జేఎన్టీయూకే, ఏపీ పోలీస్ శాఖ మధ్య అవగాహన ఒప్పందం
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:42 AM
జేఎన్టీయూకే, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జేఎన్టీయూ, ఏపీ పోలీస్ శాఖ మధ్య అవ గాహన ఒప్పందాన్ని బుధవారం వీసీ సమావేశ హాల్లో కుదుర్చుకున్నట్టు
జేఎన్టీయూకే, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జేఎన్టీయూ, ఏపీ పోలీస్ శాఖ మధ్య అవ గాహన ఒప్పందాన్ని బుధవారం వీసీ సమావేశ హాల్లో కుదుర్చుకున్నట్టు ఉప కులపతి ప్రొఫెసర్ సీఎస్‌ఆర్కే ప్రసాద్ తెలిపారు. సైబర్ నేరా ల నివారణ, దర్యాప్తు, డిజిటల్ పోలీసింగ్ రంగా ల్లో పోలీస్ సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఎంవోయూను కుదుర్చుకున్నామన్నారు. ఇరువురు ప్రతినిధులు సంతకాలు చేసిన అవగాహన ఒప్పంద పత్రాలను వీసీ ప్రసాద్ సమక్షంలో రిజిస్ర్టార్ ఆర్.శ్రీనివాసరావు, ఏఐజీ మోకా సత్తిబాబు మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లకు సైబర్ క్రైమ్ డిజిటల్ పోలీసింగ్‌లో 9 నెలల సర్టిఫికెట్ కోర్సును నిర్వహించనున్నట్టు వీసీ తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన పెంచి కేసుల విచారణలో సమర్ధతను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ వీసీలు, డైరెక్టర్లు పాల్గొన్నారు.