ఎడ్యుకేషన్ ఫ్రీ
ABN , Publish Date - Mar 09 , 2026 | 01:10 AM
వచ్చే విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ దరఖాస్తులు స్వీకరిస్తోంది.విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1) సీ ప్రకారం పేద వర్గాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు కేటాయించాలి.ఈ మేర కు అర్హుల నుంచి మంగళవారం వరకూ దరఖాస్తులు స్వీకరించి లాటరీ తీస్తారు.
ప్రైవేటు పాఠశాలల్లో అవకాశం - రేపటితో ముగియనున్న గడువు
8 25 శాతం సీట్లు కేటాయింపు
8 ఒకటో తరగతిలో ప్రవేశం
(కాకినాడ - ఆంధ్రజ్యోతి)
వచ్చే విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ దరఖాస్తులు స్వీకరిస్తోంది.విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1) సీ ప్రకారం పేద వర్గాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు కేటాయించాలి.ఈ మేర కు అర్హుల నుంచి మంగళవారం వరకూ దరఖాస్తులు స్వీకరించి లాటరీ తీస్తారు.
ఏం చేయాలంటే..
ఒకటో తరగతి సీబీఎస్‌ఈ సిలబస్‌లో ప్రవేశాలు కోరే బాలబాలికలు 2020 ఏప్రిల్ రెండు నుంచి 2021 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి. రాష్ట్ర సిలబస్‌లో చేరదలచుకున్న వారు 2020 జూన్ 2 నుంచి 2021 మే 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. పిల్లలకు దరఖాస్తు చేసే తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1.44 లక్షల్లోపు ఉండాలి. రేషన్ కార్డుతో పాటు ఆధార్‌కార్డులో ఉన్న ఇంటి అడ్రస్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఇంటికి కిలో మీటరు నుంచి ఐదు కిలో మీటర్ల పరిధిలో గల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి. సీటు కేటాయించే సమయంలో తండ్రి కులం ప్రామాణికంగా తీసుకుంటారు. అనం తరం ప్రత్యేకంగా తయారు చేసిన సాఫ్ట్‌వేర్ ద్వారా తొలివిడత లాటరీ తీస్తారు. దీని ప్రకారం సీట్లు పొందిన బాలబాలికలు మార్చి 26 నుంచి ఏప్రిల్ ఏడో తేదీ లోపు ఆయా పాఠశాలల్లో ప్రవేశాలను ధ్రువీకరించాలి. ఆ తర్వాత మిగిలిన సీట్లకు ఏప్రిల్ 12న రెండో విడత లాటరీ తీస్తారు. వీరు ఏప్రిల్ 13 నుంచి 23వ తేదీలోపు ప్రవేశాలు పొందాలి.
ఈ ఏడాది ఏం చేస్తారో..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలలు(మైనారిటీ స్కూళ్లు తప్ప) కూడా ఈ ఉచిత సీట్లను విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పేద విద్యార్థులకు కేటాయించాలి.ఈ నేపథ్యంలో సుమారు నాలుగు వేల మంది వరకు విద్యార్థులు ఉచితంగా విద్యనభ్యసించే అవకాశం ఉంది. గతేడాది కాకినాడ జిల్లాలో 1812, తూర్పుగోదావరి జిల్లాలో 1418 సీట్లు, కోనసీమ జిల్లాలో 815 సీట్లు కలిపి మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కలిపి మొత్తంగా 4045 సీట్లు కేటాయించారు. తల్లిదండ్రుల వేడుకోలు, అధికారుల బుజ్జగింపుల అనంత రం తూర్పుగోదావరి జిల్లాలో 1380 మందికి, కాకినాడ జిల్లాలో 754 మంది, కోనసీమ జిల్లాలో 643 సీట్లు మాత్రమే భర్తీ అయ్యా యి. విద్యా హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లల్లో ఈ చట్టం కచ్చితంగా అమలు చేయాల్సి ఉండగా, కొంత మంది ఆ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. స్కూళ్లు తెరిచినా గతేడాది సీట్ల కేటాయింపు జరగలేదు. లాటరీ పద్ధతిలో ఎంపిక చేసినా ఎంపికైన విద్యార్థులకు చాలా స్కూళ్లల్లో అడ్మిషన్లు ఇవ్వలేదు. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా కనికరించలేదు. ఈ ఏడాది అలాంటి ఇబ్బందులు జరగకుండా అధికార యంత్రాం చూడాల్సి ఉంది.