Share News

కల్తీ నెయ్యి మహాపాపమే వైసీపీని పాతాళానికి నెట్టింది

ABN , Publish Date - Jan 30 , 2026 | 01:35 AM

కల్తీ నెయ్యి మహాపాపమే వైసీపీని పాతాళానికి నెట్టిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి వైసీపీ హయాంలో చేసిన కుంభకోణంపై సిట్‌ నివేదికతో వాస్తవం బయటకు వచ్చిన నేపథ్యంలో గురువారం ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో కలిసి స్థానిక ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు.

కల్తీ నెయ్యి మహాపాపమే వైసీపీని పాతాళానికి నెట్టింది
గోదావరి నీళ్లతో ఆలయ శుద్ధి చేస్తున్న ఎమ్మెల్యే వాసు

  • సత్యదేవుని ఆలయశుద్ధిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 29(ఆం ధ్రజ్యోతి): కల్తీ నెయ్యి మహాపాపమే వైసీపీని పాతాళానికి నెట్టిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి వైసీపీ హయాంలో చేసిన కుంభకోణంపై సిట్‌ నివేదికతో వాస్తవం బయటకు వచ్చిన నేపథ్యంలో గురువారం ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో కలిసి స్థానిక ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. లింగంపేట నుంచి ర్యా లీగా దేవస్థానానికి చేరుకుని గోదావరి నీళ్లతో శుద్ధిచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిముఖ్యమైన పుణ్యక్షేత్రం వేంకటేశ్వరస్వామి దేవస్ధానంలో లడ్డూకు చాలా ప్రాముఖ్యత ఉందని, దానిలో కల్తీ నెయ్యి కలిపి అపచారం చేశారు కాబట్టే వైసీపీ పాతాళానికి నెట్టి వేయబడిందన్నారు.తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే లడ్డూ కల్తీపై వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశామని, అప్పటి అనుమానాలకు సిట్‌ పూర్తి స్పష్టత ఇచ్చిందన్నారు. తాము ఏ తప్పు చేయ్యలేదని ప్రగల్బాలు పలికిన వైసీపీ మూఠా ఇప్పుడేమాంటారని ప్రశ్నించారు. తప్పుచేయలేదని చెప్పేవారు ఎందుకు ముందస్తు బెయిల్‌ కోసం కోర్టుల చుట్టు తిరుగుతున్నారని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి గురించి ఎవ్వరు మాట్లాడకూడదని ఎందుకు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని ప్రశ్నించారు. నిబంధనలు ఇష్టానుసారం మార్చేసి అనుభవం లేని కంపెనీలకు టెండర్లు కట్టబెట్టి రూ.235 కోట్లు స్వామి వారి నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. వైసీపీ నేతలు తమ జేబులు నింపుకున్నారని వాసు అన్నారు. కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ కుడుపూడి సత్తిబాబు, జనసేన నగర ఇన్‌చార్జి అనుశ్రీ సత్యనారాయణ, కాశి నవీన్‌కుమార్‌, వై.శ్రీనివాస్‌, మళ్ల వెంకట్రాజు, వర్రే శ్రీనివాసరావు. డాక్టర్‌ యాళ్ల ప్రదీప్‌సుకుమార్‌, మజ్జి రాంబాబు, కోసూరి చండీప్రియ, మాలే విజయలక్ష్మి, తురకల నిర్మల, ద్వారా పార్వతి సుందరి, గొర్రెల సత్యరమణి, పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 01:35 AM