రాష్ట్రస్థాయి ఉత్సవంలా డ్రాగన్ పడవ పోటీలు
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:40 AM
ఆత్రేయపురం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి ఉత్సవంలా డ్రాగన్ పడవ పోటీలు నిర్వహిస్తున్నట్టు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అం బేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం లొల్ల లా కుల వద్ద శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించా
ఈనెల 11, 12, 13న స్విమ్మింగ్,
రంగవల్లులు, పతంగుల పోటీలు
కొత్తపేట ఎమ్మెల్యే బండారు
ఆత్రేయపురం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి ఉత్సవంలా డ్రాగన్ పడవ పోటీలు నిర్వహిస్తున్నట్టు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అం బేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం లొల్ల లా కుల వద్ద శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సర్‌ఆర్ధర్ కాటన్ గోదావరి ట్రోఫి ఆత్రేయపురం ఉత్సవ్-2026లో భాగంగా ఈనెల 11, 12, 13 తేదీల్లో డ్రాగన్ పడవ పోటీలు, స్విమ్మింగ్, రంగవల్లులు, పతంగుల పోటీలను జాతీయస్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు. 11న స్విమ్మింగ్, పతంగులు, రంగవల్లులతో పోటీలు ప్రారంభిస్తామన్నారు, 12, 13 తేదీల్లో డ్రాగన్ పడవ పోటీలు జరుగుతాయన్నారు. కేరళ, ఆం ధ్రాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి 25 డ్రాగన్ టీమ్ జట్లు పాల్గొంటాయన్నారు. ఒక్కో టీమ్‌లో పది మంది జలక్రీడాకారులు ఉంటారన్నారు. 200 మంది స్విమ్మింగ్‌కు దరఖాస్తులు చేసుకోగా రంగోలిలో పాల్గొనేందుకు 300 మంది, పతంగుల పోటీల్లో పాల్గొనేందుకు 100 మంది, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందాయన్నారు. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ నుంచి 12 మంది కోచ్‌లను డ్రా గన్ పోటీలకు ప్రభుత్వం నియమించిందన్నారు. మహాత్మాగాంధీ క్రీడాప్రాంగణంలో కనివిని ఎరుగని రీతిలో పలు ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. పర్యాటక ప్రదేశమైన లొల్ల లాకుల వద్ద డ్వాక్రా మహిళలు తయారు చేసిన రుచులతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ పోటీల వివరాలను ముఖ్యమం త్రి చంద్రబాబుకు వివరించి బ్రోచర్‌ను అందిస్తున్నట్టు తెలిపారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉత్సవానికి తరలివచ్చేలా ఆహ్వానాలు అందించా మని తెలిపారు. అనంతరం ఉత్సవ ప్రోమోను విడుదల చేశారు. తాడిపూడి ప్రధాన కాలువ వద్ద రహదారిని నిర్మించి వేదిక ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. స్టాల్స్, వినియోగత్మాక ప్రదర్శిం చే క్రీడా ప్రాంగణాన్ని, పోటీలు నిర్వహించే ప్రధాన కాలువను ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ బండా రు శ్రీనివాస్, ట్రోపీ అధ్యక్ష, ఉపాధ్య క్షులు కూసంపూడి రామకృష్ణంరాజు, వెత్సా అనిల్, ట్రోఫి స భ్యులు, అధికారులు, కూటమి శ్రేణులు ఉన్నారు.