‌ల నిర్మాణంతో భారీగా ఖర్చు

కెనాల్‌ రోడ్డు అభివృద్ధికి రూ.170 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా

అనపర్తి, వేమగిరి, కేశవరం, వేట్లపాలెం, బ్రహ్మదేవంలో బైపాస్‌లు అవసరంగా నిర్ధారణ

భూసేకరణకే వందల కోట్లు ఖర్చవుతుందని అంచనా : భారమంతా రాష్ట్ర ప్రభుత్వానిదే

సొంత నిధులతో రహదారి నిర్మించి ఆనక టోల్‌ వసూలు చేయనున్న ప్రైవేటు కంపెనీ

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ-జొన్నాడ, కాకినాడ-రాజమ హేంద్రవరం కెనాల్‌ రహదారుల నిర్మాణం సాధ్యమేనని తేలింది. పీపీపీ విధానంలో ఈ రహదారులు నిర్మిస్తే ముందుకు వచ్చిన కంపెనీకి ఆర్థికంగా లాభదాయకమేనని నిర్ధారణ అయింది. ఆర్‌అండ్‌బీ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం కాకినాడ- జొన్నాడ రహదారి అభివృద్ధికి రూ.225 కోట్లు, కెనాల్‌రోడ్డుకు రూ.170 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీటి భూసేకరణకూ భారీ వ్యయం కానుంది.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ- రాజమహేంద్రవరం కెనాల్‌ రోడ్డు, కాకినాడ- జొ న్నాడ రోడ్డు అత్యంత కీలకమైనవి. పలు పట్టణా లు, జాతీయరహదారిని కలిపే ఈ రహదారులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా ధ్వం సం అయ్యాయి. ఏమాత్రం మరమ్మతులకు నోచుకోక ప్రయాణికులకు నరకం చూపించాయి. ప్రభుత్వం మారిన తర్వాత వీటిపై అధికారులు గుంతలు పూడ్చారు. మరోపక్క కీలకమైన ఈ రెండు రహదారులను విస్తరించి కొత్తగా నిర్మించ డానికి అయ్యే ఖర్చును ప్రభుత్వ, ప్రైవేటు భాగ స్వామ్యం ద్వారా భరించాలని గతేడాది సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ప్రతిపాద నలు సిద్ధం చేశారు. కాకినాడ జిల్లా నుంచి కోన సీమ జిల్లాను కలిపే కాకినాడ-జొన్నాడ రహ దారి ద్వారా రావులపాలెం జాతీయ రహదారికి చేరుకోవచ్చు. అయితే ఈ రోడ్డు కాకినాడ నగరం నుంచి కరప, వేళంగి, రామచంద్రపురం, మండ పేట, ఆలమూరు మీదుగా వెళ్తుంది. నిత్యం ఈ రోడ్డు భారీగా రద్దీగా ఉంటుంది. రావులపాలెం, విజయవాడ, హైదరాబాద్‌ వెళ్లే బస్సులు, కార్లు, ఇతర లారీలన్నీ ఈ దారి మీదుగానే ప్రయాణి స్తాయి. కానీ ఎన్నో ఏళ్ల కిందట నిర్మించిన ఈ రహదారి ఇప్పుడున్న ట్రాఫిక్‌ను ఏమాత్రం తట్టు కోలేని విధంగా మారింది. రోడ్డు ఎక్కడికక్కడ చాలా చిన్నది కావడంతో వచ్చీపోయే వాహనాల కు ఏమాత్రం సరిపోవడం లేదు. అటు అనేక చోట్ల పట్టణాలు, గ్రామాలు ఉండడంతో అత్యం త నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ఆర్‌అండ్‌బీ రహదారిని పీపీపీ విధానంలో భారీస్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటు 50 కిలోమీటర్ల పొడవున్న కాకినాడ-రాజమహేంద్రవరం కెనాల్‌ రోడ్డు సైతం ఈ రెండు నగరాలను కలిపే కీలక రహదారి. ఒకరకంగా ఏడీబీ రోడ్డుతో పోల్చితే కెనాల్‌ రోడ్డు ద్వారా రెండు నగరాల మధ్య దూరం తక్కువ. ప్రస్తుతం అనేక లారీలు, కార్లు, బస్సులు ఇతర వాహనాలన్నీ ఈ రోడ్డుపై నుంచే వెళ్తున్నాయి. మధ్యలో అనేక గ్రామాలు, పట్టణా లు ఉండడంతో ట్రాఫిక్‌ దారుణంగా ఉంటోంది. రహదారి మాత్రం ఇరుగ్గా ఉండడంతో నిత్యం నరకమే. దీన్ని కూడా పీపీపీ విధానం ద్వారా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నిర్మాణానికి ఓకే...

