టెన్‌షన్ టర్న్స్..!
ABN , Publish Date - Jan 30 , 2026 | 01:15 AM
చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డు తరచూ ప్రమాదాలతో రక్తమోడుతోంది. గడచిన పదేళ్లలో 25 ప్రమాదాలు జరిగితే 22 మంది ప్రాణాలు కోల్పోగా 65మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తంగా 30 కి.మీ మేర ఉన్న ఈ ఘాట్‌లో ప్రమాదభరితంగా 10 మలుపులు ఉన్నాయి. వాటిలో దుర్గమ్మ గుడి, చైనావాల్, సోకిలేరు
చింతూరు - మారేడుమిల్లి ఘాట్
రోడ్డులో తరచూ ప్రమాదాలు
ప్రమాదకరంగా పది మలుపులు
గడచిన పదేళ్లలో ఎన్నో సంఘటనలు
భయపడిపోతున్న వాహనదారులు
రహదారిని వెడల్పు చేయాలని కోరుతున్నా పట్టించుకోని అధికారులు
( చింతూరు - ఆంధ్రజ్యోతి )
చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డు తరచూ ప్రమాదాలతో రక్తమోడుతోంది. గడచిన పదేళ్లలో 25 ప్రమాదాలు జరిగితే 22 మంది ప్రాణాలు కోల్పోగా 65మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తంగా 30 కి.మీ మేర ఉన్న ఈ ఘాట్‌లో ప్రమాదభరితంగా 10 మలుపులు ఉన్నాయి. వాటిలో దుర్గమ్మ గుడి, చైనావాల్, సోకిలేరు వ్యూ పాయింటు పరిసర ప్రాంతాల మలుపులు మరింత ప్రమాదకరం. రాజు గారి టర్నింగ్, సిలువ టర్నింగ్, వాలి సుగ్రీవుల టర్నింగ్, గొట్టాల టర్నింగ్ ఇజ్జులూరు వాగు టర్నింగ్‌లు కూడా ఈ కోవలోకే వస్తాయి. ఇటీవల దుర్గమ్మ గుడి సమీపంలో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాదంలో 9మంది ప్రాణాలు కోల్పోగా 25 మ ంది గాయపడిన విషయం విధితమే. ఇక ఇటీవల దాదాపు ఇదే ప్రాంతంలో పెను ప్రమాదం నుంచి ఆర్టీసీ బస్సు బయటపడిన సంఘటన తెలిసిందే. గడచిన పదేళ్లలో జరిగిన ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుంటే వాటిలో దుర్గమ్మ గుడి వద్ద జరిగిన ప్రమాదాల్లో 11 మంది, చైనా వాల్ వద్ద జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు, వ్యూ పాయి ంటు వద్ద జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. ఇంత జరుగుతున్నా ఆయా ప్రమాద మలుపుల వద్ద రోడ్టు భవనాల శాఖ ప్రమాదాలను నిలువరించేందుకు తీసుకుంటున్న చర్యలు అరకొర మాత్రమే. మలుపుల వద్ద ఓ వైపు ఉన్న గుట్టను డ్రిల్లింగ్ చేసి రహదారిని వెడల్పు చేయాలని, అదే దశలో లోయ వైపు సిమెంట్‌తో కాంక్రీట్ వేసి ఇనుప కంచె ఏర్పాటు చేయాలని వాహనదారులు కొన్నేళ్లుగా మొరపెట్టుకుంటున్నారు. కాగా శాశ్వత పరిష్కారం మరిచి లోయవైపు మట్టి పోసి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. దీంతో వర్షాకాలం వరద తాకిడికి మట్టి కొట్టుకపోవడం, లేదా భారీ వాహనచక్రాలు దిగి పోయి గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌కు కారణ మవుతున్నట్టు చెప్తున్నారు. వీటికి తోడు నియంత్రణ లేకపోవడంతో భారీ వాహనాలు కేవలం ఏడు మీటర్ల వెడల్పు ఉన్న ఘాట్ మీదుగా రాకపోకలు సాగించడం మరో పెద్ద సమస్యగా మారింది.
ప్రమాదం జరిగితే అంతే...
30 కిలోమీటర్ల మేర ఉన్న ఘాట్‌లో సమాచార వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంతో ఆ పరిధిలో ప్రమాదం జరిగితే ఆ సమాచారం ఇటు చింతూరు అటు మారేడుమిల్లికి చేరడంలో ఆల స్యమవుతోంది. దీంతో సకాలంలో చికిత్స అందిస్తే నిలబడే ప్రాణాలు సకాలంలో ఆసుపత్రులకు చే ర్చకపోలేకపోవడంతో దారిలోనే పోయిన ఘట నలు కూడా ఉన్నాయి. పోలవరం జిల్లా ఏర్పా టుకుతో రానున్న కాలంలో ఈ ఘాట్ మీదుగా రాకపోకలు మరింతగా పెరగనున్నాయి. మరో వైపు మోతుగూడెం, మారేడుమిల్లికి వీకండ్స్‌లో వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకుల రద్దీ రోజు రో జుకు పెరుగుతోంది. ఈ పరిణామాలను దృష్టి లోకి తీసుకొని రహదారులు, భవనాల శాఖ ఘా ట్ రోడ్డును మెరుగు పర్చాల్సిన ఆవశ్యకత ఎం తైనా ఉంది. తాజాగా జరిగిన బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి అనిత చింతూరు ఏరియా ఆసుపత్రి పరిధిలో విదులు నిర్విర్తించేందుకు రెస్క్యూ బృందాన్ని నియమి స్తామన్నారు. ఇది అమలులోకి రావాల్సి ఉంది.