ఆహారం... కల్తీ!
ABN , Publish Date - Mar 16 , 2026 | 01:14 AM
పాలు తాగి రాజమహేంద్రవరంలో ఇప్పటి వరకూ15 మంది చనిపోయారు.. కారణం.. కల్తీ..! పాలు తాగి చనిపోతామని ఎవరైనా ఊహిస్తారా! అసలు ఊహించరు.. ప్రస్తుతం ఆహారం పరిస్థితి అలాగే ఉంది..జనం హోటళ్లు.. బిర్యానీ సెంటర్లు, కర్రీ పాయింట్ల వద్ద క్యూలు కడుతున్నారు.. ఆహా అంటూ లొట్టలేసుకుంటూ తినేస్తున్నారు.. తిన్న తరువాత ఏమవుతుందో కూడా ఆలోచించడంలేదు..! సడన్ హార్ట్ స్ట్రోక్‌లు.. కేన్సర్లు.. బీపీ.. సుగర్.. రకరకాల వ్యాధులు ఎందుకు వస్తున్నాయో చూసుకోవడం లేదు.. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ తినేస్తున్నారు.. గత నెలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు రాజమహేంద్రవరంలో 20 చోట్ల దాడులు చేస్తే.. అక్కడ విక్రయించే ఆహారం చూసి ఇదా తింటున్నారు అంటూ నివ్వెరపోయారు.. అంత దారుణంగా ఉంది పరిస్థితి.
ఆహా ఏమిరుచి..తినరా రోగం మైమరచి!
బయటి తిండికి అలవాటుపడ్డ జనం
రుచిగా ఉందని..అతిగా తినేస్తున్నారు
టేస్టింగ్ సాల్ట్, సింథటిక్ కలర్లు విషాలే
జనాలకు పెరుగుతున్న రుగ్మతలు
కానరాని ఫుడ్ సేఫ్టీ తనిఖీలు
పాలు తాగి రాజమహేంద్రవరంలో ఇప్పటి వరకూ15 మంది చనిపోయారు.. కారణం.. కల్తీ..! పాలు తాగి చనిపోతామని ఎవరైనా ఊహిస్తారా! అసలు ఊహించరు.. ప్రస్తుతం ఆహారం పరిస్థితి అలాగే ఉంది..జనం హోటళ్లు.. బిర్యానీ సెంటర్లు, కర్రీ పాయింట్ల వద్ద క్యూలు కడుతున్నారు.. ఆహా అంటూ లొట్టలేసుకుంటూ తినేస్తున్నారు.. తిన్న తరువాత ఏమవుతుందో కూడా ఆలోచించడంలేదు..! సడన్ హార్ట్ స్ట్రోక్‌లు.. కేన్సర్లు.. బీపీ.. సుగర్.. రకరకాల వ్యాధులు ఎందుకు వస్తున్నాయో చూసుకోవడం లేదు.. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ తినేస్తున్నారు.. గత నెలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు రాజమహేంద్రవరంలో 20 చోట్ల దాడులు చేస్తే.. అక్కడ విక్రయించే ఆహారం చూసి ఇదా తింటున్నారు అంటూ నివ్వెరపోయారు.. అంత దారుణంగా ఉంది పరిస్థితి.
(రాజమహేంద్రవం-ఆంధ్రజ్యోతి)
జిహ్వ చాపల్యం ఇంటి వంటగది దాటిన నాటి నుంచే ఆరోగ్యం హాహాకారాలు పెడుతోంది.వ్యా ధులు చుట్టు ముడుతున్నాయి..అప్పుడప్పుడు హడావుడి చేసే అధికా రుల తీరు బాగా అవకాశంగా తీసు కున్న వ్యాపా రులు..కుళ్లిన మాంసంలో పాడైన మసాలాను దట్టించి.. కాస్త కృత్రిమ రంగులు.. మరికాస్త ఎసెన్స్ కలిపి అమ్మే స్తున్నారు. దీంతో ఆహా ఏమి రుచి.. తినరా ఆరో గ్యం మైమరచి! అన్న చందంగా పరిస్థితి తయారైంది. ఇలా తినడం అలవాటైన తర్వాత.. క్యాన్సర్ వంటి వ్యాధులు ఊరికినే వస్తాయా! అని వైద్యులు అంటు న్నారు. ఇటీవల రాజమహేంద్రవరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అకస్మాత్తుగా ఒక 20 హోటళ్లపై దాడులు చేస్తే ఏకంగా 180 కిలోల కుళ్లిన మాంసం తదితర ఆహార పదార్థాలు కంటబడ్డాయి.ఇదీ ఆహార కల్తీకి తాజా నిదర్శనం.
కానరాని.. ఫుడ్ సేఫ్టీ
ఉమ్మడి తూర్పు గోదావరిలో వేల సంఖ్యలో రెస్టారెంట్లు, హోటళ్లు, రోడ్డు పక్కన బళ్లు ఉన్నాయి. తనిఖీలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ శాఖలో ఉమ్మడి జిల్లాలో పట్టుమని పది మంది అధికారులు/సిబ్బంది లేరు. ఆహార పదార్థాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి పొంది ప్రస్తుతం వ్యాపారం సాగిస్తున్నవి తూర్పులో 129, కోనసీమ జిల్లా లో 54, కాకినాడ జిల్లాలో 146 ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు పొంది నడుస్తున్నవి తూర్పులో 2170, కాకినాడ జిల్లాలో 2488, కోనసీమ జిల్లాలో 1254 ఉన్నాయి. పోలీసుల, ఫుడ్‌సేఫ్టీ, విజిలెన్స్ వంటి విభా గాల సమన్వయం లేకపోవడం ప్రజల ప్రాణాలతో కల్తీ ఆహారం చెలగాటం ఆడుతోంది. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్‌కి తనిఖీల అధికారం ఉన్నా పట్టింపే లేనట్టు తెలుస్తోంది. ఫిర్యాదులకు అవసరమైతే ప్రజలు ఫుడ్ సేఫ్టీ శాఖను 08645 2410295 నెంబరులో సం ప్రదించవచ్చు.అయితే ఎప్పుడు తనిఖీలు చేస్తారనేది దేవుడికెరుక. కల్తీ పాల ఘటనలో 15 మంది మృతి చెం దినా అధికారులు ఇంకా మేల్కొనలేదు. నిరంతరం సాగే ఆహారకల్తీపై దాడులు చేయడంలేదు.
