ఏజెన్సీ టు బెంగళూరు..
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:28 AM
తొండంగి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా- ఒడిస్సా బోర్డర్ నుంచి బెంగళూరుకు తరలిస్తున్న గంజాయిని కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి వై.జంక్షన్ వద్ద తొండంగి పోలీసులు మంగళవారం దాడి జరిపి పట్టుకున్నారు. దీనికి కారణమైన కేరళకు చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు
గంజాయి రవాణా
కాకినాడ జిల్లా బెండపూడి వద్ద
రూ. 52 లక్షల విలువైన సరుకు స్వాధీనం
కేరళకు చెందిన ఇద్దరి అరెస్ట్
తొండంగి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా- ఒడిస్సా బోర్డర్ నుంచి బెంగళూరుకు తరలిస్తున్న గంజాయిని కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి వై.జంక్షన్ వద్ద తొండంగి పోలీసులు మంగళవారం దాడి జరిపి పట్టుకున్నారు. దీనికి కారణమైన కేరళకు చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు... తొండంగి ఎస్‌ఐ జగన్మోహన్ సిబ్బందితో వై.జంక్షన్ వద్ద మాటు వేసి ఉండగా కేరళ రాష్ట్రానికి చెందిన పుదియపురల్ సామద్ (47) లారీలో, అదే రాష్ట్రానికి చెందిన సలీం కెపి (46) ఎర్రరంగు కారులో గంజాయిని ఒడిస్సా- విశాఖ ఏజెన్సీ నుంచి బెంగళూరు రవాణా చేస్తున్నారు. ఎస్‌ఐ వాహనాలను ఆపి తనిఖీ చేయగా రూ.52 లక్షల విలువైన 104 కిలోల గంజాయిని ప్యాకెట్లుగా పార్శిల్ చేసి తరలించడాన్ని గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని సామద్, సలీం కేపిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. గంజాయితోపాటు లారీ, ఎర్రరంగు సుజుకి వేగనార్ కారును స్వాధీనం చేసుకున్నారు. తుని రూరల్ సీఐ చెన్న కేశవరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆయన వెంట సిబ్బంది పాండురంగా, శ్రీను తదితరులున్నారు.