Share News

బాధ్యతలను గుర్తెరగాలి

ABN , Publish Date - Jan 27 , 2026 | 01:12 AM

విధులను, బాధ్యతలను గుర్తెరిగి ఉత్తమపౌరులుగా యువతరం ముందుకు సాగాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ సూచించారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

బాధ్యతలను గుర్తెరగాలి
ధవళేశ్వరంలో జెండాను ఆవిష్కరిస్తున్న పీఏ అభిషేక్‌

  • నన్నయ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ

  • ఘనంగా గణతంత్ర వేడుకలు

  • పలుచోట్ల జాతీయ జెండావిష్కరణ

దివాన్‌చెరువు, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): విధులను, బాధ్యతలను గుర్తెరిగి ఉత్తమపౌరులుగా యువతరం ముందుకు సాగాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ సూచించారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. రా జ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌, మహాత్మాగాంధీ తదితర జాతీయ నాయకులకు నివాళులర్పించారు. నన్నయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి వీసీ ముఖ్యఅతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించి, విద్యార్థుల గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ అందరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు.విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య కేవీ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 01:12 AM