మరిగించిన నూనెతో ముప్పు
అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నారని వైద్యులు అంటు న్నారు. పదేపదే కాచిన నూనె నూనెతో పదార్థాలను తయారు చేయడం ముప్పును కొనితెస్తుంది. పదేపదే మరిగించడంతో టోటల్ పోలార్ కాంపౌండ్స్ 25 శా తం కంటే ఎక్కువై అజీర్తి, క్యాన్సర్, వాంతుల బారిన పడతారు.కొన్నిచోట్ల నూనె న్లలగా మారినా వాడేస్తు న్నారు. రుచి, ఆకర్షణీయంగా ఉండడం కోసం సిం థటిక్ కలర్స్, రసాయనాలను వాడతారు.
బాబోయ్.. బిర్యానీ
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వేలల్లో ఆహార విక్రయ దుకాణాలు ఉన్నాయి. వీటిలో బిర్యానీ సెంటర్లదే హవా. ఆ సెంటర్లలో ఏం వాడుతున్నారనేది అనవసరం. రూ.60 అంటే ఎగబడిపోతాం.. రూ. 50 అంటే పరుగులు పెట్టేస్తాం. అసలు రూ.50కి ఎలా తయారవుతుందనేది ఆలోచించం. రాజమ హేం ద్రవరంలోని పేపరు మిల్లు వద్ద మెయిన్ దుకాణం, నగరంలో పలుచోట్ల బ్రాంచీలు నడుపుతున్న ఓ ప్రముఖ బిర్యానీ సెంటర్‌లో ఆహార పదార్థాల పరిస్థితిని చూసి అధికారులే నివ్వెరపోయారు. ఫ్రై చేయడానికి ట్రేలలో ఉంచిన కోడి మాంసం కుళ్లిపోగా, అల్లం వెల్లుల్లి పేస్టు, పొడి పిండి, బిర్యానీలో ఇచ్చే గ్రేవీ బూజు పట్టేశాయి. రోజుల తరబడి ఐస్‌లో వీటిని నిల్వ చేశారని తేల్చారు. వంటచేసే పరిసరాలు అపరిశుభ్ర. ఇలాగే చాలా బిర్యానీ సెంటర్లలో పరిస్థితి ఉంది. కృత్రిమ రంగులు విపరీతంగా వాడుతున్నారు.బిర్యానీ, కూరల్లో వాడే మసాలా పొడులు, దినుసుల ప్యాకెట్లు కూడా కాలదోషం పట్టి ఉంటున్నాయి. నూనె, నెయ్యి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత ఆందోళన నెమ్మదిస్తుంది.
విషం ‘టేస్టింగ్ సాల్ట్’
బయటి ఆహారంలో తప్పనిసరిగా టేస్టింగ్ సాల్ట్‌ని వినియోగిస్తారు. ఈ రసాయనాన్ని మోనో సోడియం గ్లుటా మేట్ అంటారు.ఆన్‌లైన్‌లో చూస్తే ఇది ఎంత ప్రమాదకారో తెలుస్తుంది. దీనిని ద్రాక్ష తోటల ఎదుగుదల తదితర వాటికి వాడతారు. దీనివల్ల ఐదేళ్ల కంటే తక్కువ ఉన్నవాళ్లు పదేపదే తింటే పక్షవాతం వస్తుంది. మహిళల్లో గర్భస్రావం, గర్భం రాకపోవడం.. పురుషుల్లో మెదడు, జీర్ణ వ్యవస్థ సం బంధిత రుగ్మతలు వస్తాయి.
కల్తీకి..కక్కుర్తి!
మనం తినే ఆహార పదార్థాలూ కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్టుగా ఉంటున్నాయి. కారం, పసుపు, నూనెలు, నెయ్యి, పప్పుదినుసులు, మసాలాలు.. ఒకటేమిటి అన్నీ కల్తీనే. టీపొడిలో చింతగింజల పొడి, మిరియాల్లో బొప్పాయి గింజ లు, గసగసాల్లో రవ్వ, మైదాలో చింతపిండి, నూనెల్లో పశువుల కొవ్వులు, పామో లిన్‌లో బోన్ (జంతు ఎముకల) నూనె, మటన్ (ప్యాకేజ్ట్)లో లేగదూడ మాంసం, పాలలో యూరియా, తేనె లో పటిక బెల్లం, నెయ్యిలో బంగాళదుంప పేస్ట్, డాల్డా, పసుపురంగు, జంతు ఎముకల నూనె, కారంలో చెక్కపొట్టు ఇలా.. మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఏ వస్తువులకు, పదార్థాలకు ఉందో వాటిని యథేచ్చగా కల్తీ చేస్తున్నారు. డిమాండ్ లేని వాటిలో కూడా కల్తీ కక్కుర్తి కనబడుతోంది.