Share News

సన్‌.. డే!

ABN , Publish Date - May 25 , 2026 | 12:41 AM

ఉమ్మడి జిల్లా అధిక ఉష్ణోగ్రతలతో ఉడికిపోతోంది. ఎండకు తాళలేక జనం తల్లడిలిపోతున్నారు. ఎండల తీవ్రత అనూహ్యంగా పెరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. నిప్పుల కొలిమిలా వాతావరణం మారడంతో ఇంటి నుంచి బయటకు రావడానికి సాహసించలేకపోయారు. పల్లెలు, పట్టణాల్లో జనం ఎండ వేడిమికి అల్లాడిపోతున్నారు. సీసీ రోడ్లు సెగలు గక్కాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో రవాణా సౌకర్యాలు సైతం స్తంభించిపోయాయి. ఆటోలు, బస్సులు, ప్రయాణికులు లేక వెలవెలబోయాయి. విద్యుత్‌ కోతలు పెరిగిపోయాయి. పలు చోట్ల తీవ్రమైన ఉష్ణోగ్రతలకు ట్రాన్స్‌ఫార్మర్లు ట్రిప్‌ అయి విద్యుత్‌ సరఫరాలో అం

సన్‌.. డే!

ఓరి..భానుడోయ్‌..

మండిన సూర్యుడు

రాజమహేంద్రిలో అత్యధికం

49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

ఉమ్మడి జిల్లాలో 40 డిగ్రీల పైనే

ఎండలకు అల్లాడిన జనం

నేటి నుంచి మరింత తీవ్రం?

(కాకినాడ/అమలాపురం/ రాజమహేంద్రవరం సిటీ - ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి జిల్లా అధిక ఉష్ణోగ్రతలతో ఉడికిపోతోంది. ఎండకు తాళలేక జనం తల్లడిలిపోతున్నారు. ఎండల తీవ్రత అనూహ్యంగా పెరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. నిప్పుల కొలిమిలా వాతావరణం మారడంతో ఇంటి నుంచి బయటకు రావడానికి సాహసించలేకపోయారు. పల్లెలు, పట్టణాల్లో జనం ఎండ వేడిమికి అల్లాడిపోతున్నారు. సీసీ రోడ్లు సెగలు గక్కాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో రవాణా సౌకర్యాలు సైతం స్తంభించిపోయాయి. ఆటోలు, బస్సులు, ప్రయాణికులు లేక వెలవెలబోయాయి. విద్యుత్‌ కోతలు పెరిగిపోయాయి. పలు చోట్ల తీవ్రమైన ఉష్ణోగ్రతలకు ట్రాన్స్‌ఫార్మర్లు ట్రిప్‌ అయి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రెండు రోజుల కిందట కామనగరువు మిక్చర్‌కాలనీ సమీపంలో ఒక విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్ధమై ఆ ప్రాంతంతో విద్యుత్‌ సరఫరా స్తంభించిపోయింది. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం కాస్త వాతావరణం చల్లబడినా.. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఉక్కబోతతో ప్రజలు అవస్థలు పడ్డారు. అధిక వేడి తట్టుకోలేక ఆపసోపాలు పడ్డారు. ఆదివారం సెలవు కావడంతో ఇంటి పట్టునే ఉండిపోయారు. రోజూవారీ పనులు, రిక్షా కార్మికులు, కాయకష్టంతో పూట గడుపుకొనే వారు అవస్థలు పడుతూనే తమ కార్యకలాపాలు చేపట్టారు. ఎండ వేడిమి తాళలేక కొందరు చెట్ల నీడన సేదతీరారు. చిన్నపిల్లలు సైతం ఎండ వేడిమిని తట్టుకోలేక గిజగిజలాడారు. మరోవైపు పచ్చని చెట్లు సైతం ఎండదెబ్బకు మాడిపోతున్నాయి. ఆవులు, కోళ్లు, గేదెలు, మేకలతో పాటు పక్షులు సైతం గొంతు తడారి గావుకేకలు పెడుతున్నాయి.వడగాడ్పులు తీవ్రస్థాయి లో వీచాయి. భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నాలుగో రోజు ఆదివారం రాజమహేంద్రవరంలో రికార్డుస్థాయిలో గరిష్ఠంగా 49 కనిష్టంగా 29.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమో దైంది.కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 46.5 డిగ్రీలు, కాకినాడ జిల్లాలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాకినాడ జిల్లాలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల మధ్య ప్రాంతలో 45 డిగ్రీలకు చేరింది. సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల ప్రాంతంలోనూ సుమారు 40 డిగ్రీల ఉష్ణోగ్రత స్థిరంగా కనిపించింది.ఈ నెలలో ఈ ఆదివారం రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది.

