Share News

బైక్‌ కొనేందుకు ఒప్పుకోని భార్య... భర్త ఆత్మహత్య

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:11 AM

కాకినాడ రూరల్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): తాను బైక్‌ కొనేందుకు డబ్బులిప్పించాలని భర్త భార్యను కోరగా ఆమె నిరాకరించడంతో మద్యం మత్తులో ఉరి వేసుకుని ఆ

బైక్‌ కొనేందుకు ఒప్పుకోని భార్య... భర్త ఆత్మహత్య

కాకినాడ రూరల్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): తాను బైక్‌ కొనేందుకు డబ్బులిప్పించాలని భర్త భార్యను కోరగా ఆమె నిరాకరించడంతో మద్యం మత్తులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాకినాడ జిల్లా కాకినాడ రూరల్‌ మండలం తూరంగిలో జరిగింది. ఇంద్రపాలెం ఎస్‌ఐ ఎం.వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. తూరంగి పగడాలపేటలోని అద్దె ఇంట్లో గత 5ఏళ్లుగా అల్లుమల్లు అనిల్‌కుమార్‌(38), శిరీషా దంపతులు నివాసముంటూ కూలిపనిచేసుకుని బతుకుతున్నారు. అ యితే భర్త తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. గురువారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్త భార్యను బైక్‌ కొనేందుకు డబ్బులిప్పించాలని గొడవచేయడంతో ఆమె నిరాకరించింది. దీంతో భర్త ఇంట్లోని గది తలుపులకు గడియపెట్టి సీలింగ్‌ ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. కాకినాడ జీజీహెచ్‌కు అంబులెన్స్‌లో తరలించగా అనిల్‌కుమార్‌ మృతిచెందినట్టు వైద్యులు ని ర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనిల్‌కుమార్‌ తల్లి వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామని, పంచనామా అనంతరం మృతదేహా న్ని కుటుంబసభ్యులకు అప్పగించామని ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - Jan 03 , 2026 | 12:11 AM