Share News

ఘాట్‌ రోడ్డు.. గుండెల్లో గుబులు!

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:58 AM

చింతూరు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): చిం తూరు - మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డు ప్రయాణి కుల గుండెల్లో గుబులు పెడుతుంది. ఈ రోడ్డులో మంగళవారం కొబ్బరి కాయల లోడు లారీ బోల్తా కొట్టింది. లారీ ముందు అద్దాలు పగిలిపోగా వాటి నుంచి లారీ డ్రైవరు, క్లీనరు బయటపడ్డారు. అదే సమయంలో మారేడుమిల్లి వైపు

ఘాట్‌ రోడ్డు.. గుండెల్లో గుబులు!
ఘాట్‌ రోడ్డులో బోల్తా కొట్టిన కొబ్బరికాయల లోడు లారీ

లారీ బోల్తా.. వెనువెంటనే లోయలో పడిన మరో లారీ

ఈ ప్రదేశంలోనే ఇటీవల బస్సు ప్రమాదాలు

ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు

చింతూరు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): చిం తూరు - మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డు ప్రయాణి కుల గుండెల్లో గుబులు పెడుతుంది. ఈ రోడ్డులో మంగళవారం కొబ్బరి కాయల లోడు లారీ బోల్తా కొట్టింది. లారీ ముందు అద్దాలు పగిలిపోగా వాటి నుంచి లారీ డ్రైవరు, క్లీనరు బయటపడ్డారు. అదే సమయంలో మారేడుమిల్లి వైపు నుంచి మొక్కల లోడు లారీ చింతూరు వైపు వస్తోంది. గమనించిన లారీ డ్రైవరు, క్లీనరు మొక్కల లోడు లారీని ఆపి తాగునీరు కావాలని అడిగారు. దీంతో మొక్కల లోడు లారీ డ్రైవరు ఆర్యన్‌, క్లీనరు సంజూ లారీని ఆపి బాధితులకు తాగునీరు అందించారు. కాగా ఆ ప్రదేశం పూర్తి గా కిందకు ఉండడతో మొక్కల లోడు లారీ ముందుకు కదిలి సమీపంలో ఉన్న వంద అడుగుల లోతు ఉన్న లోయలో పడిపో యిం ది. ప్రమాదానికి గురైన 2 లారీ లు ఛత్తీస్‌గడ్‌లోని జగదల్‌ పూర్‌కు చెందినవి. కాగా లారీ డ్రైవర్లు, క్లీనర్లు సురక్షితంగా ఉన్నారు. గతేడాది డిసెంబరు 12న ఇదే ప్రదేశంలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా కొట్టి తొమ్మిదిమంది మృతిచెందారు. అలాగే గతేడాది డిసెంబరు 27న ఇదే ప్రదేశంలో గోకవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కల్వర్టుపైకి వెళ్లి తృటిలో పెద్ద ప్రమాదం నుంచి బయట పడిన విషయం విధితమే. మళ్లీ ఇదే ప్రదేశంలో రెండు లారీలు ప్రమాదానికి గురవ్వడంతో ప్రయా ణి కులు,స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

Updated Date - Jan 28 , 2026 | 12:58 AM