తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చిన వేటూరి
ABN , Publish Date - Jan 30 , 2026 | 01:17 AM
తుని రూరల్, జనవరి 29 (ఆంధ్ర జ్యోతి): తెలుగు సాహిత్యానికి, తెలు గు పాటకు వన్నె తెచ్చిన వ్యక్తిగా వే టూరి చిరస్థాయిలో నిలిచిపోతారని... వేటూరి కలానికి అన్ని వైపులా పదునుండేదని ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్ అన్నారు. గురువారం కాకినాడ జిల్లా తుని చిట్టూరి మెట్రో ప్రాంగణంలో వేటూరి సాహితి పీఠం, శ్రీప్రకాష్ కల్చరల్ అసో సియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేటూరి జయంతి వేడుకల్లో ఈ ఏడాది పంచమదశ (15వ) వేటూరి కవి
వేటూరి కవితా పురస్కారం అందుకున్న సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్
తుని రూరల్, జనవరి 29 (ఆంధ్ర జ్యోతి): తెలుగు సాహిత్యానికి, తెలు గు పాటకు వన్నె తెచ్చిన వ్యక్తిగా వే టూరి చిరస్థాయిలో నిలిచిపోతారని... వేటూరి కలానికి అన్ని వైపులా పదునుండేదని ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్ అన్నారు. గురువారం కాకినాడ జిల్లా తుని చిట్టూరి మెట్రో ప్రాంగణంలో వేటూరి సాహితి పీఠం, శ్రీప్రకాష్ కల్చరల్ అసో సియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేటూరి జయంతి వేడుకల్లో ఈ ఏడాది పంచమదశ (15వ) వేటూరి కవితా పురస్కారాన్ని కాసర్ల శ్యామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేటూరి పాటల్లో నవరసాలు పొంగి పొర్లు తాయని, ఎలాంటి భావానైనా పలికించ గలిగే శక్తి ఆయనకే సాధ్యమన్నారు. ఆ మహాను భావు డి జయంతి వేడుకలు ఇంత ఘనంగా జరగడం తెలుగు సాహిత్యానికి ఇస్తున్న గౌరవం అన్నారు. 2003లో సినీ పరిశ్రమకు వచ్చిన తనకు మహా త్మా సినిమాలో నీలపురి గాజుల పాటతో గుర్తిం పు వచ్చిందన్నారు. తన పాట ఒక్కటి కూడా బాలు పలకపోవడం, వేటూరిని కలవకపోవ డమే తన జీవితంలో తీరని లోటన్నారు. జేబు సంతృప్తి కాకుండా జాబు సంతృప్తి కావాల న్నారు. మా తరంలో మేము చూసిన అన్నమ య్య వేటూరి అని.. నా పల్లె నాతల్లి పాటలో ఉండడం వల్లే తాను జాతీయ గేయ రచయిత పురస్కారం అందుకున్నానన్నారు. శ్రీప్రకాష్ విద్యాసంస్థల సంయుక్త కా ర్యదర్శి, వేటూరి సాహితి పీఠం ప్రధాన కార్యదర్శి సీహెచ్. విజయ్‌ప్రకాష్, వ్యవస్థాపక కార్యదర్శి కేఆర్ జే.శర్మ కాసర్ల శ్యామ్‌ని వేటూరి పురస్కారంతో ఘనంగా సత్కరించారు. తుని, పాయకరావు పేటకు చెందిన పలువురు ప్రముఖులు 150 పుస్తకాలతో ఘనంగా సత్కరించారు. కాసర్ల శ్యా మ్ పాటలు పాడి ఆహుతులను అలరించారు. కార్యక్రమంలో వేటూరి సాహితి పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు చక్కా సూర్యనారాయణ, సినీ మాటల రచయిత ఆకెళ్ళ శివప్రసాద్, సినీ నటు లు వడ్లమాని శ్రీనివాస్, ఐడీబీఐ బ్యాంక్ జనరల్ మేనేజరు సూర్య కిరణ్‌శర్మ మల్లాది, ఆది స్వరూప్ పట్నాయక్, ప్రముఖులు పాల్గొన్నారు.