జాతీయ రహదారిపై రెండు కంటైనర్లు ఢీ
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:34 AM
కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి 16వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి రెండు కంటైనర్లు ఢీకొన్న ఘటనలో ఒక డ్రైవర్ సజీవదహనయ్యాడు.
మంటల్లో పూర్తిగా దగ్ధమైన లారీలు.. డ్రైవర్ సజీవ దహనం
శంఖవరం, జనవరి 29(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి 16వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి రెండు కంటైనర్లు ఢీకొన్న ఘటనలో ఒక డ్రైవర్ సజీవదహనయ్యాడు. కోల్‌కతా నుంచి చెన్నైకు కాటన్ వేస్ట్ లోడుతో వెళుతున్న లారీ భీమవరం నుంచి కొత్తపల్లి మండలం మూలపేట ఎస్‌ఈజెడ్‌కు రొయ్యల మేత లోడుతో వెళుతున్న లారీని రావికంపాడు జంక్షన్ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రొయ్యల మేత లారీ డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు వ్యాపించడంతో రెండు లారీలూ పూర్తిగా దగ్ధమయ్యాయి. కాటన్ వేస్ట్ లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్ సలాం(43) మంటల్లో చిక్కుకుని మృతిచెందాడు.