ఈ రెండు రహదారులను పీపీపీ విధానంలో భారీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభు త్వం వీటి నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధ్యయ నం చేయించడానికి సర్వే బాధ్యతలను ఎల్‌ఎన్‌ మాలవ్య అనే సంస్థకు గతేడాది మేలో అప్పగించింది. మధ్యప్రదేశ్‌కు చెంది ఈ సంస్థ ఇటీవల తన సర్వే పూర్తిచేసింది. ఈ ఏడాది నవంబరు వరకు ఈ రెండు రోడ్లపై కూలంకుష సర్వే జరి పింది. ఇప్పుడున్న వాహనాల రద్దీ తదుపరి కొన్నేళ్లలో ఎలా పెరుగుతుంది? పీపీపీ విధానం లో రహదారులను నిర్మించే కంపెనీలకు ఆ తర్వాత టోల్‌ వసూలు ద్వారా డబ్బులు వచ్చి లాభదాయకంగా మారుతుందా? లేదా అనేదాని పై సర్వే చేసి తాజాగా పచ్చజెండా ఊపింది. పీపీపీ విధానంలో ఈ రెండింటి నిర్మాణం సాధ్య మేనని తేల్చింది. వివిధ రవాణా సంస్థల నుంచి డేటా సేకరించడంతోపాటు ఈ రోడ్లను అభివృద్ధి చేస్తే ఎంత కాలానికి పీపీపీ విధానంలో కాం ట్రాక్టర్‌కు అప్పగించవచ్చు, టోల్‌ వసూలు ఎంత చేయాల్సి ఉంటుంది. రహదారిని నిర్మించిన తర్వాత టోల్‌ ద్వారా కాంట్రాక్టర్‌కు వెచ్చించినం త మొత్తం రాకపోతే ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ద్వారా ఎంత చెల్లించాలి? తది తర అంశాలపై డీపీఆర్‌లో వివరించింది. దీంతో ఎట్టకేలకు ఈ రెండు రహదారులకు మంచి రోజులు వచ్చినట్టు అయింది. కాగా కాకినాడ- జొన్నాడ రహదారిలో ఇప్పటికే పలు పట్టణాలు, గ్రామాలు భారీగా విస్తరించినందున నాలుగు లేన్ల కొత్త రహదారి అభివృద్ధికి భూములు, ఇళ్లు సేకరించాల్సి వస్తుందని, అదే జరిగితే ఖర్చు భారీగా ఉంటుందని ఇప్పటికే ఆర్‌అండ్‌బీ అధికా రులు ఓ అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో కరప, వేళంగి, మండపేట, ఆలమూరు మీదుగా కొత్తగా బైపాస్‌లు నిర్మించాల్సి ఉంటుందని చెబు తున్నారు. ఇందుకు రూ.225 కోట్ల వరకు ఖర్చ య్యే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. అలాగే కెనాల్‌ రోడ్డుకు సైతం నాలుగు రహదారులు నిర్మించాల్సి రావడం, అటు అనపర్తి, వేమగిరి పట్టణాల మీదుగా రహదారి వెళ్తుండడంతో వీటి ని బైపాస్‌ చేస్తూ కొత్తగా రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఉంది. అలాగే కేశవరం, వేట్లపాలెం, బ్రహ్మదేవం ప్రాంతాల్లో కాలువ, రైల్వే ట్రాక్‌, రోడ్డు పక్కపక్కనే ఉన్నాయి. ఈనేపథ్యంలో వీటి వద్ద కూడా బైపాస్‌ అవసరం. దీనికి మొత్తం రూ.170 కోట్ల వరకు వ్యయం అవుతుందని అధి కారులు అంచనాకు వచ్చారు. కాగా ఈ రెండు రోడ్లకు భూసేకరణ అంతా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంది. ఆ తర్వాత వీటిని ప్రైవేటు సం స్థ నిర్మిస్తుంది. భూసేకరణ ఎంత అవసరమో తేల్చాలని ప్రభుత్వం ఆదేశించిన వెంటనే రం గంలోకి దిగడానికి అధికారులు సిద్ధమయ్యారు.

Updated Date - Jan 28 , 2026 | 01:27 AM