అయ్యో.. రొయ్య!
ABN , Publish Date - May 24 , 2026 | 12:15 AM
మలికిపురం/అల్లవరం,మే23(ఆంధ్రజ్యోతి): ఆక్వా సాగు పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది. కొద్దిరోజులుగా దారుణంగా పడిపోతున్న ఆక్వా ధరలను చూసి ఆక్వా రైతాంగం గుండె చెరువవుతోంది. ఇప్పటికే రొయ్యల తెగుళ్ల మందులు, మేత ధరలు పెంచి విక్రయాలు సాగిస్తుండడంతోపాటు విద్యుత్ సరఫరా ఇబ్బందులు కూడా రైతాంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వీటికితోడు వాతావరణ మార్పులు మరింత ఆందోళన కు గురిచేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు
ఆక్వాలో సంక్షోభం
తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు
అటు మేత ధరల వాత
ఇటు కరెంటు సమస్యతో తంటా
ఇప్పుడు పడిపోయిన రొయ్యల ధర
రూ.220-230 మధ్యే రేటు
ఘొల్లుమంటున్న రైతులు
అధిక ఉష్ణోగ్రతలూ మరో శాపం
చనిపోతున్న రొయ్యలు
కంపెనీలు కొనడం లేదన్న ట్రేడర్లు
మలికిపురం/అల్లవరం,మే23(ఆంధ్రజ్యోతి): ఆక్వా సాగు పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది. కొద్దిరోజులుగా దారుణంగా పడిపోతున్న ఆక్వా ధరలను చూసి ఆక్వా రైతాంగం గుండె చెరువవుతోంది. ఇప్పటికే రొయ్యల తెగుళ్ల మందులు, మేత ధరలు పెంచి విక్రయాలు సాగిస్తుండడంతోపాటు విద్యుత్ సరఫరా ఇబ్బందులు కూడా రైతాంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వీటికితోడు వాతావరణ మార్పులు మరింత ఆందోళన కు గురిచేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, ఆకస్మిక ఈదురుగాలులు రెండూ పంట నష్టానికి దారితీస్తాయి. ఇలాంటి అననుకూల పరిస్థితుల్లో అష్టకష్టాలు పడి గట్టుకు చేర్చిన రొయ్యలకు రేటు పడిపోవడంతో వారిని కన్నీంటి పర్యంతం చేస్తోం ది. ఆక్వా అంటేనే లాటరీ. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రతి క్షణం పంటను కాపాడుకుంటూ వచ్చాక సరైన ధర లభిస్తేనే ఆ కష్టమం తా మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. గత వారం రోజులుగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ఆక్వా చెరువుల్లో రొయ్యలకు తగిన ఆక్సిజన్ అందక చాలాచోట్ల చెరువుల్లో రొయ్యలు చనిపోతున్నాయి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి రైతులు చెరువు గట్లమీదే రోజులు గడుపుతున్నారు. ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వేసవిలో నాణ్యమైన పంట.. దానికి మంచి లాభాలు దక్కుతాయన్న ఆశతో ఉన్న రైతులకు అనుకోని విధంగా మేత రేటు కొంత దెబ్బతీసింది. ఇప్పుడు దిగుబడి చేతి కి వచ్చేసరికి రొయ్య రేటు పడిపోవడం వారిని అయోమయంలో పడేసింది. గతంలో వంద కౌం ట్ వనామి రొయ్యల ధర రూ.260 నుంచి 270 పలికేది. భారీగా లాభాలు లేకపోయినా ఉన్నం తలో ఊరట చెందేవారు. ప్రస్తుతం వంద కౌంట్ ధర రూ.220 నుంచి 230 మధ్య ట్రేడర్స్ రేటు చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అంటే టన్నుకు రూ.30 వేల నుంచి 40 వేల వరకు ధరలు తగ్గించినట్టు అయింది. ఈ పరిస్థితుల్లో వేచి చూద్దామంటే, అధిక ఉష్ణోగ్రత ధాటికి ఉన్న రొయ్యలు చనిపోయే పరిస్థితి ఉం ది. ఇప్పటికే చాలాచోట్ల చెరువుల్లో రన్నింగ్ మొ రాలిటీ వ్యాధితో చెరువుల్లో రొయ్యలు పైకి తేలుతున్నాయి. ఇది రొయ్య రైతుకు పెద్ద తలపోటుగా మారింది. ఈ నేపథ్యంలో రొయ్యలను పట్టుబడి పడదామని వ్యాపారస్తులను అడిగితే కంపెనీల నుంచి ఆర్డర్స్ లేవని సమాధానం ఇస్తున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టి పట్టుబడికి వచ్చేసరికి రైతు పని ఘోరంగా మారింది. చాలా పెద్ద కంపెనీలు ఆర్డర్స్ ఇవ్వడంలేదని చెబుతున్నాయని, వారు కొనకుండా తాము ఏం చేయలేమని వ్యాపారస్తులు అంటున్నారు. వేసవి తీవ్రంగా ఉండడం ప్రాసెసింగ్ యూనిట్లో పనివారు రాకపోవడం, విద్యుత్ అంతరాయం, ఐస్ కొరత వంటి సమస్యలతో కంపెనీలు కొనుగోలును తగ్గించినట్టు తెలుస్తోంది. ప్రభు త్వం ఆక్వా రైతుల కోసం శీతలీకరణ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు. వేలాది కోట్ల విదేశీమారక ద్రవ్యాన్ని తెచ్చిపెడుతున్న ఆక్వా రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రతీ జిల్లా కేంద్రాల్లో శీతలీకరణ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని.. రేటున్నప్పుడు రైతు అమ్ముకునేలా అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
ఉష్ణోగ్రతలూ శాపమే..
ఉదయం 8 దాటితే ఎవరూ బయట సంచరించవద్దని ప్రభుత్వం పదేపదే హెచ్చరికలు చేస్తోంది. ప్రస్తుతం 40 డిగ్రీల నుంచి 46 డిగ్రీ ల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనం కూడా కాలు బయట పెట్టడానికి సంకోచిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో చెరువుల్లోని రొయ్యల పరిస్థితి మరీ ఘోరం. అధిక ఉష్ణోగ్రత ధాటికి కొన్నిచోట్ల రొయ్యలు చనిపోతున్నాయి. వాస్తవానికి రొయ్యలు చనిపోతే అడుగు భాగానికి చేరిపోతాయి. దానివల్ల రైతు వెంటనే గుర్తించడమూ కష్టమే. ఈ సమయంలో విద్యుత్ సరఫరా నిరాటంకంగా జరిగితే ఏరియేటర్లు తిరగడం ద్వారా ఆక్సిజన్ సమస్య నుంచి కొంత బయటపడొచ్చు. ఇప్పు డున్న ఎండల తీవ్రతకు ఎంత చేసినా ఫలితం కొంతవరకేనని రైతులు చెబుతున్నారు.