తాళ్లపూడి జనసేన మండలాధ్యక్షుడిపై కేసు
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:19 AM
భూమి కొంటానని చెప్పి మోసగించిన తాళ్లపూడి జనసేన మండల అధ్యక్షుడు గంటా శివ రామకృష్ణను పోలీసులు అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు.
అరెస్టు చేసి..విడుదల.. 18 కేసుల్లో నిందితుడు
తాళ్లపూడి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : భూమి కొంటానని చెప్పి మోసగించిన తాళ్లపూడి జనసేన మండల అధ్యక్షుడు గంటా శివ రామకృష్ణను పోలీసులు అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు. నకిలీ పాస్‌బుక్‌లు ఇచ్చి సొమ్ము కాజేశాడని సోమవారం కొవ్వూరుకు చెందిన పోతునీడి అమరావతి పోలీసు లకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. పోతినీడి అమరావతి అనే మహిళకు నకిలీ పత్రాలతో భూమిని విక్రయించి అపై భూమిని అభివృద్ధి చేయడానికి రూ. 14 లక్షలు తీసుకుని మోస గిం చాడని వాపోయింది. ఇటీవల డబ్బులు ఇవ్వాలని గంటా శివ రామకృష్ణ ఇంటికి వెళ్లగా తనను కొట్టి చంపుతానని బెదిరించాడని కన్నీటి పర్యంతమైంది. బా ధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు దర్యాప్తు చేయ గా గంటా శివరామకృష్ణపై 2007 నుంచి నకిలీ పాస్ పుస్తకాలు, చీటింగ్, సివిల్ తదితర 18 కేసులు ఉన్నా యన్నారు. ఉద్యోగాలు ఇప్పి స్తానని పలువురిని మోస గించినట్టు సమాచారం. కేసు నమోదు కావడంతో పలువురు బాధితులు బ యటకు వచ్చారు. 18 కేసు ల్లో నిందితుడిగా ఉన్నం దున సస్పెక్ట్ కేసు నమోదు చేసి సోమవారం అతడిని తన ఇంటి వద్ద అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని కోర్టు నందు హాజ రుపరిచామని తెలిపారు. కాగా కోర్టులో గంటా శివరామకృష్ణకు బెయిల్ మంజూరు చేయగా పూచీకత్తుపై విడుదల చేశారు.