Share News

జిల్లాలో రూ.212 కోట్లతో ఉపాధి పనులు

ABN , Publish Date - Jan 07 , 2026 | 01:22 AM

జిల్లాలో రూ.212కోట్ల మేర ఉపాధి హామీ పనులు జరిగాయని, వేతనాలకు రూ.136కోట్లు, మెటీరియల్‌కు రూ.71కోట్ల వ్యయమైనట్టు డ్వామా పీడీ ఎస్‌.మధుసూదన్‌ తెలిపారు.

జిల్లాలో రూ.212 కోట్లతో ఉపాధి పనులు

అల్లవరం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రూ.212కోట్ల మేర ఉపాధి హామీ పనులు జరిగాయని, వేతనాలకు రూ.136కోట్లు, మెటీరియల్‌కు రూ.71కోట్ల వ్యయమైనట్టు డ్వామా పీడీ ఎస్‌.మధుసూదన్‌ తెలిపారు. అల్లవరంలో మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ పల్లెపండుగ ద్వారా రూ.63కోట్లతో 1042 పనులు, 1005 సీసీ రోడ్లు 121 కిలోమీటర్ల మేర వేశారన్నారు. రూ.3కోట్లతో 6.5 కిలోమీటర్ల 11 బీటీ రోడ్లు నిర్మాణం జరిగాయన్నారు. 13 కిలోమీటర్ల మేర 26 మెటల్‌రోడ్ల పనులకు రూ.3.28కోట్లు ఖర్చుచేశారన్నారు. రూ.10.34కోట్ల వ్యయంతో 838 మినీ గోకులం షెడ్లు నిర్మించారన్నారు. మొదటి విడత 602 ఎకరాల్లో రూ.1.33 కోట్లతో హార్టీకల్చర్‌, రెండో విడత పల్లెపండుగలో రూ.2.20 కోట్లతో 97 కిలోమీటర్ల మేర 412 వర్కులు జరిగాయన్నారు. రూ.80కోట్లు పరిపాలన ఆమోదం లభించిందన్నారు. ఏపీడీ డి.రాంబాబు, పీఆర్‌ డీఈఈ పీఎస్‌ రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 01:22 AM