నేటి నుంచి

రోహిణికార్తె ఆరంభం

పిఠాపురం/గొల్లప్రోలు/మండపేట, మే 24 (ఆంధ్రజ్యోతి): మండే నుంచి ఎండ మంటలు రేపనుంది. ఎందుకంటే రోహిణికార్తె సోమ వారం నుంచి ప్రారంభమవుతుంది. జూన్‌ 8 వరకు రోహిణి కార్తె ఉంటుంది.ఈ రోజుల్లో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయి. ఎండలు ఎక్కువగా ఉంటే శరీరం డీహైడ్రెట్‌ చేసే మద్యం, కాఫీ,టీ వంటివి తీసుకోకూడదు. నీరు ఎక్కువగా తాగా లి. ఇంట్లో తయారు చేసిన మజ్జిగ, చల్లటి శీతలపానీయాలు కొబ్బరినీళ్లు, ఓఆర్‌ఎస్‌, వంటి వాటిని తీసుకోవాలి. తప్ప నిసరి అయితే తప్ప ఎండలో బయటకు రా కూడదు. ఈ సారి రోహిణికార్తెను తట్టుకోవ డం కష్టమేనని నిపుణులంటున్నారు. గతేడాది రోహిణి ప్రారంభంలోనే వర్షాలు పడడంతో వాతావరణం చల్లబడింది.ఈ సారి అలాగే వా తావరణం మారాలని ప్రజలు ఆశిస్తున్నారు.

రాజమండ్రిలో 49

రాజమహేంద్రవరంలో అత్యధికంగా 49 డి గ్రీలు, గోపాలపురం 48.3, ఉండ్రాజవరం 48.1, చాగల్లు 46.7, రాయవరం 46.5, కొ వ్వూరు 46, కడియం 45.9, నల్లజర్ల 45.8 ,కోరుకొండ 45.5, గోకవరం 45.5, దేవరపల్లి 45.3 ,రాజానగరం 45.3, రాజమహేంద్రవరం రూరల్‌ 45.2 ,పెరవలి 45.1, కపిలేశ్వరపురం 45, మండపేట 45, అనపర్తి 45,నిడదవోలు 44.5, రంగంపేట 44.5, తాళ్ళపూడి 44.4, బిక్కవోలు 44.1, సీతానగరం లో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రామచంద్రపురం,గంగవరంలో 46.5

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం, కె.గంగవరంలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయినవిలల్లిలో 44.7, ఆలమూరు 45, అల్లవరం 42.6, అమలాపురం 44.7, అంబాజీపేట 44.1, ఆత్రేయపురం 45.1, ఐ.పోలవరం 41.4, కాట్రేనికోన 40.8, కొత్తపేట 44.1, మలికిపురం 42.8, మామిడికుదురు 42.6, ముమ్మిడివరం 44.2, పి.గన్నవరం 44.1, రావులపాలెం 45.1, రాజోలు 42.8, సఖినేటిపల్లి 42.3, ఉప్పలగుప్తం 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి.

కాకినాడ 44

కాకినాడ నగరంలో ఆదివారం అత్యధికంగా 44 డిగ్రీలు, కాకినాడ రూరల్‌, పెద్దాపురం, సామర్లకోట, గొల్లప్రోలు, పిఠాపురం, తొండంగి, కోటనందూరు, తుని, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, ఏలేశ్వరం, జగ్గంపేట, గండేపల్లి, తాళ్లరేవులో 43 డిగ్రీలు, పెదపూడి, కరప, యు.కొత్తపల్లి, కాజులూరు 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వడగాడ్పులకు ఇద్దరి మృతి

అంబాజీపేట/మండపేట, మే 24 (ఆంధ్రజ్యోతి): వడగాడ్పులకు గురై ఇద్దరు మృతి చెందారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం వాకలగరువు అగ్రహారానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు పేరాబత్తుల వెంకటరత్నం(44) ఆదివారం వైద్యం చేసేందుకు వెళ్లి మధ్యా హ్నం రెండు గంటలకు తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే తిరిగి 3 గంటల సమయంలో బైక్‌పై ఏటిగట్టు మీదుగా వెళుతుండగా వడదెబ్బకు గురై కిందపడిపోయాడు. స్థానికులు సమాచారం మేరకు 108 అంబులెన్స్‌లో ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది పరీక్షించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.

మండపేట మండలం ఇప్పనపాడు గ్రామా నికి చెందిన తిరుశుల సత్యనారాయణ(50) వడదెబ్బకు గురై మృతిచెందాడు. సత్యనారా యణ మండపేట సత్తెమ్మ తల్లి ఆలయంలో పనిచేస్తుంటాడు.మృతుడి భార్య ద్వారపూ డి లో మిఠాయి దుకాణంలో పనిచేస్తుండగా ఆదివారం సైకిల్‌పై వెళ్లి ఇంటికి తిరిగివచ్చి కుప్పకూలిపోయాడు.బంధువులు గమనించి ఆర్‌ఎంపీకి సమాచారం ఇవ్వగా వచ్చి పరిశీ లించి మృతిచెందినట్టు ధ్రువీకరించాడు. మృ తుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Updated Date - May 25 , 2026 | 12:41 AM