Share News

ఆనందమందు!

ABN , Publish Date - Jan 02 , 2026 | 12:45 AM

మందుబాబులు బుధవారం రాత్రి ఫుల్‌ అయిపోయారు.. 2025 వెళ్లిపోతుందనే బాధతో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ తెగతాగే శారు..

ఆనందమందు!

తెగతాగేసిన మందుబాబులు

డిసెంబరు 31న సందడే..సందడి

రూ.21.10 కోట్ల మందు ఉఫ్‌

గతేడాది కంటే రూ.6.23 కోట్లు అదనం

ఉమ్మడి జిల్లాలో ఫుల్‌గా వ్యాపారం

(కాకినాడ/ రాజమహేంద్రవరం, ఆంధ్రజ్యోతి)

మందుబాబులు బుధవారం రాత్రి ఫుల్‌ అయిపోయారు.. 2025 వెళ్లిపోతుందనే బాధతో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ తెగతాగే శారు.. ఆ తరువాత హ్యాపీ న్యూఇయర్‌ చెప్పుకున్నారు.. కాసేపు సందడి చేశారు.. 2026 ఆనందంగా గడవాలని మళ్లీ ఫుల్‌గా ఎత్తేశారు.. ఇలా డిసెంబరు 31వ తేదీ రాత్రిలో మద్యం ప్రియులు రూ.కోట్లు గుటుక్కు మనిపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఒక్కరోజులోనే రూ.21.10 కోట్ల విలువైన మద్యం ఊదేశారు.మందుబాబులు రెచ్చిపోయారు. డిసెంబర్‌ 31న రాత్రి తెగ తాగేశారు. న్యూఇయర్‌ పేరుతో సీసాలకు సీసాలు ఎత్తేశారు. దీంతో మద్యం విక్రయాలు భారీగా పెరిగి పోయాయి. ఒక్క రోజులో రూ.21.10 కోట్ల విలువైన మద్యం అమ్ము డైంది. 2024 డిసెంబరు 31వ తేదీతో పోల్చితే రూ.6.23 కోట్లు అదనంగా వ్యాపారం జరిగింది. ఉమ్మడి జిల్లాలో డిసెంబరు నెలంతా చలి తీవ్రత చాలా అధికంగా ఉంది. ఈ ప్రభావంతో మద్యం విక్రయాలు ఊహించినదానికంటే అధికంగా జరిగాయి.గత నెలంతా రూ.326.78 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.అదే 2024 డిసెంబరులో విక్రయాలు రూ.295.51 కోట్లే. అప్పటికి ఇప్పటికీ తేడా రూ.31.27 కోట్లు అధనం.

సందడే..సందడి

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా న్యూ ఇయ ర్‌ వేడుకలు బుధవారం అర్ధరాత్రి భారీగా జరిగాయి. ఎక్కడికక్కడ ప్రజలు రోడ్లపైకి వచ్చి నూతన వేడు కలను భారీగా నిర్వహించారు. కేక్‌ లు కోసి .. బిరియానీలు తిని సందడి చేశారు. అటు మందుబాబులైతే తెగ రెచ్చిపోయారు. 2025కు వీడ్కోలు పలుకుతూ, 2026కు స్వాగతం పలు కుతూ కేరింతలు కొట్టారు. న్యూ ఇయర్‌ వేడు కలను ఈసారి అంచనాలకు మించి అన్ని వర్గాలు భారీగా నిర్వహించాయి.కాకినాడ, రాజ మహేంద్రవరంలో అనేక హోట ళ్లు ఈవెంట్లు నిర్వహించాయి.దీంతో న్యూఇయర్‌ అమ్మకాలు కనివినీ ఎరుగని రేంజ్‌లో పెరిగిపోయాయి.

ఒక్కరోజే..ఫుల్‌గా..

ఉమ్మడి జిల్లాలో డిసెంబరు 31న రూ.21.10 కోట్ల మద్యం అమ్ముడైంది.2024 డిసెంబరు 31న రూ.14.87 కోట్లు విక్రయాలు జరిగాయి.తేడా రూ.6.23 కోట్లు.

ఫ తూర్పుగోదావరి జిల్లాలో రూ.8.25 కోట్లు మద్యం విక్ర యాలు జరిగాయి. 2024 డిసెంబరు 31న రూ.5 కోట్ల విక్ర యాలు జరగ్గా.. రూ.3.25 కోట్ల వ్యాపారం అదనంగా జరిగింది. డిసెంబరు నెలంతా కలిపి రూ.118.34 కోట్లు జరిగాయి.

ఫ కాకినాడ జిల్లాలో డిసెంబరు 31కి రూ.6.70 కోట్లు విక్రయాలు జరిగాయి. 2024 డిసెంబరు 31న విక్రయాలు రూ.5.40 కోట్లతో పోల్చితే రూ.1.30 కోట్లు అధనం. డిసెంబరులో రూ.113.07 కోట్ల మద్యం అమ్ముడైంది.

ఫ కోనసీమ జిల్లాలో ఈ డిసెంబరు 31న రూ.6.43 కోట్లు మద్యం విక్రయాలు జరగ్గా 2024 డిసెంబరు 31న రూ.4.37 కోట్లు మద్యం అమ్ముడైంది. రూ.2.06 కోట్లు అధనంగా జరిగాయి. డిసెంబరు నెల మొత్తం రూ.95.37 కోట్ల విలువైన మద్యం విక్రయాలు సాగాయి

కలిసొచ్చిన చలి..

ఈ ఏడాది డిసెంబరులో చలి తీవ్రత ఉమ్మడి జిల్లాలో చాలా అధికంగా ఉంది. ఉష్ణోగ్రతలు గతే డాదితో పోల్చితే పడిపోయాయి. ఈప్రభా వం మద్యం విక్రయాలకు బాగా కలిసొచ్చింది. చలితీవ్రతతో మందుబాబులు తెగ తాగేశారు. దీంతో విక్రయాలు అంచనాలకు మించి జరి గాయి. అధికారులు ఊహించిన దానికంటే అమ్మకాలు పెరిగిపోయాయి. ఉమ్మడి జిల్లావ్యా ప్తంగా డిసెంబరు నెలలో రూ.326.78 కోట్ల మద్యం అమ్ముడైంది. రికార్డుస్థాయి అమ్మకా లుగా అధికారులు విశ్లేషించారు. అంటే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2024 డిసెంబరుతో పోల్చితే 2025 డిసెంబరు నెలలో అదనంగా జరిగిన మద్యం విక్రయాలు రూ.31.27కోట్లు అధికంగా జరిగాయి. మరోపక్క సంక్రాంతి పండగకు దాదాపు వారం పాటు మద్యం విక్రయాలు ఉండనున్నందున అప్పుడే సన్నద్ధమవుతున్నారు.

Updated Date - Jan 02 , 2026 | 12:45 AM