వైభవోపేతంగా.. భీమేశ్వరుని దివ్యకల్యాణం
ABN , Publish Date - Jan 29 , 2026 | 01:49 AM
ద్రాక్షారామ భీమేశ్వరస్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. మాఘశుద్ధ ఏకాదశి రోహిణి నక్షత్ర యుక్త సింహ లగ్నమందు పుష్పాలంకృతమైన కల్యాణ వేదికపై మంగళవాయిద్యాలు, వేదమంత్రాలతో జరిగిన భీమేశ్వరస్వామి, మాణిక్యాంబ అమ్మవారి పరిణయం భక్తులు తన్మయత్వంతో తిలకించారు.
తన్మయత్వంతో తిలకించిన భక్తులు
స్వామి, అమ్మవార్లకు నంది వాహనంపై నగరోత్సవం
మంగళస్నానం చేయించిన అర్చకస్వాములు
ద్రాక్షారామ, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ద్రాక్షారామ భీమేశ్వరస్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. మాఘశుద్ధ ఏకాదశి రోహిణి నక్షత్ర యుక్త సింహ లగ్నమందు పుష్పాలంకృతమైన కల్యాణ వేదికపై మంగళవాయిద్యాలు, వేదమంత్రాలతో జరిగిన భీమేశ్వరస్వామి, మాణిక్యాంబ అమ్మవారి పరిణయం భక్తులు తన్మయత్వంతో తిలకించారు. మూలవిరాట్టు భీమేశ్వరస్వామి, మాణిక్యాంబ అమ్మవారక్లు, క్షేత్ర పాలకులకులు శ్రీలక్ష్మీసమేత నారాయణస్వామి, శ్రీ చండికా సమేత సూరేశ్వరస్వామికి ఏకకాలం లో జరిగిన కల్యాణ మహోత్సవాన్ని భక్తులు అమితాసక్తితో తిలకించారు. కల్యాణమూర్తులు మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి, క్షేత్ర పాలకులు లక్ష్మీసమేత నారాయణస్వామి, చండికా సమేత సూరేశ్వరస్వామివార్లకు నంది వాహనంపై నగరోత్సవం మేళతాళాలు, బాజా భజంత్రీలతో జరిగింది. అనంతరం కల్యాణ మూర్తులను అర్చకస్వాములు వేదమంత్ర పఠనంతో, మంగళవాయిద్యాలతో కల్యాణ వేదికపైకి తోడ్కొని వచ్చారు.
కల్యాణం.. కడు రమణీయం..
ఆలయ బ్రహ్మ దేవులపల్లి ఫణి రామకృష్ణ, వైదికబృందం కల్యాణవేదికపై కల్యాణమూర్తులను అదిష్టింప చేసి కల్యాణం తంతు ప్రారంభించారు. సంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవాచనం తర్వాత కంకణధారణ జరిపించారు. తదుపరి స్వామివార్లకు సువర్ణ యజ్ఞోపవీత ధారణ జరిగింది. రాత్రి 10.17గంటలకు కల్యాణమూర్తులు స్వామివార్లు,అమ్మవార్ల శిరస్సున అర్చకస్వాములు జీలకర్ర,బెల్లం ఉంచి సుముహూర్తం జరిపించారు. అనంతరం మాంగల్యఽ ధారణ నిర్వహించారు. ఆహ్లాదంగా ముత్యాల తలంబ్రాలు కార్యక్రమం జరిగింది. పున:పూజ, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించడంతో కల్యాణ మహోత్సవం తంతు ముగిసింది. భ క్తులకు ముత్యాల తలంబ్రాలు స్వామి తీర్థప్రసాదాలు అందచేశారు.
టీటీడీ పట్టువస్ర్తాల సమర్పణ
స్వామివారికి టీటీడీ సమర్పించిన పట్టువసా్త్రలను సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం, కృష్ణకుమారి దంపతులతో మంత్రి సుభాష్ సతీమణి లక్ష్మీసునీత సమర్పించారు. దేవదాయ శాఖ తనిఖీదారు రాపాక బాలాజీరామ్‌ప్రసాద్, వాడ్రేవు సుందరరత్నాకరావు, ఏపీ నాటక అకాడమీ డైరెక్టరు పెంకె అన్నపూర్ణ, సర్పంచ్ కొత్తపల్లి అరుణ, వైస్ ఎంపీపీ నరాలరాజ్యల క్ష్మిస్వామివారి కల్యాణమహోత్సవాన్ని తిలకించారు. స్వామి కల్యాణ మహోత్సవం లో ద్రాక్షారామకు చెందిన రామకృష్ణ స్వీట్స్ యాళ్ల సత్యనారాయణస్వామివారికి 190కిలోల లడ్డూను సమర్పించారు.
రుద్రాభిషేకం, లక్షరుద్రాక్ష పూజ
మాణిక్యాంబసమేత భీమేశ్వరస్వామి కల్యా ణ మహోత్సవం పురస్కరించుకుని బుధవారం ఉదయం భీమేశ్వరస్వామికి ఏకాదశ రు ద్రాభిషేకం ఘనంగా జరిగింది. గణపతిపూజ, మహాన్యాసం అనంతరం పుణ్యనదీజలాలు, పంచామృతాలు, పండ్లరసాలతో స్వామిని అభి షేకించారు. లక్షరుద్రాక్షలతో పూజ నిర్వహించారు.అర్చకులు శ్రీకాంత్, విశ్వప్రకాష్, రమేష్, రాజు, రఘు, వేదపండితులు బులుసు రామకృష్ణ, సతీష్, రామ జోగేశ్వర శాసి్త్ర, స్వస్వివాచకులు మైలవరపు శ్రీమన్నారాయణశర్మ, ఆంజ నేయశర్మ, భీమశంకరం, ఫణిరామకృష్ణ పూజాధికాలు జరిపించారు.
శాసో్త్రక్తంగా మంగళస్నానం
ఉదయం 5.45గంటలకు కల్యాణమూర్తులను ఆహ్వానించారు. తదుపరి భీమేశ్వరస్వామి, మాణిక్యాంబ అమ్మవార్లను వధూవరుల ను చేశారు. శాసో్త్రక్తంగా ముత్తయిదువులు పసు పు దంచారు. అనంతరం కల్యాణమూర్తులకు అర్చకస్వాములు మంగళస్నానం చేయించా రు. వధూవరులుగా అలంకరించారు. స్వామికల్యాణ మహోత్సవంలో సాయంత్రం 3.30గంటలకు ధ్వజారోహణం, అంకురార్పణ జరిపారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనరు అల్లు వెంకటదుర్గాభవానీ పర్యవేక్షణలో సి బ్బంది భక్తులకు సేవలందించారు. సీఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఎస్‌ఐ లక్ష్మణ్ ద్రాక్షారామ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.